Karthikeya 2 OTT Release Date: కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌-karthikeya 2 ott release date fixed as the movie to stream in zee5 from dussehra
Telugu News  /  Entertainment  /  Karthikeya 2 Ott Release Date Fixed As The Movie To Stream In Zee5 From Dussehra
అంచనాలకు మించి సక్సెస్ అయిన కార్తికేయ 2
అంచనాలకు మించి సక్సెస్ అయిన కార్తికేయ 2

Karthikeya 2 OTT Release Date: కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

26 September 2022, 16:53 ISTHT Telugu Desk
26 September 2022, 16:53 IST

Krathikeya 2 OTT Release Date: కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ సంచలనాలను సృష్టించిన ఈ మూవీ డిజిటల్‌ ప్రీమియర్‌ కోసం ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Krathikeya 2 OTT Release Date: ఓ చిన్న సినిమాగా రిలీజ్‌కు థియేటర్లు కూడా సరిగా దొరకని పరిస్థితుల్లో రిలీజై.. ఆ తర్వాత పెను సంచలనాలు సృష్టించింది కార్తికేయ 2 మూవీ. టాలీవుడ్‌లోనే కాదు హిందీ బెల్ట్‌లోనూ దుమ్ము రేపింది. బాక్సాఫీస్‌ వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా ఈ మూవీ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్న జీ5 (ZEE5) కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్‌ చేసింది. అక్టోబర్ 5న దసరా సందర్భంగా ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా జీ5లో అందుబాటులోకి రానుండటం విశేషం. థియేటర్లలో అంచనాలకు మించి సక్సెసైన ఈ సినిమా.. ఓటీటీలోనూ అలాంటి సంచలనాలనే సృష్టిస్తుందని మేకర్స్‌ ఆశతో ఉన్నారు.

కార్తికేయ 2 మూవీ గురించి..

కృష్ణుడి పౌరాణిక గాథ‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా మొద‌లవుతుంది. క‌లికాలంలో జ‌ర‌గ‌బోయే అన‌ర్థాల‌కు ప‌రిష్కార మార్గాల్ని కృష్ణుడు ముందుగానే సూచించ‌డం అనే పాయింట్ ఆక‌ట్టుకుంటుంది. భ‌క్తి, సైన్స్ రెండు అంశాల‌ను స‌మాంత‌రంగా చూపిస్తూ క‌థ ముందుకు సాగుతుంది. కృష్ణుడి ర‌హ‌స్యాల‌ను సేక‌రించ‌డానికి రావు కృషి చేస్తున్న‌ట్లుగా చూపిస్తూనే మ‌రోవైపు సృష్టిలోని ప్ర‌తి విష‌యం వెనుక సైన్స్ ఉంటుంద‌ని న‌మ్మే కార్తికేయ జ‌ర్నీని నడిపించడం ఆకట్టుకుంటుంది.

కార్తికేయ ద్వార‌కలో అడుగుపెట్ట‌డంతోనే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. పోలీస్ లు అరెస్ట్ చేయడం, త‌న బాధ్యత ఏమిటో ఎలా తెలుసుకోగలిగాడ‌నే అంశాలను గ్రిప్పింగ్‌గా చెప్పారు. ద్వితీయార్థంలో కృష్ణుడి కంక‌ణాన్ని ఎక్క‌డ దాగి ఉంద‌నేది కార్తికేయ ఎలా తెలుసుకున్నాడు? శాంత‌ను బారి నుంచి ఆ కంకాణాన్ని కాపాడటానికి అత‌డు సాగించిన పోరాటాన్ని ఉత్కంఠ‌, థ్రిల్ మేళ‌వింపుతో సెకండాఫ్‌లో చూపించారు.

కార్తికేయ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు

ఈ ఏడాది టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మోస్ట్ ఫ్రాపిట‌బుల్ సినిమాల్లో ఒక‌టిగా కార్తికేయ 2 నిలిచింది. ఎలాంటి హైప్ లేకుండా ఆగ‌స్ట్ 13న రిలీజ్ అయినా ఈ చిన్న సినిమా ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 130 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగులో దాదాపు అర‌వై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ దక్కించుకొని బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌తో స‌మానంగా బాలీవుడ్‌లో ఈ సినిమా ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకున్న‌ది.

నెల రోజుల్లో ఈ సినిమా బాలీవుడ్ లో 31 కోట్ల కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బాలీవుడ్‌లో ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెన్ నాలుగున్న‌ర కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు తెలిసింది. ఊహించ‌ని విధంగా ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కుకు ఐదింత‌ల లాభాల్ని తెచ్చిపెట్టింది.