Lokesh Kanagaraj on Leo Collection: లియో కలెక్షన్స్ ఎంతన్నది నాకు అనవసరం - లోకేష్ కనకరాజ్ కామెంట్స్ వైరల్
Lokesh Kanagaraj on Leo Collection: లియో మూవీ ఎంత వసూలు చేసిందన్నది తనకు అనవసరమని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అన్నాడు. ఈసినిమా కలెక్షన్స్ గురించి తనను కాకుండా ప్రొడ్యూసర్‌ను అడిగితే బెటర్ అని తెలిపాడు.
Lokesh Kanagaraj on Leo Collection: లియో కలెక్షన్స్‌పై ఓ మీడియా ఈవెంట్‌లో లోకేష్ కనకరాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. లియో కలెక్షన్స్ గురించి ప్రొడ్యూసర్‌ను అడగాలి కానీ తనను కాదని లోకేష్ కనకరాజ్ అన్నాడు. లియో ప్రమోషన్స్‌లో భాగంగా తమిళ మీడియాతో లోకేష్‌కనకరాజ్ ముచ్చటించారు. ఈ సందర్భంగా లియో కలెక్షన్స్ ఫేక్ అంటోన్న వస్తోన్న వార్తలు నిజమేనా మీడియా వారు అడిగిన ప్రశ్నకు లోకేష్ అసహనం వ్యక్తం చేశారు.
సినిమా కలెక్షన్స్ గురించి తానెప్పుడూ పట్టించుకోనని లోకేష్ కనకరాజ్ తెలిపాడు. తన సినిమా ఎంత వసూలు చేసింది, ఎన్ని కోట్లు రాబట్టిందదనే లెక్కలపై తనకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదని లోకేష్ కనకరాజ్ అన్నాడు. లియో సినిమా కలెక్షన్స్ ఎంతన్నది ప్రొడ్యూసర్లను అడిగితే బెటర్ అని, ఆ కలెక్షన్స్ లెక్కలు తనకు అనవసరం అంటూ ఆన్సర్ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.
సెకండాఫ్‌లో ఈ సినిమా ల్యాగ్ అయ్యిందనే కామెంట్స్ తాను విన్నానని, తనకు కూడా ఆ ఫీలింగ్ వచ్చిందని, కానీ కథలో ఫ్లో మిస్సవకూడదనే నిడివి తగ్గించలేదని లోకేష్ కనకరాజ్ చెప్పాడు. బాక్సాఫీస్ లెక్కలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు లియో సినిమా నచ్చడం ఆనందంగా ఉందని తెలిపాడు. లియో కలెక్షన్స్ గురించి లోకేష్ కనకరాజ్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోన్నాయి.
ఈ సినిమా కలెక్షన్స్ ఫేక్ అంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ కనకరాజ్ కలెక్షన్స్ గురించి చేసిన కామెంట్స్ తో ఫేక్ వార్తలు నిజమేకావచ్చునని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతోన్నారు.
పది రోజుల్లో 490 కోట్లు...
లియో సినిమా పది రోజుల్లో 490 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఓవర్‌సీస్‌లో రజనీకాంత్ 2.ఓ తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. లియో సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా అర్జున్, సంజయ్‌దత్ కీలక పాత్రలు పోషించారు. లియో తర్వత వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.