Mufasa The Lion King Trailer: సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్టార్ హీరో డబ్బింగ్-hollywood movie mufasa the lion king trailer released shah rukh khan aryan khan abram khan dubbing ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mufasa The Lion King Trailer: సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్టార్ హీరో డబ్బింగ్

Mufasa The Lion King Trailer: సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్టార్ హీరో డబ్బింగ్

Hari Prasad S HT Telugu
Aug 12, 2024 01:46 PM IST

Mufasa The Lion King Trailer: ఐదేళ్ల కిందట వచ్చిన హాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ షారుక్, అతని తనయులు ఆర్యన్, అబ్రామ్ కలిసి డబ్బింగ్ చెప్పడం విశేషం.

సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్టార్ హీరో డబ్బింగ్
సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్టార్ హీరో డబ్బింగ్

Mufasa The Lion King Trailer: హాలీవుడ్ లో ఐదేళ్ల కిందట వచ్చిన ది లయన్ కింగ్ మూవీ గుర్తుంది కదా. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ముఫాసా: ది లయన్ కింగ్ పేరుతో వస్తున్న సీక్వెల్ హిందీ వెర్షన్ కు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తోపాటు అతని తనయులు ఆర్యన్, అబ్రామ్ కలిసి డబ్బింగ్ చెప్పారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది.

ముఫాసా: ది లయన్ కింగ్ ట్రైలర్

2019లో వచ్చిన లైవ్ యాక్షన్ మూవీ ది లయన్ కింగ్. అందులో ముఫాసా అనే సింహానికి షారుక్ డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ముఫాసా: ది లయన్ కింగ్ లో షారుక్ ఆ ముఫాసాగా తిరిగి వస్తుండగా.. ఈసారి అతని తనయులు ఆర్యన్, అబ్రామ్ కూడా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ మూవీ హిందీ ట్రైలర్ ఈ తండ్రీకొడుకుల డబ్బింగ్ తో ఓ రేంజ్ లో ఊపేస్తోంది.

ముఫాసా అనే సింహానికి షారుక్ డబ్బింగ్ చెప్పగా.. సింబా అనే మరో సింహానికి ఆర్యన్ ఖాన్, ముఫాసా చిన్నతనంలోని పాత్రకు అబ్రామ్ డబ్బింగ్ చెప్పారు. ఈ ముగ్గురి డబ్బింగ్ తోపాటు స్టన్నింగ్ విజువల్స్ తో ఈ ముఫాసా: ది లయన్ కింగ్ ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.

వాళ్లతో పంచుకోవడం సంతోషంగా ఉంది: షారుక్

ముఫాసాకు తన వాయిస్ అందించిన షారుక్ ఖాన్.. ఈ సినిమా, డిస్నీతో ఉన్న ప్రత్యేకమైన బంధం గురించి చెప్పుకొచ్చాడు. "ముