Bhairava Anthem Video: ఎట్టకేలకు వచ్చేసిన ‘భైరవ ఆంథమ్’ వీడియో: తొడకొట్టిన ప్రభాస్: వీడియో చూసేయండి
Kalki 2898 AD Bhairava Anthem Video: కల్కి 2898 ఏడీ సినిమా నుంచి భైరవ ఆంథమ్ వీడియో రిలీజ్ అయింది. పలుసార్లు వాయిదా వేసిన మూవీ టీమ్ ఎట్టకేలకు తీసుకొచ్చింది. ఈ పాటలో ప్రభాస్ అల్ట్రా సైలిష్‍గా ఉన్నారు.
Bhairava Anthem Video: కల్కి 2898 ఏడీ సినిమా నుంచి భైరవ ఆంథమ్ వీడియో కోసం ఫ్యాన్ ఆసక్తిగా ఎదురుచూశారు. ముందుగా ఆదివారమే తీసుకొస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. అయితే, ఆడియో మాత్రమే రిలీజ్ చేసి.. వీడియోను వాయిదా వేసింది. ఈ పాట వీడియోను నేటి (జూన్ 17) ఉదయం 11 గంటలకు తీసుకొస్తామని యూనిట్ ప్రకటించింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‍ను ఈ వీడియోలో చూడాలని అభిమానులు నిరీక్షించారు. కానీ మళ్లీ ఆలస్యం చేసింది. అయితే, ఎట్టకేలకు నేటి (జూన్ 17) మధ్యాహ్నం భైరవ ఆంథమ్ వీడియో వచ్చేసింది. ఈ పాటలో హీరో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్‍గా ఉన్నారు.
స్టైలిష్‍గా ప్రభాస్
కల్కి 2898 ఏడీ సినిమా నుంచి వచ్చిన ఈ భైరవ ఆంథమ్ ఆకట్టుకుంటోంది. ఈ పాటను పంజాబీ స్టార్ సింగర్ దీల్‍జీత్ దోశంజ్ పాడారు. పంజాబీ స్టైల్‍లో ఉన్న ఈ పాటలో మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశారు దిల్‍జీత్. కల్కి చిత్రంలో ప్రభాస్ పోషించిన భైరవ క్యారెక్టర్‌పై ఈ సాంగ్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ పాటకు మంచి జోష్ ఉన్న ట్యూన్ ఇచ్చారు.
భైరవ ఆంథమ్ వీడియోలో ప్రభాస్, దిల్‍జీత్ ఇద్దరూ అదరగొట్టారు. ముందు కల్కి ట్రైలర్లో ఉండే విజువల్స్, ప్రభాస్ యాక్షన్‍తో ఈ వీడియో మొదలైంది. ఆ తర్వాత దిల్‍జీత్ ఎంట్రీ ఉంది. ఆ తర్వాత ఈ వీడియో సాంగ్‍లో ప్రభాస్ అడుగుపెట్టారు. బ్లాక్ డ్రెస్‍లో స్టైలిష్ లుక్‍లో ప్రభాస్ అదిరిపోయారు.
తలపాగా ధరించి.. తొడకొట్టి
దీల్‍జీత్‍తో పాటు ప్రభాస్ కూడా తలపాగా ధరించారు. ప్రభాస్, దిల్‍జీత్ ఇద్దరూ కలిసి తొడకొట్టారు. ఈ వీడియోలో ఇది మరో హైలైట్‍గా నిలిచింది. పంజాబీ స్టైల్‍లో ప్రభాస్ లుక్ సూపర్‌గా ఉంది.
భైరవ ఆంథమ్ పాటకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. దిల్‍జీత్ పాడారు. రామజోగయ్య శాస్త్రి, కుమార్ లిరిక్స్ అందించారు. కల్కి 2898 ఏడీ సినిమాలో భైరవ పాత్ర గురించి చెబుతున్నట్టుగా ఈ సాంగ్ ఉంది. తెలుగు పాట మధ్యలోనూ కాస్త పంజాబీ లిరిక్స్ ఉన్నాయి. ఆదివారమే ఈ పాట ఆడియో రాగా.. నేడు వీడియో వచ్చింది.
కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారత పురాణాల స్ఫూర్తితో ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రాన్ని భారీ స్థాయిలో, హైక్వాలిటీ గ్రాఫిక్స్‌తో ఆయన తెరకెక్కించారు. జూన్ 27వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ విజువల్ వండర్‌గా అందరినీ ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
కల్కి 2898 ఏడీ చిత్రంలో భైరవగా ప్రభాస్ నటించగా.. అశ్వత్థామ పాత్ర పోషించారు అమితాబ్ బచ్చన్. కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, సస్వతా ఛటర్జీ, శోభన కీలకపాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని నిర్మించారు అశ్వినీదత్. ఈ సినిమా ప్రమోషన్లలో మూవీ టీమ్ జోరు పెంచుతోంది. భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.