Jailer Movie Remunerations: జైలర్ మూవీలో యాక్టర్ల రెమ్యూనరేషన్లు ఇవే.. రజినీకాంత్‍కు ఎన్ని కోట్లంటే?-kollywood news jailer movie cast remunerations details surfacing on social media rajinikanth gets this much ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jailer Movie Remunerations: జైలర్ మూవీలో యాక్టర్ల రెమ్యూనరేషన్లు ఇవే.. రజినీకాంత్‍కు ఎన్ని కోట్లంటే?

Jailer Movie Remunerations: జైలర్ మూవీలో యాక్టర్ల రెమ్యూనరేషన్లు ఇవే.. రజినీకాంత్‍కు ఎన్ని కోట్లంటే?

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 04, 2023 05:47 PM IST

Jailer Movie Remunerations: జైలర్ సినిమా కోసం కీలక యాక్టర్లు అందుకున్న రెమ్యూనరేషన్ వివరాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో సమాచారం చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇవే.

రజినీకాంత్
రజినీకాంత్

Jailer Movie Remunerations: జైలర్ సినిమా కోసం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వచ్చే వారం ఆగస్టు 10వ తేదీన థియేటర్లలో జైలర్ విడుదల కానుంది. షోకేస్ పేరుతో వచ్చిన జైలర్ ట్రైలర్ అదిరిపోయింది. జైలర్‌లో రజినీని చూస్తుంటే బాషా వైబ్స్ వస్తున్నాయని, సూపర్ హిట్ ఖాయమంటూ ఆయన అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. అమెరికాలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఈ తరుణంలో జైలర్ సినిమా కోసం కీలకపాత్రలు పోషించిన నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

జైలర్ సినిమాలో నటించిన యాక్టర్ల పారితోషకం వివరాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం హీరో రజినీకాంత్ ఏకంగా రూ.110కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. కీలకపాత్రలో కాసేపు కనిపించనున్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ రూ.8కోట్లు తీసుకున్నారని సమాచారం. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు మేకర్లు రూ.4కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం చక్కర్లు కొడుతోంది. జాకీ ష్రాఫ్ రూ.4కోట్లు, తమన్నా భాటియా రూ.3కోట్లు, యోగిబాబు రూ.కోటి, రమ్యకృష్ణ రూ.80లక్షలు, వసంత్ రవి రూ.30లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. 

జైలర్ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ సైతం విపరీతంగా ఆకట్టుకుంది. రజినీకాంత్ స్వాగ్, యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. కొన్నేళ్లు తన రేంజ్ హిట్ లేని రజినీకి జైలర్ బ్లాక్‍బాస్టర్ అందిస్తుందని ఫ్యాన్ ఆశిస్తున్నారు.

ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో జైలర్ విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన జైలర్ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ‘కావాలా’ సాంగ్‍లో తమన్నా భాటియా స్టెప్పులు హైలైట్‍గా ఉండనున్నాయి. ‘హుకుం’ సాంగ్‍లో రజినీకాంత్ స్టైల్ సూపర్‌గా ఉంది.

కాగా, ప్రీమియర్ల ద్వారానే ఉత్తర అమెరికాలో జైలర్ మిలియన్ డాలర్ల వసూలు చేస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఈ ఘనత సాధించే తొలి దక్షిణాది చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు. మిగిలిన చోట్ల కూడా హవా నడుస్తోంది.

Whats_app_banner