Bhairava Anthem Lyrics: భైరవ ఆంథెమ్ లిరిక్స్ ఇవే.. దేశాన్ని ఊపేస్తున్న కల్కి 2898 ఏడీ ఫస్ట్ సింగిల్ మీరూ పాడుకోండి-kalki 2898 ad first single bhairava anthem lyrics are here prabhas diljit dosanjh song ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhairava Anthem Lyrics: భైరవ ఆంథెమ్ లిరిక్స్ ఇవే.. దేశాన్ని ఊపేస్తున్న కల్కి 2898 ఏడీ ఫస్ట్ సింగిల్ మీరూ పాడుకోండి

Bhairava Anthem Lyrics: భైరవ ఆంథెమ్ లిరిక్స్ ఇవే.. దేశాన్ని ఊపేస్తున్న కల్కి 2898 ఏడీ ఫస్ట్ సింగిల్ మీరూ పాడుకోండి

Hari Prasad S HT Telugu
Jun 18, 2024 11:04 AM IST

Bhairava Anthem Lyrics: కల్కి 2898 ఏడీ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ భైరవ ఆంథెమ్ దేశాన్ని ఊపేస్తోంది. తెలుగు, పంజాబీ మిక్స్ చేసి చేసిన ఈ సాంగ్ మ్యూజిక్, లిరిక్స్ అదిరిపోయాయి.

భైరవ ఆంథెమ్ లిరిక్స్ ఇవే.. దేశాన్ని ఊపేస్తున్న కల్కి 2898 ఏడీ ఫస్ట్ సింగిల్
భైరవ ఆంథెమ్ లిరిక్స్ ఇవే.. దేశాన్ని ఊపేస్తున్న కల్కి 2898 ఏడీ ఫస్ట్ సింగిల్

Bhairava Anthem Lyrics: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీలోని భైరవ ఆంథెమ్ సోమవారం (జూన్ 17) రిలీజైన విషయం తెలుసు కదా. 2 నిమిషాల 45 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట అదిరిపోయింది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ ప్రతి ఒక్కరికీ తెగ నచ్చేసింది. ఈ సాంగ్ లో ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ తో కలిసి ప్రభాస్ తొడకొడుతూ వేసి స్టెప్పులు కూడా బాగున్నాయి.

భైరవ ఆంథెమ్

కల్కి 2898 ఏడీ మూవీ నుంచి భైరవ ఆంథెమ్ అంటూ ఈ ఫస్ట్ సాంగ్ వచ్చింది. తెలుగుతోపాటు మిగిలిన ఐదు భాషల్లోనూ సాంగ్ రిలీజ్ చేశారు. అయితే ఆరు భాషల్లోనూ పంజాబీ లిరిక్స్ అలాగే ఉంచి.. ఆయా స్థానిక భాషల లిరిక్స్ మాత్రం మార్చారు. తెలుగులో లిరిక్స్ ను రామజోగయ్య శాస్త్రి అందించాడు. భైరవ వ్యక్తిత్వాన్ని చాటుతూ సాగిపోయే పాట ఇది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోందో ఈ పాట ద్వారానే మేకర్స్ చెప్పారు.

భైరవ ఆంథెమ్ లిరిక్స్

ఒక నేనే.. నాకు చుట్టూ నేనే..

ఒకటైనా.. ఒంటరోన్ని కానే..

స్వార్థము నేనే.. పరమార్థము నేనే..

<పంజాబీ లిరిక్స్>

ఓ పంజాబీ ఆగయే ఓయ్

మేరీ మిజాజాన్ అఖియా

మానె నా గల్ దీత్ హై పక్కియా

వె రోహబ్ వేఖో జట్ దా వే

కదే నీ పీచే హట్దా వే మేరే మాహియా

యే దిన్ రాత్ కర్దా తారక్కియా

కే దిన్ రాత్ కర్దా తారక్కియా

కే రోహబ్ వేఖో జట్ దా వే మేరే మాహియా

కడే నీ పిచ్చె హట్దా వే మేరే మాహియా

<పంజాబీ లిరిక్స్>

నా రెండు కళ్లతో లోకాన్ని చదివేసా..

ముసుగున మనుషుల రంగులు చూశా..

నేనా నువ్వా అంటే నాకు ముఖ్యం నేనంటా..

గెలుపు జెండాలే నా దారంటా..

మనసు ఉన్నాగానీ లేదంటా..

మెదడు మాటే నే వింటా..

మాయదారి లోకంలో.. ఇంతే ఇంతే నేనంటా..

నాకు నేనే కర్త కర్మ క్రియ..

ఒక్క నేనే వేల సైన్యమయ్యా..

నా గమనం.. నిత్య రణం..

కణకణకణం.. అనుచరగణం..

<పంజాబీ లిరిక్స్>

వె సారా జగ్ కర్దా యే తగ్గియా

నిగాహా సదె పిచ్చె క్యు హై లగియా

వె సారా జగ్ కర్దా యే తగ్గియా

నిగాహా సదె పిచ్చె క్యూ హై లగియా

మేరీ మిజాజాన్ అఖియా

మానె నా గల్ దీత్ హై పక్కియా

వె రోహబ్ వేఖో జట్ దా వే

కదే నీ పీచే హట్దా వే మేరే మాహియా

యే దిన్ రాత్ కర్దా తారక్కియా

కే దిన్ రాత్ కర్దా తారక్కియా

కే రోహబ్ వేఖో జట్ దా వే మేరే మాహియా

కడే నీ పిచ్చె హట్దా వే మేరే మాహియా

<పంజాబీ లిరిక్స్>

సాహస మంత్రమే నా జవజీవము..

సమయము చూడని సమరమిది..

సాయుధ యంత్రమే లోహపు దేహము..

నా కథ ఏ విధి గెలవనిది..

Whats_app_banner