OTT Spy Action Thriller: ఓటీటీలోకి వస్తున్న ఇటాలియన్ స్పైయాక్షన్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్-italian spy action web series citadel diana ott release date confirmed trailer out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Spy Action Thriller: ఓటీటీలోకి వస్తున్న ఇటాలియన్ స్పైయాక్షన్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Spy Action Thriller: ఓటీటీలోకి వస్తున్న ఇటాలియన్ స్పైయాక్షన్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 11, 2024 03:16 PM IST

OTT Spy Action: సిటాడెల్: డయానా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ స్పై యాక్షన్ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ ఇటాలియన్ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ఎప్పుడు వస్తుందంటే..

OTT Spy Action: ఓటీటీలోకి వస్తున్న ఇటాలియన్ స్పైయాక్షన్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Spy Action: ఓటీటీలోకి వస్తున్న ఇటాలియన్ స్పైయాక్షన్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

అమెరికన్ సిరీస్ సిటాడెల్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ సిటాడెల్ ఆధారంగా ఇటాలియన్‍లో ఓ వెబ్ సిరీస్ వస్తోంది. ‘సిటాడెల్: డయానా’ పేరుతో ఈ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్‍పై మంచి హైప్ ఉంది. ఈ వెబ్ సిరీస్‍లో మటిల్డా డే ఏంజెలిస్ ప్రధాన పాత్ర పోషించారు. యాక్షన్ ప్యాక్డ్ సిరీస్‍గా ఇది ఉండనుంది. సిటాడెల్: డయాన్ సిరీస్ ట్రైలర్ నేడు లాంచ్ అయింది. దీంతోపాటే స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

సిటాడెల్: డయానా వెబ్ సిరీస్ అక్టోబర్ 10వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇటాలియన్‍తో పాటు ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ అక్టోబర్ 10న వస్తుందని ప్రైమ్ వీడియో నేడు అధికారికంగా వెల్లడించింది.

ట్రైలర్ ఇలా..

సిటాడెల్: డయానా ట్రైలర్ యాక్షన్‍తో నిండిపోయింది. సిటాడెల్ ఏజెన్సీని నాశనం చేసిన సిండికేట్‍ మాంటీకోర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు డయానా (మటిల్డా) సిద్ధమవుతుంది. ఇందుకోసం పోరాడుతుంది. సిటాడెల్: డయానా సిరీస్ ట్రైలర్ గన్ షూటింగ్, ఫైట్లు, బ్లాస్టింగ్‍లతో యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంది.

సిటాడెల్: డయానా వెబ్ సిరీస్‍కు అర్నాల్డో కాటినరా డైరెక్టర్, క్రియేటర్‌గా ఉన్నారు. మటిల్డా డె ఏంజిలిస్‍తో పాటు లోరెండో సెర్వాసియో, మౌరిజియో లాంబర్డి, జూలియా పియాటోన్, థెక్లా రౌటెన్, డానియెలే పవోలినీ, బెర్న్ హార్డ్ ఈ సిరీస్‍లో కీలకపాత్రలు పోషించారు.

సిటాడెల్: డయానా సిరీస్‍ను క్యాల్టేయా, అమెజాన్ ఎంజీఎం ప్రొడక్షన్ హౌస్‍లు నిర్మించాయి. భారీ బడ్జెట్‍తో ఈ సిరీస్ రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ అదరగొడుతుందనే అంచనాలు ఉన్నాయి. సిటాడెల్‍కు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉంది.

నవంబర్‌లో సమంత సిటాడెల్

వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రలో పోషించిన సిటాడెల్: హనీబన్నీ సిరీస్ ఈ ఏడాది నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. ఇంగ్లిష్‍లో సిటాడెల్ సిరీస్‍లో రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక చోప్రా లీడ్ రోల్స్ చేశారు. 2023లో వచ్చిన ఈ సిరీస్ దుమ్మురేపింది. దీని ఆధారంగానే ఇండియన్ వెర్షన్‍గా ‘సిటాడెల్: హనీబన్నీ’ సిరీస్ రూపొందింది.

సిటాడెల్: హనీబన్నీ సిరీస్‍కు రాజ్&డీకే, సీతా ఆర్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‍లో స్పై ఏజెంట్‍గా వరుణ్, సమంత నటించారు. కేకే మీనన్, సిమ్రన్ బగ్గా, ఇమా క్యానింగ్ కూడా కీలకపాత్రలు చేశారు. మొత్తంగా అమెరికన్ సిరీస్ సిడాటెల్ ఆధారంగా ఇటాలియన్‍లో సిటాడెల్: డయానా రూపొందిస్తే.. హిందీలో సిటాడెల్: హనీబన్నీ రూపొందింది. అయితే, వీటి కథలు మాత్రం వేర్వేరుగానే ఉంటాయి.