Krishna mukunda murari serial january 20th: ఆదర్శ్ ని కలుసుకున్న మురారి, కృష్ణ.. మనసులోని కుట్ర బయట పెట్టిన ముకుంద
Krishna mukunda murari serial today january 20th: ఆదర్శ్ ఆచూకీ తెలిసిందని కృష్ణ, మురారి చెప్పడంతో ముకుంద అసహనంగా ఫీల్అవుతుంది. తన ప్రేమని వదులుకునే ప్రసక్తే లేదని అంటుంది.
Krishna mukunda murari serial today january 20th: అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు కృష్ణ, మురారి వస్తారు. అప్పుడే భవానీ కూడా వస్తుంది. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అంటుంది. ఏంటో చెప్పమని అంటుంది. ఆదర్శ్ ఆచూకీ తెలిసిందని అనేసరికి అందరి మొహాలు వెలిగిపోతాయి. ముకుంద మాత్రం షాకై పోతుంది. రేపు వెళ్ళి అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్తున్నామని చెప్తుంది. మేము తిరిగొచ్చేది ఆదర్శ్ తోనే అని మురారి అనేసరికి భవానీ సంతోషిస్తుంది. ముకుందని భవానీ పక్కన కూర్చోమంటే భవానీ కోపంగా మధు నువ్వు వచ్చి కూర్చో అంటుంది. దీంతో ముకుంద బాధగా వెళ్ళిపోతుంది.
ఆదర్శ్ ఆచూకీ తెలిసిందన్న కృష్ణ
ఆదర్శ్ రావడం అనేది మంచిదే కానీ వచ్చాక ఏం జరుగుతుందనే విషయం తలుచుకుంటే బాధగా ఉందని అంటుంది. చెప్పాను కదా అత్తయ్య ఆదర్శ్ వచ్చాక బాధ్యత తనదేనని కృష్ణ చెప్తుంది. మురారిని భవానీ సూటిగా ఒక ప్రశ్న వేస్తుంది. నీ స్థానంలో ఆదర్శ్, ఆదర్శ్ స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావ్. ఇంటికి వస్తావా అని అడుగుతుంది. తీసుకొచ్చినంత తేలిక కాదు ఇక్కడ ఉండటం దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. వాడు రావడం ఎంత సంతోషంగా ఉందో వచ్చాక ఏం జరుతుందోననే టెన్షన్ ఎక్కువగా ఉందని భవానీ అనేసరికి మురారి, కృష్ణ మౌనంగా ఉండిపోతారు.
కృష్ణ వాళ్ళు మెహతా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడే అతను వస్తాడు. ఆదర్శ్ జాబ్ రిజైన్ చేశాడు. ఆరు నెలలు అవుతుందట అనేసరికి షాక్ అవుతారు. రిజైన్ చేసి ఎక్కడికి వెళ్లాడని కృష్ణ అడుగుతుంది. అక్కడే కొంచెం దూరంలో ఒక పల్లెటూరులో ఉంటున్నట్టు తెలిసింది. ఇంతకాలం ఆర్మీకి సేవ చేసినందుకు గాను ఆర్మీ ఆ ఊర్లో స్థలం ఇచ్చింది అక్కడే ఉంటున్నాడని మెహతా చెప్తాడు. ఊరు పేరు ఏంటని కృష్ణ అడుగుతుంది. ఊరు పేరు యూరి అని చెప్తాడు. రోడ్డు మార్గం ద్వారా అక్కడికి వెళ్లవచ్చని చెప్పేసరికి వెంటనే అక్కడికి బయల్దేరదామని కృష్ణ చెప్తుంది. ఇంటికి వెళ్ళి పెద్దత్తయ్యకి విషయం చెప్దామని మురారి అంటే టైమ్ వేస్ట్ కాల్ చేసి చెప్దామని అంటుంది.
తన ప్రేమని వదులుకునేది లేదన్న ముకుంద
ముకుంద గదిలో ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆదర్శ్ వస్తే ఏం చేయాలి. మురారికి ఆదర్శ్ తో కలిసి ఉంటానని మాట ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి నా ప్రేమని చంపుకోవాలా? అని అనుకుంటూ ఉండగా చంపుకోవాలి తప్పదని ముకుంద అంతరాత్మ ప్రత్యక్షం అవుతుంది.
ముకుంద: చంపుకోవడానికా నేను ఇంత కాలం వెయిట్ చేసింది
అంతరాత్మ: వెయిట్ చేసి ఏం చేశావ్ ఛీటర్ అనే అపవాదు అని పెద్దత్తయ్య మనసులో నాటుకునేలా చేశావ్
ముకుంద: పెద్దత్తయ్య ఇవాళ కాకపోతే రేపు అయినా మారుతుంది
అంతరాత్మ: నా మాట విను
ముకుంద: నేను ఎవ్వరి మాట వినను అని కోపంగా అనేసరికి అంతరాత్మ వెళ్ళిపోతుంది.
ముకుందతో పెళ్లి అయితే చనిపోయేదానన్న కృష్ణ
కృష్ణ, మురారి కారులో వెళ్తూ ఉండగా ఇంక ఎంత దూరమని అంటుంది. ఆదర్శ్ ఎందుకు ఇలా చేశావ్ అందరికీ చెప్పి వెళ్ళి ఉండవచ్చు కదా. ఆరోజే జరిగింది మొత్తం పెద్దత్తయ్యకి చెప్పి ఉంటే స్పాట్ లోనే డెసిషన్ తీసుకుని ఉండేది కదా బాధగా అంటుంది. వెంటనే మురారి కారు ఆపేయమని చెప్పి దిగి మురారిని హగ్ చేసుకుంటుంది. మీరు చెప్పినట్టు పెద్దత్తయ్య అప్పుడే మీకు ముకుందని ఇచ్చి పెళ్లి చేసేది. నేను చచ్చిపోయి ఉండేదాన్ని అనేసరికి మురారి తన నోటికి చెయ్యి అడ్డం పెడతాడు. ఇది దేవుడు రాసిన రాత దాన్ని ఎవరూ మార్చలేరని అంటాడు.
ఆదర్శ్ చెప్పకపోవడం నిజంగా చాలా మంచిది. ఆదర్శ్ దేవుడని మెచ్చుకుంటుంది. ఆదర్శ్ రాను అంటే కన్వీన్స్ చేసే బాధ్యత మీదేనని కృష్ణ చెప్తుంది. తనని తీసుకునే ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. పెద్దమ్మ రావద్దు డిస్ట్రబ్ అవుతాడని అంటుంది కదా అంటే అత్తయ్యని కన్వీన్స్ చేయడం తన వంతని కృష్ణ హామీ ఇస్తుంది. ఇద్దరూ ఒక దాబా దగ్గర ఆగుతారు. మనం హనీమూన్ కి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వెళ్లాలని అనుకున్నాం కదా ఇలా డ్రైవింగ్ చేయడం తన వల్ల కాదని అంటాడు. అందుకే మిమ్మల్ని ఏబీసీడీల అబ్బాయి అనేది నెల రోజులు అలా సరదాగా ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా అంటుంది.
ఆదర్శ్ ని కలుసుకున్న మురారి
ఆదర్శ్ రాకపోతే పరిస్థితి ఏంటి పెద్ద పుడింగిలాగా శపథాలు చేసి వచ్చానని మనసులో అనుకుంటుంది. హోటల్ లో ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఇక మురారి వాళ్ళు కశ్మీర్ చేరుకున్నట్టు చూపిస్తారు. ఈ సీన్ మాత్రం చాలా కామెడీగా అనిపిస్తుంది. జస్ట్ ఒక్క రాత్రిలో కశ్మీర్ లోని యూరికి చేరుకుంటారు. ఇక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీన్ వచ్చేసింది. కృష్ణ, మురారి ఆదర్శ్ దగ్గరకి వస్తారు. మీరు ఎవరని ఆదర్శ్ అడిగితే కృష్ణ మురారి అని చెప్తుంది. వెంటనే ఆదర్శ్ తనని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు.