Shakhahaari OTT Response: ఓటీటీలో శాకాహారి సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్.. తప్పకుండా చూడాల్సిన మూవీ అంటున్న నెటిజన్లు
Shakhahaari OTT Response: శాకాహారి సినిమాకు ఓటీటీలో రెస్పాన్స్ అదిరిపోతోంది. ఈ చిత్రాన్ని చూసిన నెటిజన్లు పాజిటివ్‍గా స్పందిస్తున్నారు. ట్విస్టులు అదిరిపోయాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
Shakhahaari OTT Response: ఇటీవలి కాలంలో కొన్ని కన్నడ సినిమాలు ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. బాగా పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడు శాకాహారి సినిమా కూడా ఈ లిస్టులోకి వచ్చేసింది. కన్నడ మర్డర్ మిస్టరీ శాకాహారి చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్లను రాబట్టటంతో పాటు ప్రశంసలకు దక్కించుకుంది. రంగాయన రఘు, గోపాల్ కృష్ణ దేశ్‍పాండే ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. సందీప్‍కు డైరెక్టర్‌గా ఇదే తొలి మూవీ. కాగా, తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
శాకాహారి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 24వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. కన్నడ ఆడియోలో మాత్రం అందుబాటులోకి రాగా.. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మూవీకి పాజిటివ్ స్పందన వస్తుండటంతో ఇతర భాషల ప్రేక్షకులు కూడా చేసేస్తున్నారు.
రెస్పాన్స్ ఇలా..
శాకాహారి సినిమాను ప్రైమ్ వీడియో ఓటీటీలో చూశాక చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని చాలా మంది పోస్టులు చేస్తున్నారు. ఈ మూవీలో సస్పెన్స్, ట్విస్టులు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.
రంగాయన రఘు, గోపాల్‍కృష్ణ దేశ్‍పాండే పర్ఫార్మెన్స్ గురించి కూడా చాలా మంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇదో పర్‍ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని అభిప్రాయపడుతున్నారు. సరైన ట్విస్టులు, అద్భుతమైన మ్యూజిక్, టైకింగ్‍తో థ్రిల్ కలిగిస్తుందని పోస్టులు చేస్తున్నారు. తన తొలి మూవీనే అయినా అదిరిపోయేలా తెరకెక్కించిన దర్శకుడు సందీప్ సుంకడ్‍ను చాలా మంది ప్రశంసిస్తున్నారు.
శాకాహారి సినిమాకు సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించగా.. మయూర్ అంబేకల్లు సంగీతం అందించారు. సందీప్‍తో పాటు ఎస్ఆర్ గిరీశ్ కూడా కథను రాశారు. కీలంబీ మీడియా ల్యాబ్స్ పతాకంపై రాజేశ్ కీలంబి, రజినీ ప్రసన్న సంయుక్తంగా నిర్మించారు. అతి తక్కువ బడ్జెట్‍తోనే ఈ మూవీ రూపొందింది. థియేటర్లలో ఫిబ్రవరిలో రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చాక మంచి స్పందన దక్కించుకుంటోంది.
శాకాహారి స్టోరీ లైన్
శాకాహారి సినిమాలో ఓ చిన్న హోటల్ నడుపుకునే సుబ్బన్న భట్ పాత్రను రంగనాయన రఘు పోషించారు. ఆ హోటల్‍లోనే సుబ్బన్న ఆయన జీవిస్తుంటారు. అయితే, ఓ రోజు వినయ్ ఉజ్ (విజయ్) అనే యువకుడు పోలీసుల నుంచి తప్పించుకొని సుబ్బన్న హోటల్‍లోకి వస్తాడు. భార్య హత్య కేసులో అరెస్టయి పోలీసుల నుంచి తప్పించుకున్న వినయ్.. సుబ్బన్నను ఆశ్రయం కోరతాడు. తాను అమాయకుడినని చెబుతాడు. వినయ్‍ను పోలీస్ అధికారి (గోపాల్‍కృష్ణ దేశ్‍పాండే) వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో సుబ్బన్న గురించి కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సుబ్బన్న ఎవరు? ఆయన గతం ఏంటి? అనేది శాకాహారి మూవీలో ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఈ మూవీలో ట్విస్టులు, ఉత్కంఠగా సాగే కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.