Bigg Boss Kirrak Seetha: నేను అందుకే డౌన్ అయ్యానేమో.. అతడు చిరాకు: కిర్రాక్ సీత-i pushed others for tasks and tasty teja is annoying says kirrak seetha after eliminated from bigg boss 8 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Kirrak Seetha: నేను అందుకే డౌన్ అయ్యానేమో.. అతడు చిరాకు: కిర్రాక్ సీత

Bigg Boss Kirrak Seetha: నేను అందుకే డౌన్ అయ్యానేమో.. అతడు చిరాకు: కిర్రాక్ సీత

Bigg Boss 8 Telugu Kirrak Seetha: బిగ్‍బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక బజ్ ఇంటర్వ్యూలో కిర్రాక్ సీత ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. తన ఎలిమినేషన్‍కు కారణం ఏమనుకుంటున్నారో వెల్లడించారు. మరిన్ని విషయాలను పంచుకున్నారు. ఈ బజ్ ఇంటర్వ్యూ ప్రోమో వచ్చింది.

Bigg Boss Kirrak Seetha: నేను అందుకే డౌన్ అయ్యానేమో.. అతడు చిరాకు: కిర్రాక్ సీత

బిగ్‍బాస్ తెలుగు 8 సీజన్ నుంచి పాపులర్ యూట్యూబర్ కిర్రాక్ సీత ఆరో వారం ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం (అక్టోబర్ 13) ఎపిసోడ్‍లోనే ఆమె బయటికి వచ్చేశారు. ఎలిమినేట్ అయ్యాక ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు. బయటికి వచ్చాక బిగ్‍బాస్ బజ్ ఇంటర్వ్యూలో కిర్రాక్ సీత పాల్గొన్నారు. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోలో ఏం ఉందంటే..

కారణం అదేనేమో..

సీతను బజ్ ఇంటర్వ్యూకు వెల్‍కమ్ చేశారు యాంకర్ అంబటి అర్జున్. బజ్‍లో ముందు తాను మాట్లాడతానని, అది విన్నాక మాట్లాడాలంటూ సీతతో అర్జున్ చెప్పారు. “బిగ్‍బాస్ అనేది లైఫ్‍టైమ్ అవకాశం. దాన్ని సరిగా వాడుకున్నారా” అని అర్జున్ ప్రశ్నించారు. ఎవరి ఆలోచన వారిదని, తాను 100 శాతం ఇచ్చానని సీత చెప్పారు. టాస్కుల్లో తాను కాకుండా ఇతరులను ముందుకు పంపడం తాను డౌన్ అయ్యేందుకు కారణం అయి ఉండొచ్చని కిర్రాక్ సీత అన్నారు.

హౌస్‍లో మీ పతనం ఎప్పుడు మొదలైందో గమనించారా అని అర్జున్ అడిగారు. దీనికి సీత రియాక్ట్ అయ్యారు. “‘టాస్క్ వచ్చినప్పుడు వేరే వాళ్లను పుష్ చేయడం వల్ల డౌన్ అయ్యానేమోనని నేను అనుకుంటున్నా. నాకూ తెలియదు” అని సీత చెప్పారు.

అది రియల్ గేమ్ కాదు

తన నిర్ణయాల మీద ఎక్కువసార్లు కాన్ఫిడెంట్‍గా ఉంటానని సీత చెప్పారు. “మనకు అనిపించింది మనం రైట్ అనుకుంటాం. కానీ అది బయటికి అలా కనిపించదు” అని అర్జున్ అన్నారు. దీనికి సీత గట్టిగా బదులిచ్చారు. “అది లెక్కలు వేసుకొని గేమ్ ఆడినట్టు. అది రియల్ గేమ్ కాదు” అని సీత బదులిచ్చారు.

క్యారెక్టర్ మార్చుకోలేను

ఏడ్వడం స్ట్రాంగ్‍గా అని అర్జున్ అన్నారు. “అరవడం స్ట్రాంగా.. మీరు స్ట్రాంగ్ అని ఏమనుకుంటున్నారో అది తప్పని నాకు అనిపిస్తోంది” అని సీత చెప్పారు. మంచితనమో కొంప ముంచిందని అనిపించిందా అని అర్జున్ అడిగితే.. అలాగని క్యారెక్టర్ మార్చుకోలేను అని సీత సమాధానం ఇచ్చారు.

నిఖిల్‍లో ఓ క్వాలిటీస్ చూశారు

సోనియాకు నిఖిల్ రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఏడ్చారని సీతను అర్జున్ క్వశ్చన్ చేశారు. గేమ్ చూసి నిఖిల్ ఇస్తాడనుకున్నానని, కానీ పర్సనల్ ఎమోషన్లతో ఇచ్చారని అన్నారు. నిఖిల్‍ను హస్బెంజ్ మెటీరియల్ అని సీత అనడంపై అర్జున్ ప్రశ్నించారు. నిఖిల్ ఒకడే ఒకరి వెంట పడ్డాడని అన్నారు.

టేస్టీ తేజ.. చిరాకు

వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన టేస్టీ తేజ తనకు చిరాకుగా అనిపించారని సీత చెప్పారు. “టేస్టీ తేజ చిరాకు అనే అనిపించారు. ఎందుకంటే వారంలో ఆమె పర్ఫార్మ్ చేసినట్టు, కాన్ఫిడెన్స్ కనిపించలేదు” అని సీత అన్నారు. గేమ్‍పరంగా నిఖిల్.. పారదర్శకంగా ఉండడని చెప్పారు. హజ్బెండ్ మెటీరియల్.. వేస్ట్ మెటీరియల్‍లోకి పంపండి అంటూ అర్జున్ జోక్ చేశారు. హౌస్‍లో ఉన్నప్పుడు తన తల్లి పంపిన లెటర్ గురించి అడగగా.. సీత ఎమోషనల్ అయ్యారు. హౌస్‍లో తనను ఆమె చూడాలనుకున్నారంటూ చెప్పారు. మొత్తంగా అర్జున్ ప్రశ్నలకు సీత గట్టిగానే సమాధానాలు ఇచ్చినట్టు అర్థమవుతోంది.