Kerala Crime Files Season 2: కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచి అంటే?
Kerala Crime Files Season 2: ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. మలయాళం నుంచి వచ్చిన తొలి వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ రెండో సీజన్ అనౌన్స్ చేసింది.
Kerala Crime Files Season 2: కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ కొత్త సీజన్ ను అనౌన్స్ చేశారు. గతంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తొలి సీజన్ స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఓటీటీ రెండో సీజన్ త్వరలోనే రాబోతోందని చెప్పింది. మలయాళం నుంచి వచ్చిన తొలి వెబ్ సిరీస్ అయిన కేరళ క్రైమ్ ఫైల్స్ కు అహ్మద్ ఖబీర్ దర్శకత్వం వహించాడు.
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2ను అనౌన్స్ చేస్తూ హాట్‌స్టార్ ఓటీటీ ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ద్వారానే సీజన్ 2లో జరగబోయే కొత్త క్రైమ్ ఏంటో కూడా మేకర్స్ పరోక్షంగా చెప్పేశారు. ఓ పోలీసు అధికారి వెనుక భాగాన్ని చూపిస్తూ అతని టోపీపై క్రికెట్ స్టేడియాన్ని ఉంచారు. దీని ద్వారా బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి క్రైమ్స్ చుట్టూ ఈ రెండో సీజన్ తిరిగేలా కనిపిస్తోంది.
"వెలికితీసిన ఓ క్రైమ్ కొత్త చాప్టర్ వేచి చూస్తోంది. హాట్ స్టార్ స్పెషల్స్, కేరళ ఫైల్స్ సీజన్ 2 త్వరలోనే" అనే క్యాప్షన్ తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ పోస్టులో డైరెక్టర్ అహ్మద్ ఖబీర్ తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ లను కూడా హాట్ స్టార్ ట్యాగ్ చేసింది. కొత్త సీజన్ ఎప్పటి నుంచి అన్నది మాత్రం చెప్పలేదు.
కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్
కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ కు బహుల్ రమేష్ కథ అందించాడు. గతేడాది జూన్ లో ఈ సిరీస్ తొలి సీజన్ స్ట్రీమింగ్ అయింది. ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సిరీస్ ద్వారానే అజు వర్గీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై అడుగు పెట్టాడు. అతడు ఇందులో సబ్ ఇన్స్‌పెక్టర్ పాత్ర పోషించాడు.
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లు ఊహించని మలుపులతో ఫాస్ట్‌ఫేజ్‌లో సాగుతుంటాయి. హీరో తన తేలివితేటల్ని ఉపయోగించి క్రైమ్‌ను ఎలా సాల్వ్ చేశాడన్నది చూపిస్తుంటారు. కానీ కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది.
ఓ మర్డర్ కేసును పోలీసులు నిజంగా ఎలా ఇన్వేస్టిగేట్ చేస్తారు? ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సవాళ్లను చాలా సహజంగా స్క్రీన్‌పై చూపించారు డైరెక్టర్. సిరీస్ చూస్తున్నట్లుగా కాకుండా పోలీస్ జీవితాల్ని, వారి వృత్తిని వాస్తవికంగా కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. ఉద్యోగబాధ్యతలకు, వ్యక్తిగత జీవితానికి మధ్య పోలీసులు ఎదుర్కొనే సంఘర్షణను అర్థవంతంగా ఈ సిరీస్‌లో చూపించారు.
కేరళ క్రైమ్ ఫైల్స్ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌గా చెప్పవచ్చు. కమర్షియల్ హంగులకు తావు లేకుండా చాలా రియలిస్టిక్‌గా సాగుతూ అలరిస్తుంది. నిదానంగా సాగే కథాగమనమే కాస్త బోర్ కొట్టిస్తుంది. మరి ఇప్పుడు రాబోయే రెండో సీజన్ ఎలా ఉండబోతోందో చూడాలి.
టాపిక్