Bigg Boss 8 Telugu: హౌస్‍లో నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది, కానీ: నిఖిల్ ఆవేదన.. కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇచ్చిన బిగ్‍బాస్-i am thinking to quit says nikhil on bigg boss 8 telugu day 9 and contestants received strong warning ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: హౌస్‍లో నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది, కానీ: నిఖిల్ ఆవేదన.. కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇచ్చిన బిగ్‍బాస్

Bigg Boss 8 Telugu: హౌస్‍లో నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది, కానీ: నిఖిల్ ఆవేదన.. కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇచ్చిన బిగ్‍బాస్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 10, 2024 11:13 PM IST

Bigg Boss 8 Telugu Day 9: బిగ్‍బాస్ 8లో రెండో వారం నామినేషన్లు ముగిశాయి. ఎలిమినేషన్ కోసం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. హౌస్ నుంచి వెళ్లిపోవాలనిపిస్తుందని నిఖిల్ ఫీలయ్యారు. రేషన్‍ను వెనక్కి తీసుకున్నారు బిగ్‍బాస్.

Bigg Boss 8 Telugu: హౌస్‍లో నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది, కానీ..: నిఖిల్.. కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇచ్చిన బిగ్‍బాస్
Bigg Boss 8 Telugu: హౌస్‍లో నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది, కానీ..: నిఖిల్.. కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇచ్చిన బిగ్‍బాస్

బిగ్‍బాస్ 8 సీజన్‍లో రెండో వారం నామినేషన్ల ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఇంకో ఎపిసోడ్‍లోనూ నామినేషన్ల సాగాయి. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. వాగ్వాదాలు బాగానే జరిగాయి. అయితే, ఇంట్లో ఉన్న రేషన్ అంతా వెనక్కి తీసుకొని కంటెస్టెంట్లకు బిగ్‍బాస్ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్‍లో ఎలా సాగిందంటే..

నామినేషన్లలో వీళ్లే.. ప్రేరణను సేవ్ చేసిన యష్మి

బిగ్‍బాస్ 8 రెండో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ హాట్‍గా జరిగింది. కంటెస్టెంట్ల ఒకరిపై ఒకరు కారణాలు చెప్పే సమయంలో వాగ్వాదాలు జరిగాయి. చివరికి మణికంఠ, ప్రేరణ, పృథ్విరాజ్, ఆదిత్య ఓం, నిఖిల్, కిర్రాక్ సీత, శేఖర్ బాషా, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు. పెద్ద క్లాన్‍కు చీఫ్‍గా ఉన్న యష్మికి ఓ కంటెస్టెంట్‍ను కాపాడే పవర్ వచ్చింది. దీంతో ప్రేరణను సేవ్ చేసి.. నేరుగా విష్ణుప్రియను నామినేట్ చేశారు యష్మి.

తాను అనుకున్న వాళ్లందరూ అప్పటికే నామినేట్ అయ్యారని, అందుకే తనను చేసినట్టు విష్ణుప్రియకు యష్మి సర్దిచెప్పుకున్నారు. వ్యక్తిగతంగా ఏమీ లేదన్నారు.

వెళ్లిపోతానంటూ..

నామినేషన్లలో తనపై కంటెస్టెంట్లు చెప్పిన విషయాలపై నిఖిల్ బాధపడ్డారు. తాను తనలానే ఉంటానని, ఎలిమిట్ అయినా సరేనని చెప్పారు. హౌస్‍లో నుంచి సొంతంగా బయటికి వెళ్లాలనిపిస్తోందని, కానీ అలా చేస్తే తనది తప్పు అని అంగీకరించినట్టు అవుతుందని ప్రేరణ, మణికంఠకు నిఖిల్ చెప్పుకున్నారు.

తనను తనలా హౌస్‍లో ఉండనివ్వడం లేదని, వెళ్లిపోవానిపిస్తోందని నిఖిల్ బాధపడ్డారు. ఎలిమినేట్ అవుతానన్న తాను తనలాగే ఉంటానని నిఖిల్ అన్నారు. “పిచ్చి లేస్తోందా మీ ఇద్దరిని టాప్-10లో చూస్తున్నా” అని నిఖిల్, నైనికను మణికంఠ ఓదార్చారు.

