Kaala Bhairava Apology: కాలభైరవపై తారక్-చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. నాటు నాటు సింగర్‌పై ట్రోల్
Kaala Bhairava Apology: ప్రముఖ గాయకుడు కాలభైరవపై తారక్-చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. నాటు నాటు సింగర్‌ను ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. అతడు తన షేర్ చేసిన థ్యాంక్యూ నోట్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లను ప్రస్తావించకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Kaala Bhairava Apology: ఇటీవల జరిగిన 95వ అకాడమీ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంతర్జాతీయ వేదికపై నాటు నాటు సాంగ్‌ను పాడిన రాహుల్ సిప్లీగంజ్, కాలభైరవ కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణె ప్రెజెంటర్‌గా వ్యవహరించిన ఈ పాటకు కొంతమంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లతో కలిసి రాహుల్, కాల భైరవ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. వీరి ప్రదర్శనకు ఆడియెన్స్ నుంటి స్టాండింగ్ ఓవేషన్ కూడా వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా కూడా మారింది. ఇంత అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్.. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే నాటు నాటు సింగర్ కాల భైరవపై మాత్రం ట్రోలింగ్ జరుగుతోంది.
ఆస్కార్ లైవ్ ప్రదర్శనపై వస్తున్న స్పందనను చూసిన కాలభైరవ ధన్యవాదాలు చెబుతూ ట్విటర్ వేదికగా ఓ లాంగ్ నోట్‌ను షేర్ చేశాడు. "ఆర్ఆర్ఆర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలవడం ఆనందంగా ఉంది. అలాగే ఈ వేదికపై లైవ్ ప్రదర్శన ఇచ్చే అవకాశం వచ్చిందనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను." అంటూ నోట్‌ను షేర్ చేశారు.
ఈ సందర్భంగా తన అంకుల్ ఎస్ఎస్ రాజమౌళి, తండ్రి ఎంఎం కీరవాణీ, కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్, ఎస్ఎస్ కార్తికేయ, తన తల్లి అందరికీ కాలభైరవ ధన్యవాదాలు చెప్పారు. వారి కృషి, హార్ట్ వర్క్ కారణంగా ఈ పాట ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు రీచ్ అయిందని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను డ్యాన్స్ చేసేలా చేస్తోందని తెలిపారు.
ఈ థ్యాంక్యూ నోటే కాలభైరవను వివాదంలోకి నెట్టింది. అతడు ధన్యవాదాలు చెబుతూ అందరీ పేర్లు ప్రస్తావించగా.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లను మాత్రం ప్రస్తావించలేదు. దీంతో తారక్, చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో కాలభైరవపై ఈ స్టార్ హీరోల అభిమానులు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో మళ్లీ తన ట్వీట్‌పై కాలభైరవ తానే స్పష్టత ఇచ్చుకోవాల్సి వచ్చింది. ట్రోలింగ్‌పై స్పందిస్తూ ట్విటర్ వేదికగా తారక్, చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
"ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట ఇంత పెద్ద హిట్ కావడానికి తారక్ అన్న, చరణ్ అన్న కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అకాడమీ వేదికపై పర్ఫార్మెన్స్ చేసే అవకాశం వచ్చేందుకు ఎవరెవరు సాయం చేశారో వారి గురించి మాత్రమే మాట్లాడాను. అంతకుమించి ఏమి లేదు. నా మాటలు తప్పుగా వెళ్లాయని అర్థమైంది. నా పదాల ఎంపికకు నేను హృదయపూర్వతంగా క్షమాపణలు కోరుతున్నాను" అని కాలభైరవ స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ పురస్కారం సాధించింది. టాప్ గన్ మ్యావ్రిక్ సినిమా నుంచి లేడీ గాగా ఆలపించిన హోల్ట్ మై హ్యాండ్, బ్లాక్ ఫ్యాంతర్ వకాండ ఫరెవర్ నుంచి రిహానా పాడిన్ లిఫ్ట్ మీ అప్ లాంటి పాపులర్ సాంగ్స్‌ను కూడా అధిగమించి నాటు నాటు పాట ఆస్కార్ గెలిచింది.
టాపిక్