Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. పండుగకు రానున్న బాలయ్య-latest film news balakrishna kajal aggarwal starrer bhagavanth kesari movie release date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. పండుగకు రానున్న బాలయ్య

Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. పండుగకు రానున్న బాలయ్య

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 22, 2023 02:35 PM IST

Bhagavanth Kesari: బాలయ్య హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా విడుదల తేదీ ఖరారైంది. రిలీజ్ డేట్‍ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Bhagavanth Kesari: బాలయ్య ‘భగవంత్ కేసరి’ రిలీజ్ డేట్ ఫిక్స్
Bhagavanth Kesari: బాలయ్య ‘భగవంత్ కేసరి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Bhagavanth Kesari: నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రంపై అందరిలోనూ చాలా ఆసక్తి నెలకొని ఉంది. మాస్ యాక్షన్‍కు మారుపేరు అయిన బాలయ్య.. కామెడీకి ఫేమస్ అయిన డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఈ మూవీ చేస్తుండడంతో భగవంత్ కేసరి కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. తొలిసారి తెలంగాణ యాసతో డైలాగ్స్ చెప్పాడు బాలకృష్ణ. కాగా, భగవంత్ కేసరి మూవీ గురించి నేడు మఖ్యమైన అప్‍డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమా రిలీజ్ డేట్‍ను ప్రకటించింది.

భగవంత్ కేసరి సినిమా ఈ ఏడాది అక్టోబర్ 19వ తేదీన విడుదల కానుంది. దసరా నవరాత్రుల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న షైన్ స్క్రీన్స్ నేడు ట్వీట్ చేసింది. “భగవంత్ కేసరి.. ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది. భగవంత్ కేసరి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కానుంది” అని ట్వీట్ చేసింది.

భగవంత్ కేసరి మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటిస్తోంది. యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. అర్జున్ రామ్‍పాల్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న భగవంత్ కేసరి సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా ఉండగా.. తమ్మి రాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

‘ఈ పేరు షానా ఏండ్లు యాదుంటది’ అని భగవంత్ కేసరి టీజర్లో బాలయ్య చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అలాగే తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ డెలివరీ కూడా అదిరిపోయింది. టీజర్లో థమన్ బ్యాక్‍గ్రౌండ్ స్కోర్ కూడా సూటైంది.

టీ20 వరల్డ్ కప్ 2024