Kalki 2898 AD Release: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ విషయంలో తెరపైకి మరో తేదీ
Kalki 2898 AD Release: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ భారీ బడ్జెట్ గ్లోబల్ రేంజ్ మూవీ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ మూవీ రిలీజ్ విషయంలో మరో తేదీ తెరపైకి వచ్చింది.
Kalki 2898 AD Release: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రం కోసం సినీ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‍తో డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి. భారత పురాణాల స్ఫూర్తితో ఈ మూవీని గ్లోబల్ రేంజ్‍లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా ముగింపునకు వచ్చేసింది. మే 9వ తేదీన కల్కి ఏడీ 2898 సినిమాను రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. అయితే, ఎన్నికల కారణంగా ఆ రోజు రావడం కష్టమే. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‍పై సందిగ్ధత నెలకొంది.
తెరపైకి నయా డేట్!
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కారణంగా మే 9వ తేదీన కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ కాదనే అంచనాలు ఉన్నాయి. మే 30వ తేదీన ఈ చిత్రం వస్తుందనే రూమర్లు కొంతకాలంగా నడుస్తున్నాయి. అయితే, తాజాగా మరో కొత్త తేదీ తెరపైకి వచ్చింది. జూన్ 20వ తేదీన కల్కి 2898 ఏడీ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ఆలోచిస్తోందని సమాచారం బయటికి వచ్చింది.
కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ వర్గాల నుంచి సమాచారం వచ్చినట్టు పింక్‍విల్లా రిపోర్ట్ వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం అప్పటి పూర్తి కానుండడంతో ఆ తేదీని మూవీ టీమ్ పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కల్కి 2898 ఏడీ సినిమా మే 30కు వాయిదా పడిందంటూ కొంతకాలంగా విపరీతంగా రూమర్లు వస్తుండగా.. ఇప్పుడు జూన్ 20 కూడా తెరపైకి వచ్చింది. మరి, మేకర్స్ ఏం డిసైడ్ చేస్తారో చూడాలి. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
షూటింగ్ పూర్తి!
కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మూవీ టీమ్ త్వరలోనే అప్‍డేట్ ఇస్తుందని.. ఆ సమయంలోనే రిలీజ్ డేట్‍పై కూడా క్లారిటీ ఇస్తుందనే సమాచారం సినీ సర్కిల్‍లో చక్కర్లు కొడుతోంది. హీరో ప్రభాస్ ఈ చిత్రం కోసం తన షూటింగ్ ముగించుకొని ప్రస్తుతం యూరప్ టూర్‌కు వెళ్లారని తెలుస్తోంది.
కల్కి 2898 ఏడీ చిత్రాన్ని ఇండియన్ మైథాలజీ స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్ మూవీగా నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి పాత్ర ప్రధానంగా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా ఓ ప్రపంచాన్నే క్రియేట్ చేశారని, అద్భుతమైన వీఎఫ్‍ఎక్స్‌తో అందరూ ఆశ్చర్యపోయేలా ఈ మూవీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అత్యంత ఖరీదైన భారతీయ మూవీగా ఈ చిత్రం రానుంది. సుమారు రూ.600 బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ పతాకంపై కల్కి 2898 ఏడీ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లోనూ ఈ గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
కల్కి 2898 ఏడీ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తమిళ సీనియర్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పఠానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీరోల్స్ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాారు.
టాపిక్