Jailer Pre Release Business: భారీగా జైలర్ ప్రీరిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కోసం ఎంత వసూలు చేయాలంటే..-jailer pre release business is more than 100 crores ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jailer Pre Release Business: భారీగా జైలర్ ప్రీరిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కోసం ఎంత వసూలు చేయాలంటే..

Jailer Pre Release Business: భారీగా జైలర్ ప్రీరిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కోసం ఎంత వసూలు చేయాలంటే..

Hari Prasad S HT Telugu
Aug 08, 2023 07:28 PM IST

Jailer Pre Release Business: భారీగా జైలర్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే అంతకంటే భారీగా వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జైలర్ పోస్టర్
జైలర్ పోస్టర్

Jailer Pre Release Business: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీతో ఈ గురువారం (ఆగస్ట్ 10) రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా బజ్ ఓ రేంజ్ లో ఉంది. అందుకు తగినట్లే ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఇప్పుడీ సినిమా క్లీన్ హిట్ గా డిక్లేర్ చేయాలంటే భారీ మొత్తం వసూలు చేయాల్సి ఉంది.

అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. 2023లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచే దిశగా జైలర్ అడుగులు వేస్తోంది. రజనీకాంత్, తమన్నా, నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో జైలర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ రిలీజయ్యే రోజు తమిళనాడులోని ఆఫీసులు అనధికారిక హాలీడే డిక్లేర్ చేశాయి.

ప్రతి రజనీ మూవీలాగే ఈ జైలర్ కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం. అయితే జైలర్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.123 కోట్లకు అమ్ముడయ్యాయి. అందులో రూ.60 కోట్లు తమిళనాడు నుంచే వచ్చాయి. ఇక కర్ణాటకలో రూ.10 కోట్లు, ఏపీ, తెలంగాణల్లో రూ.12 కోట్లు, కేరళలో రూ.5.5 కోట్లు పలికాయి. ఇక మిగతా ఇండియా మొత్తం కలిపి మరో రూ.4 కోట్లు వచ్చాయి.

ఓవర్సీస్ లోని బిజినెస్ రూ.32 కోట్లుగా ఉంది. ఆ లెక్కన ఇండియాలో రూ.91 కోట్లు, విదేశాల్లో రూ.32 కలుపుకుంటే రూ.123 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో ఈ జైలర్ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.250 కోట్లకుపైనే వసూలు చేయాల్సి ఉంది. తొలి రోజు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా జైలర్ ఈ మార్క్ సులువుగా అందుకుంటుంది.

ఇక తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల మేరకు ఈ మూవీ కోసం హీరో రజినీకాంత్ ఏకంగా రూ.110కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. కీలకపాత్రలో కాసేపు కనిపించనున్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ రూ.8కోట్లు తీసుకున్నారని సమాచారం.

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు మేకర్లు రూ.4కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం చక్కర్లు కొడుతోంది. జాకీ ష్రాఫ్ రూ.4కోట్లు, తమన్నా భాటియా రూ.3కోట్లు, యోగిబాబు రూ.కోటి, రమ్యకృష్ణ రూ.80లక్షలు, వసంత్ రవి రూ.30లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం