OTT Korean Movie: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన కొరియన్ రొమాంటిక్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..-korean romantic comedy movie crazy romance now streaming on amazon prime video in telugu and other three languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Korean Movie: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన కొరియన్ రొమాంటిక్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Korean Movie: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన కొరియన్ రొమాంటిక్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 02, 2024 02:08 PM IST

OTT Korean Romantic Movie: క్రేజీ రొమాన్స్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ కొరియన్ రొమాంటిక్ డ్రామా మూవీ తెలుగులో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మరో మూడు భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది.

OTT Korean Movie: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన కొరియన్ రొమాంటిక్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Korean Movie: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన కొరియన్ రొమాంటిక్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఓటీటీల్లో కొరియన్ సినిమాలకు క్రేజ్ విపరీతంగా ఉంటుంది. అందుకే కొన్నేళ్ల కింద రిలీజైన చిత్రాలను కూడా ఓటీటీలు తీసుకొస్తూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కొరియన్ చిత్రాలకు ఆదరణ ఉండటంతో డబ్బింగ్‍లోనూ తెస్తుంటాయి. ఈ క్రమంలోనే ‘క్రేజీ రొమాన్స్’ మూవీ ఇప్పుడు ఇండియాలో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

క్రేజీ రొమాన్స్ చిత్రంలో కిమ్ రయీ వన్, కాంగ్ హ్యో జిన్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీకి కిమ్ హన్‍ గ్యుల్ దర్శకత్వం వహించారు. 2019లో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు భారత్‍లో ఓటీటీలో అడుగుపెట్టింది.

స్ట్రీమింగ్ ఎక్కడ?

క్రేజీ రొమాన్స్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. తెలుగు డబ్బింగ్‍లోనూ స్ట్రీమ్ అవుతోంది. కొరియన్, తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఈ మూవీ అడుగుపెట్టింది.

క్రేజీ రొమాన్స్ స్టోరీలైన్

లీ జే హూన్ (కిమ్ రయీ వన్) లవ్ బ్రేకప్ అవుతుంది. అయినా ఆమెను మర్చిపోలేక సతమతం అవుతుంటాడు. అతడు పని చేస్తున్న ఆఫీస్‍లోనే సన్ యంగ్ (కాంగ్ హ్యో జిన్) జాయిన్ అవుతుంది. ఆమె కూడా బాయ్‍ఫ్రెండ్‍తో గొడవ పడి విడిపోయి ఉంటుంది. ఈ క్రమంలో ఆఫీస్‍లో పరిచయం ఏర్పడ్డాక హూన్, యంగ్ లవ్‍లో పడతారు. ప్రేమించుకుంటారు. అయితే, వారి మధ్య విభేదాలు వస్తాయి. సవాళ్లు ఎదురవుతాయి. చివరికి వీరు సజావుగా ఉన్నారా అనే విషయం ఈ మూవీలో ఉంటుంది. లవ్ స్టోరీతో పాటు కామెడీ కూడా ఈ కొరియన్ డ్రామా మూవీలో ప్రధానంగా ఉంటుంది.

క్రేజీ రొమాన్స్ మూవీలో రయీ వన్, జిన్‍తో పాటు కాంగ్ కీ యంగ్, జంగ్ వూంగ్ ఇన్, జంగ్ సో యెయిన్, లీ చీయన్, సంగ్ బ్యోంగ్ సూక్ కీలకపాత్రలు పోషించారు. కిమ్ హన్‍ గ్యుల్ ఈ మూవీని తెరకెక్కించారు.

స్ట్రీమింగ్‍కు ‘సెన్సార్’ చిత్రం

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తాజాగా ‘సెన్సార్’ అనే బ్రిటీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్, ఇటాలియన్, డచ్‍లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం కూడా థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఇండియాలో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో నియామ్ అల్గార్, నికోలస్ బర్న్స్, విన్సెంట్ ఫ్రాంక్లిన్, సోఫియా లా పోర్టా కీలకపాత్రలు పోషించారు.

సెన్సార్ మూవీని ప్రానో బెయిలీ బాండ్ దర్శకత్వం వహించారు. ఇంట్రెస్టింగ్ పాయింట్‍తో రూపొందించారు. తప్పిపోయిన తన చెల్లిని ఓ సినిమాలో చూసి అవాక్కవుతుంది ఇనిద్ బైనెస్ (అల్గర్). దీంతో ఆమెను వెతికి పట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది. మొత్తానికి చాలా ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు చెల్లి వద్దకు వెళుతుంది. అయితే, క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమెను చూస్తుంది బైెనెస్. ఇందుకు కారణం ఏంటి? ఆమె చెల్లి ఎందుకు అలా అయింది? ఈ మిస్టరీని బైనెస్ ఛేదించి తన చెల్లిని రక్షిస్తుందా? అనే అంశాల చుట్టూ సెన్సార్ మూవీ తిరుగుతుంది. హారర్ ఎలిమెంట్లతో గ్రిప్పింగ్‍గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాండ్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.