తమిళ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ నటుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందని కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. స్టార్ టైటిల్ కోసం ఓ వైపు రజనీకాంత్(Rajinikanth), మరోవైపు దళపతి విజయ్(Thalapathy Vijay) మధ్య భారీ పోటీ నెలకొందని అంటున్నారు. అయితే వీరిద్దరూ నేరుగా ఏం పోరాడటం లేదు. వీరి అభిమానుల మధ్య భీకర పోరు మొదలైంది.
రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రానికి(Jailer Movie) కౌంట్ డౌన్ ప్రారంభమైన తర్వాత అభిమానుల మధ్య స్టార్ టైటిల్ కోసం పోరు నడుస్తోందని వార్తలు వస్తున్నాయి. అన్ని చోట్లా జైలర్ బుకింగ్ జోరుగా సాగింది. కన్నడ స్టార్ నటుడు శివరాజ్‌కుమార్(Shivaraj Kumar) కూడా ఈ సినిమలో ఉన్నాడు. దీంతో కర్నాటకలోనూ భారీ బుకింగ్‌లు జరిగినట్లు సమాచారం.
ఆడియో లాంచ్ ఈవెంట్‌లో రజనీకాంత్ కాకి, డేగ(Rajinikanth Crow Eagle Story) కథను చెప్పిన తర్వాత ఈ ఇద్దరి స్టార్స్ అభిమానుల మధ్య గొడవ మెుదలైంది. రజనీకాంత్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. 'డేగ ఆకారం, బలాన్ని గుర్తించని కాకి దానితో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. కాకి ఎప్పటికీ డేగ అంత ఎత్తుకు ఎగరదు.' అని కామెంట్స్ చేశాడు. నిజానికి ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. అయితే ఈ ప్రకటన విజయ్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దళపతి విజయ్ గురించే ఆయన చెబుతున్నారని వార్ మెుదలైంది.
మొదట ఓ యూట్యూబర్ రజనీకాంత్‌పై మండిపడ్డాడు. 'ఒక డేగకు పైకి ఎగిరే సామర్థ్యం తప్ప మరేమీ తెలియదు. అంతే కాకుండా డేగ ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది. డేగ స్వార్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆయన పేరు చెప్పే ధైర్యం లేదు.' అని ట్వీట్ చేయడంతో ఈ గొడవ మొదలైంది.
రజనీకాంత్-విజయ్ దళపతి అభిమానుల మధ్య ఆన్‌లైన్ గొడవ మెుదలైంది. జైలర్ సినిమా(Jailer Cinema) ప్రమోషన్ లో ఈ ఇష్యూ హాట్ హాట్ గా సాగుతోంది. జైలర్ చిత్రంలోని ఓ పాటలో అభ్యంతరకరమైన లైన్లు ఉన్నాయని, ఇది విజయ్ దళపతిని ఉద్దేశించి ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు. గతవారం జైలర్ ఫంక్షన్ లో పాల్గొన్న రజనీకాంత్ చెప్పిన కాకి కథ వైరల్ గా మారింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా(Jailer Cinema) ఈ వారం విడుదల కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ మూవీ ఆగస్ట్ 10న రిలీజ్ కానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్(Shiva Raj Kumar), తమన్నా కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియన్ లెవెల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ 10వ తేదీన మలయాళం మూవీ జైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా నటిస్తోన్నాడు. మలయాళంలో రజనీకాంత్ జైలర్‌ను భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేయగా.. అదే రోజు ధ్యాన్ శ్రీనివాసన్ జైలర్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ కారణంగా ఓపెనింగ్స్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.