Japan Review: జపాన్ రివ్యూ.. కార్తీ స్లాంగ్ అదుర్స్.. మరి మూవీ ఎలా ఉందంటే?-karthi japan movie review and rating in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Japan Review: జపాన్ రివ్యూ.. కార్తీ స్లాంగ్ అదుర్స్.. మరి మూవీ ఎలా ఉందంటే?

Japan Review: జపాన్ రివ్యూ.. కార్తీ స్లాంగ్ అదుర్స్.. మరి మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 10, 2023 01:59 PM IST

Karthi Japan Movie Review: తమిళ స్టార్ హీరో కార్తీ తాజాగా నటించిన సినిమా జపాన్. ఈ మూవీ నేడు అంటే నవంబర్ 10న విడుదలైంది. మరి విచిత్రమైన గెటప్‌తో కార్తీ చేసిన జపాన్ మూవీ రివ్యూలోకి వెళితే..

కార్తీ నటించిన జపాన్ మూవీ రివ్యూ
కార్తీ నటించిన జపాన్ మూవీ రివ్యూ

టైటిల్: జపాన్

నటీనటులు: కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్, కేఎస్ రవి కుమార్ తదితరులు

సినిమాటోగ్రఫీ: ఎస్ రవి వర్మన్

సంభాషణలు (తెలుగులో): రాకేందు మౌళి

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

నిర్మాతలు: ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు

దర్శకత్వం: రాజు మురుగన్

విడుదల తేది: నవంబర్ 10, 2023

Japan Movie Review In Telugu: కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్‌కు రాజు మురుగన్ దర్శకత్వం వహించగా.. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేసింది. సునీల్ కీలక పాత్ర పోషించిన జపాన్ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసింది. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 10న విడుదలైన జపాన్ మూవీ మరి ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:

హైదరాబాద్‌లోని రాయల్ జ్యూవెలరీ షాప్‌లో రూ. 200 కోట్ల విలువైన నగలను ఎవరో దొంగతనం చేస్తారు. ఆ చోరీని గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) అంతా అనుమానిస్తారు. దీంతో జపాన్‌ను పట్టుకునేందుకు శ్రీధర్ (సునీల్), భవానీ (విజయ్ మిల్టన్) ఇద్దరు విడివిడిగా రెండు టీమ్స్ గా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రెండు బృందాలతోపాటు కర్ణాటక, కేరళ పోలీసులు సైతం కూడా జపాన్ కోసం వేట మొదలు పెడతారు. మరోవైపు దొంగతనం చేసిన డబ్బుతో సినిమాలు తీస్తూ తనను హీరోగా చూపించాలనుకుంటాడు జపాన్.

ట్విస్టులు

ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సంజు (అను ఇమ్మాన్యుయేల్) మీద మనసు పారేసుకుంటాడు జపాన్. అయితే పోలీసులు, ఆ రెండు బృందాలకు జపాన్ చిక్కాడా? అసలు దొంగతనం చేసింది ఎవరు? జపాన్ అంటే శ్రీధర్‌కు ఉన్న భయం ఏంటీ? జపాన్ దగ్గర ఉన్న పోలీసుల సీక్రెట్స్ ఏంటీ? జపాన్ ప్లాష్ బ్యాక్ ఏంటీ? అతను దొంగగా ఎందుకు మారాడు? అనే విషయాలు తెలియాలంటే కార్తీ జపాన్ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఎప్పుడు డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు చేసే కార్తీ మరో కొత్త అవతారంలో వచ్చిన సినిమానే జపాన్. ఈ మూవీ పోస్టర్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా కార్తీ స్లాంగ్, గెటప్‌ అందరినీ ఆకర్షించాయి. అయితే, భారీ అంచనాలతో జపాన్ మూవీకి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. సినిమా మొదట్లో బాగున్నా తర్వాత బోర్ కొట్టిస్తుంది. రెగ్యూలర్ సీన్లు ఉంటాయి. సినిమాలో చూపించిన ట్విస్టులు పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఆ కామెడీ సీన్

సినిమాలో జపాన్‌ పాత్రలో దొంగగా చేసే కార్తీ.. అందులో మూవీలో పోలీస్‌గా చూపించారు. అయితే, దాంతో వచ్చే కామెడీ వర్కౌట్ కాలేదు. చాలా వరకు కామెడీ సీన్లు ఆకట్టుకోలేకపోయాయి. కార్తీ మాట్లాడే విధానం, హావభావాలు బాగున్నప్పటికీ కంటెంట్ లేకపోవడంతో సన్నివేశాలు అట్రాక్ట్ చేయవు. కానీ, పోలీస్ వ్యాన్‌లో సినిమాలు, క్రిటిసిజం, సి సెంటర్ ఆడియెన్స్ అంటూ కార్తీ చేసిన సీన్ నవ్విస్తుంది. చాలా వరకు సన్నివేశాలు సాగదీతలా అనిపిస్తాయి. క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తుంది.

బీజీఎమ్ ఎలా ఉందంటే?

జపాన్ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్ ఇచ్చిన సాంగ్స్ అంతగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సో సో అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు పర్వాలేదు. కానీ, డార్క్ థీమ్ స్టైల్‌లో సినిమా తీశారు. అది చాలా మందికి నచ్చకపోవచ్చు.

నటీనటులు ఎలా చేశారంటే?

జపాన్ పాత్రలో కార్తీ అదరగొట్టాడు. ఆ క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం స్క్రీన్ పై తెలుస్తుంది. కార్తీ డైలాగ్ డెలివరీ నుంచి హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, నడక ప్రతిదాంట్లో బాగా ఎఫర్ట్ పెట్టాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు కార్తీ. సునీల్ కూడా తన పాత్రతో ఆకట్టుకున్నాడు. లుక్, గెటప్‌తో డిఫరెంట్‌గా కనిపిస్తాడు. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ పరంగా అలరిస్తుంది. ఇక మిగతా పాత్రలు బాగానే చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే జపాన్ మూవీలో జపాన్ పాత్ర తప్ప ఇంకేం నచ్చకపోవచ్చు. అంచనాలు లేకుండా చూడటం బెటర్

రేటింగ్: 2.5

Whats_app_banner