Katrina Kaif pregnant: కత్రినా కైఫ్ కూడా ప్రెగ్నెంటే.. అనుష్కలాగా అక్కడే డెలివరీ
Katrina Kaif pregnant: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా ప్రెగ్నెంట్ అని, ఆమె కూడా అనుష్క శర్మలాగే లండన్ లో తొలి సంతానానికి వెల్కమ్ చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Katrina Kaif pregnant: కత్రినా కైఫ్ కూడా గర్భం దాల్చిందా? భర్త విక్కీ కౌశల్ తో కలిసి ఆమె లండన్ లో ఏం చేస్తోంది? మరో బాలీవుడ్ నటి, క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మలాగా ఆమె కూడా అక్కడే ఫస్ట్ బేబీకి వెల్కమ్ చెప్పబోతోందా? సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయినప్పటి నుంచీ ఇలాంటి ప్రశ్నలు, కామెంట్స్ తో నిండిపోతున్నాయి. అయితే దీనిపై ఈ సెలబ్రిటీ కపుల్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.
కత్రినా కైఫ్ కూడా ప్రెగ్నెంటేనా?
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కలిసి లండన్ వీధుల్లో నడుస్తున్న ఓ వీడియో ఈ వార్తలకు కారణమైంది. ఇందులో కత్రినా కాస్త వదులైన దుస్తుల్లో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు జూమ్ లో వచ్చిన రిపోర్టు మేరకు కత్రినా నిజంగానే ప్రెగ్నెంట్ అని తేలింది. ఈ బాలీవుడ్ కపుల్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయంటూ ఆ సైట్ ఈ విషయం తెలిపింది.
అంతా సక్రమంగా జరిగితే విక్కీ, కత్రినా తమ తొలి సంతానానికి లండన్ లోనే వెల్కమ్ చెప్పబోతున్నారని కూడా ఆ వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుష్క శర్మ కూడా తన రెండో బిడ్డకు లండన్ లోనే జన్మనిచ్చిన విషయం తెలిసిందే. విరాట్, అనుష్క జంట తమ రెండో ప్రెగ్నెన్సీని మొదటి నుంచీ సీక్రెట్ గా ఉంచుతూ చివరికి లండన్ లో డెలివరీ ప్లాన్ చేశారు.
ఇక ఇప్పుడు కత్రినా కూడా అదే ప్లాన్ లో ఉన్నట్లు ఆ రిపోర్టు తెలిపింది. పైగా కత్రినా లండన్ లో పుట్టి పెరిగింది. అక్కడ ఆమెకు సొంత ఇల్లు కూడా ఉంది. దీంతో కత్రినా అక్కడే బిడ్డకు జన్మనివ్వబోతోందని, విక్కీ కూడా అక్కడే ఉన్నాడని వాళ్ల సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లండన్ నుంచి వచ్చిన వీడియోలోనూ కత్రినా బేబీ బంప్ తోనే ఉన్నట్లు చెబుతున్నారు.
తల్లులవుతున్న బాలీవుడ్ స్టార్స్
బాలీవుడ్ స్టార్స్ వరుసగా తల్లులవుతున్నారు. మొదట అనుష్క శర్మ, తర్వాత ఆలియా భట్ ఇప్పటికే అమ్మలయ్యారు. అనుష్క ఇద్దరు సంతానానికి తల్లి కాగా.. ఆలియా ఒకరికి జన్మనిచ్చింది. ఇక దీపికా పదుకోన్ కూడా ఇప్పుడు ప్రెగ్నెంటే. గత ఫిబ్రవరిలోనే రణ్వీర్, దీపికా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించగా.. ఈ మధ్యే ఆమె తొలిసారి తన బేబీ బంప్ ను కూడా చూపించింది.
ఇక ఇప్పుడు కత్రినా కైఫ్ కూడా ప్రెగ్నెంట్ అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ జంట కూడా ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని భావిస్తున్నట్లుంది. అందుకే సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు, కామెంట్స్ వస్తున్నా వాటిపై స్పందించడం లేదు. అయితే తాజాగా వీడియో చూస్తుంటే మాత్రం కత్రినా కచ్చితంగా ప్రెగ్నెంట్ గానే కనిపిస్తోందని, ఆమె డ్రెస్సింగ్, నడక అదే కన్ఫమ్ చేస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. మరి తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. కత్రినా కూడా లండన్ లోనే తొలి సంతానానికి జన్మనిస్తుందేమో చూడాలి.