తన వ్యక్తిత్వాన్ని ప్రేమించిన కొందరు ఇప్పుడు ఫేక్ అని అనడంతో బాధగా ఉందని నిఖిల్ చెప్పారు. “నిఖిల్ అనే వ్యక్తిత్వాన్ని ప్రేమించిన వాళ్లు కూడా.. గేమ్ షో కోసం విమర్శిస్తుంటే బాధగా ఉంది. గేమ్ షో కోసం ఫేక్ చేస్తున్నారని అనడం బాధిస్తోంది. నాకు ఆర్థికంగా డబ్బు అవసరం ఉండటంతోనే బిగ్‍బాస్‍కు వచ్చా. ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నాయి. అయితే ఇదంతా చేయలేనని చేయలేను. నాకు హౌస్‍ నుంచి బయటికి వెళ్లిపోవాలపిస్తోంది. కానీ క్విట్ చేస్తే నన్ను నేనే రాంగ్ అని అనుకుంటారని నేను వెళ్లడం లేదు. నాకు ఆ ఆలోచన ఉంది. నేను నిఖిల్‍గానే ఉండి ఏం చేయగలుగుతానో చేస్తా. ఎవరికైనా కొన్నిసార్లు చెబుతా. ఇంకోసారి ఆ టాపిక్ తేస్తే సైలెంట్‍గా ఉండడమే ఇష్టం” అని నిఖిల్ చెప్పారు.

రక్కమ్మ సాంగ్‍తో హౌస్‍లో తొమ్మిదో రోజు మొదలైంది. ఎప్పటిలాగానే కొందరు కంటెస్టెంట్లు ఏదో అలా కాలుకదిపారు. ఆ తర్వాత ఆట షురూ అయింది.

రేషన్ వెనక్కి తీసుకున్న బిగ్‍బాస్

బిగ్‍బాస్ హౌస్‍లో రేషన్‍తో సహా ప్రతీది సంపాదించుకోవాలని, ఇంట్లోకి రాగానే చెప్పానని బిగ్‍బాస్ గుర్తు చేశారు. తొలి వారం ఆహారం పంపినా.. ఇక మీ కోసం మీరు సంపాదించుకునే సమయం మొదలైందని అని చెప్పారు. ఆహార పదార్థాలు వండినవి, వండనివి అన్నీ స్టోర్ రూమ్‍లో పెట్టండని బిగ్‍బాస్ అనడంతో అందరూ షాకయ్యారు. అప్పుడే తినాల్సిందని కంటెస్టెంట్లు నిట్టూర్చారు. దీంతో ఫుడ్ అంతా స్టోర్ రూమ్‍లో పెట్టేశారు. తనకు చాలా ఆకలవుతోంది నాకు అని సోనియా అన్నారు.

తినేందుకు పోటాపోటీ

అందరూ తినేందుకు కాస్త సమయం ఇచ్చారు బిగ్‍బాస్. ఆ సయయంలో ఫుడ్ తినేందుకు 13 మంది కంటెస్టెంట్లు పోటీ పడ్డారు. వేగంగా నోట్లో ఆహారం కుక్కుకున్నారు. చేతికి అందినవి తినేశారు.

బిగ్‍బాస్ వార్నింగ్

బజర్ మోగిన తర్వాత కూడా కొందరు కంటెస్టెంట్లు తినడంతో బిగ్‍బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైజ్‍మనీ కోల్పోవాలని అనుకుంటున్నారా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో వెంటవెంటనే ఆహార పదార్థాలన్నింటినీ స్టోర్ రూమ్‍లో పెట్టారు కంటెస్టెంట్లు.

హౌస్‍లో తిండి కోసం రేషన్ గెలిచేలా కంటెస్టెంట్లకు రేపటి ఎపిసోడ్‍లో టాస్కులు ఇవ్వనున్నారు బిగ్‍బాస్. ఈ సీజన్ అంతా అన్‍లిమిటెడ్ కావటంతో గేమ్ బాగా ఆడితే కంటెస్టెంట్లకు ఎక్కువ ఆహార పదార్థాలు వస్తాయి. ఒకవేళ గేమ్ సరిగా ఆడకపోతే తక్కువగా వస్తాయి. ఇదే జరిగితే తిండి కోసం కూడా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.