Disney+ Hotstar February Releases: హాట్‌స్టార్‌ ఓటీటీలో ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న మూవీస్, వెబ్ సిరీస్ ఇవే-disney plus hotstar ott february releases movies and web series to stream in hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Disney+ Hotstar February Releases: హాట్‌స్టార్‌ ఓటీటీలో ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

Disney+ Hotstar February Releases: హాట్‌స్టార్‌ ఓటీటీలో ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Feb 01, 2024 04:20 PM IST

Disney+ Hotstar February Releases: ప్రముఖ ఓటీటీల్లో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఫిబ్రవరి నెలలో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

హాట్ స్టార్ లో రానున్న మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్
హాట్ స్టార్ లో రానున్న మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్

Disney+ Hotstar February Releases: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఎప్పటిలాగే ఈ ఫిబ్రవరి నెలలోనూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

ఇందులో మెగా ఇంటి కోడలు లావణ్య త్రిపాఠీ నటించిన వెబ్ సిరీస్ తోపాటు సూపర్ హీరో సినిమాలు, రొమాంటిక్ కామెడీలు కూడా ఉన్నాయి. మరి ఈ నెలలో హాట్ స్టార్ మన ముందుకు తీసుకొస్తున్న ఆ సినిమాలు, సిరీస్ ఏంటో ఒకసారి చూద్దాం.

మిస్ పర్ఫెక్ట్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 2

పులి మేక వెబ్ సిరీస్ తో ఓటీటీలో ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య త్రిపాఠీ ఇప్పుడు మరో సిరీస్ తో వస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు మిస్ పర్ఫెక్ట్. ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓసీడీతో బాధపడుతూ అంతా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలనుకునే అమ్మాయి పాత్రలో లావణ్య ఇందులో నటించింది. ఈ సిరీస్ లో లావణ్యతోపాటు బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్, ఝాన్సీ, హర్షవర్ధన్ కూడా నటించారు.

ది మార్వెల్స్ - మూవీ

గతేడాది నవంబర్ లో థియేటర్లలో రిలీజైన ది మార్వెల్స్ మూవీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొస్తుంది. ఈ మూవీ ఫిబ్రవరి 7 నుంచి హాట్ స్టార్ లో అందుబాటులో ఉంటుంది. అందరూ ఫిమేల్ సూపర్ హీరోలే నటించిన ఈ సినిమాకు నియా డకోస్టా దర్శకత్వం వహించింది. ముగ్గురు ఫిమేల్ సూపర్ హీరోలు ప్రపంచాన్ని ఎలా కాపాడతారన్న స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది.

ఆర్య సీజన్ 3 అంతిమ్ వార్ - వెబ్ సిరీస్

బాలీవుడ్ నటి సుష్మితా సేన్ నటించిన వెబ్ సిరీస్ ఆర్య. ఈ సిరీస్ మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే ఈ సిరీస్ లో సుష్మిత చాలా పవర్ ఫుల్ పాత్రలో నటించింది. తన భర్త మరణం తర్వాత ఈ డ్రగ్ మాఫియా నుంచి తన పిల్లలను కాపాడుకుంటూనే అనుకోకుండా అదే డ్రగ్ మాఫియా క్వీన్ గా ఆర్య ఎలా ఎదిగింది అన్నది ఈ సిరీస్ స్టోరీ. ఫిబ్రవరి 9 నుంచి ఈ మూడో సీజన్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

షోగన్ - వెబ్ సిరీస్

షోగన్ ఓ జపనీస్ వెబ్ సిరీస్. 2018లో ఇదే పేరుతో వచ్చిన నవలను సిరీస్ లా తెరకెక్కించారు. ఈ హిస్టారికల్ డ్రామా సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 17వ శతాబ్దపు జపాన్ ను కళ్లకు కట్టేలా ఈ సిరీస్ సాగనుంది. ఫిబ్రవరి నెలలో హాట్ స్టార్ లో రాబోతున్న ఆసక్తికరమైన సిరీస్ లలో ఇదీ ఒకటి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఇలా..

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మూడు ప్లాన్లలో అందుబాటులో ఉంది. ఏడాదికి రూ.899, ఏడాదికి రూ.1499, నెలకు రూ.299 ప్లాన్స్ ఉన్నాయి. ఏడాదికి రూ.1499 ప్రీమియం ప్లాన్ తీసుకుంటే ఒకేసారి నాలుగు డివైస్ లతోపాటు యాడ్స్ లేకుండా కంటెంట్ చూసే వీలుంటుంది. అదే రూ.899లో మాత్రం రెండు డివైస్ లలో, యాడ్స్ తో చూడాల్సి ఉంటుంది.

IPL_Entry_Point