Punch Prasad Suffering Kidney Issue: పంచ్ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్-jabardash artist punch prasad suffering kidney issue and his condition is critical ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Punch Prasad Suffering Kidney Issue: పంచ్ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్

Punch Prasad Suffering Kidney Issue: పంచ్ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్

Maragani Govardhan HT Telugu
Nov 18, 2022 10:42 PM IST

Punch Prasad Suffering Kidney Issue: జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. కిడ్నీ సమస్య కారణంగా అతడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని మరో జబర్దస్త్ ఆర్టిస్ట్ నూకరాజు వీడియో రూపంలో తెలియజేశాడు.

నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పంచ్ ప్రసాద్
నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పంచ్ ప్రసాద్

Punch Prasad Suffering Kidney Issue: బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా పంచ్ ప్రసాద్ చాలా మందికి సుపరిచితులే. జబర్దస్త్ ద్వారానే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర కార్యక్రమాలతో పంచ్ ప్రసాద్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటికే కిడ్నీ సమస్య వేధిస్తున్న ఆయనను తాజాగా మరో సమస్య వెంటాడుతోంది. దీంతో ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. ఎప్పటి నుంచో ఈ బాధ ఉన్నప్పటికీ పైకి కనిపించకుండా.. జనాలందరికీ నవ్వులను పంచారు ప్రసాద్. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉండటంతో ఆయన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోను పోస్ట్ చేశాడు జబర్దస్త్ ఫేమ్ నూకరాజు.

తన బాధ గురించి ఇతరులకు చెప్పేందుకు ప్రసాద్ ఇష్టపడడని తెలిసినా.. నూకరాజు ఈ విషయాన్ని వీడియో రూపంలో బయటపెట్టాడు. ప్రసాద్ వద్దు అంటున్నా.. కానీ ఈ వీడియో తీసి దాన్నీ యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రసాద్‌కు ఆశీస్సులు అందించాలని కోరాడు. ప్రసాద్ పరిస్థితిని అతడి భార్య వీడియోలో తెలియజేశారు.

ఓ రోజు షూటింగ్ ముగించుకుని వచ్చిన ఆయన జ్వరం వచ్చిందని చెప్పి పడుకున్నారు. లేచిన తర్వాత ఓ వైపు నడుము నొప్పి వస్తుందనడంతో వైద్యుడి సలహా తీసుకుని పెయిన్ కల్లిర్స్ ఇచ్చాను. మరుసటి రోజు డయాలసిస్‌కు వెళ్లారు. వచ్చాక విశ్రాంతి తీసుకున్నారు. ఫీవర్, నడుము నొప్పి ఇంకా తగ్గకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాం. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసినా నొప్పి ఎందుకొస్తుందో వారికే అర్థం కాలేదు. కొన్ని రోజులు మెడిసిన్ వాడినా ఫలితం లేదు. చివరకు ఎంఆర్ఐ స్కానింగ్‌లో సమస్య ఏంటో బయటపడింది. నడుమ వెనుక భాగం నుంచి కాలి వరకు చీము పట్టింది. అని ప్రసాద్ భార్య వీడియోలో తెలిపారు.

డయాలిసిస్ చేయించుకునే రోగుల్లో నెమ్మదిగా ఇలాంటి సమస్యలు వస్తాయట. టెస్ట్ చేసిన తర్వాత అది మందులతో నయమవుతుందా? ఆపరేషన్ అవసరమా? అనే విషయాన్ని డాక్టర్లు చెబుతామన్నారు. అని నూకరాజు తెలిపాడు.

ఎప్పటి నుంచో ఈ సమస్య ఉన్నప్పటికీ తన స్కిట్లు, పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు పంచ్ ప్రసాద్. బాధను బయటకు తెలియనీయకుండా పైకి మాత్రం నవ్వుతూ బాధను లోపలన అనుభవించారు. తన పంచులతో ఎంతోమంది కడుపుబ్బా నవ్వించిన అతడు.. ప్రస్తుతం తీవ్రంగా కష్టపడుతున్నాడు. కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం