Sahiba Teaser: విజయ్ దేవరకొండ ‘సాహిబా’ వీడియో సాంగ్ ప్రొమో రిలీజ్, మెరిసిన దుల్కర్ సల్మాన్
Vijay Deverakonda: బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధిక మదన్‌తో కలిసి విజయ్ దేవరకొండ నటించిన సాహిబా మ్యూజిక్ వీడియో సాంగ్ ప్రొమో వచ్చేసింది.
విజయ్ దేవరకొండ బాలీవుడ్ హీరోల తరహాలో మ్యూజిక్ వీడియో సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాధారణంగా సౌత్ నటులు ఇలా మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కనిపించడం చాలా అరుదు. బాలీవుడ్ హీరోలు మాత్రం రెగ్యులర్‌గా ఇలాంటి సాంగ్స్‌లో కనిపిస్తుంటారు. బాలీవుడ్‌లో చిన్న నటులే కాదు.. టాప్ హీరోలు కూడా మ్యూజిక్ వీడియో సాంగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ రాధిక మదన్‌తో విజయ్ దేవరకొండ మ్యూజిక్ వీడియో సాంగ్‌లో కనిపించబోతున్నాడు. సాహిబా అనే టైటిల్‌తో ఈ మేరకు సాంగ్ ప్రొమోను సోమవారం విడుదల చేయగా.. మ్యూజిక్ వీడియో సాంగ్ నవంబరు 15న రిలీజ్ చేయబోతున్నట్లు ఆ ప్రొమోలో పేర్కొన్నారు.
జస్లీన్ రాయల్‌తో కలిసి ఇప్పటికే రాధిక మదన్ చేసిన ‘నై జానా’ మ్యూజిక్ వీడియో సాంగ్ సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో ఈ సాహిబా పాటపై కూడా అంచనాలు మరింత పెరిగాయి. ఈ పాటలో ఫొటోగ్రాఫర్‌గా విజయ్ దేవరకొండ కనిపించాడు. ఈ పాటను సుధాన్షు సారియా తెరకెక్కించగా.. ప్రియా సారియా, ఆదిత్య శర్మ ఈ సాంగ్‌కి సాహిత్యం అందించారు.
విజయ్ దేవరకొండ నటించిన లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్ సినిమాలు వరుసగా అంచనాల్ని అందుకోలేకపోయాయి. దాంతో.. కొంచెం గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలకి సంతకం చేస్తున్నాడు. జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ, దిల్ రాజు ప్రొడక్షన్స్‌లోనూ ఒక సినిమాకి సంతకం చేసినట్లు తెలుస్తోంది. అలానే హుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీలోనూ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో ఆల్బల్‌లో దుల్కర్ సల్మాన్ కూడా ఆరంభంలో యోధుడిగా కనిపించాడు. దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ దీపావళికి విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోనూ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ మెరిసిన విషయం మెరిశారు.