Latest Malayalam movies in OTT: ఓటీటీల్లోని లేటెస్ట్ మలయాళం సినిమాలు ఇవే
Latest Malayalam movies in OTT: ఓటీటీల్లోని మలయాళం సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉంది. భిన్నమైన కంటెంట్ తో మలయాళ సినిమాలు భాషలకు అతీతంగా సినిమా లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
Latest Malayalam movies in OTT: ఓటీటీలు వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకుల్లోనూ మలయాళ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఎప్పటికప్పుడు ఓటీటీల్లోకి వచ్చిన, రాబోతున్న మలయాళ సినిమాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓటీటీల్లో ఉన్న, త్వరలోనే రాబోతున్న మాలీవుడ్ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
మలయాళ సినిమాలు ఎక్కువగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, మనోరమ మ్యాక్స్ లాంటి ఓటీటీల్లోకి వస్తుంటాయి. వీటిలో కొన్ని నేరుగా సబ్ టైటిల్స్ తో రిలీజ్ అవుతుండగా.. కొన్ని డబ్బింగ్ వెర్షన్లు కూడా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్లు ఉన్న సినిమాలకు మరింత ఆదరణ లభిస్తోంది.
ఓటీటీల్లో ఉన్న మలయాళ సినిమాలు ఇవే
కన్నూరు స్క్వాడ్ - మలయాళంలో రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మూవీ ఇది. మమ్ముట్టి నటించిన ఈ సూపర్ హిట్ మూవీ వచ్చే శుక్రవారం (నవంబర్ 17) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి రాబోతోంది.
వాలట్టీ - రెండు కుక్కల చుట్టూ తిరిగే ఎమోషనల్ స్టోరీ ఇది. కుక్కలకూ ఫీలింగ్స్ ఉంటాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా తీసిన సినిమా. ఈ మూవీ నవంబర్ 7 నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.
కాసర్‌గోల్డ్ - రెండున్నర కోట్ల విలువైన బంగారం చోరీ చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాకు మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.
కింగ్ ఆఫ్ కొత్త - స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ సెప్టెంబర్ 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. లవర్ బాయ్ దుల్కర్ ను మాస్ పాత్రలో చూపించిన సినిమా ఇది.
18 ప్లస్ - సోనీలివ్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ మలయాళ సినిమా ప్రేమ, స్నేహం, కుటుంబ మద్దతు లేకుండా లేచిపోయి పెళ్లి చేసుకునే జంట పడే ఇబ్బందుల చుట్టూ తిరుగుతుంది. ఓ ఫీల్ గుడ్ మూవీ.
నెయ్‌మార్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఉన్న ఈ సినిమా కూడా మనషులు, జంతువుల మధ్య ఉండే బంధాన్ని చాటి చెప్పే సినిమా. నెయ్‌మార్ అనే ఓ కుక్క ఇద్దరు స్నేహితుల జీవితాలను ఎలా మార్చిందనేది ఇందులో చూడొచ్చు.
మాస్టర్‌పీస్ వెబ్ సిరీస్ - నిత్య మేనన్ నటించిన మలయాళ కామెడీ వెబ్ సిరీస్ ఇది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.
టాపిక్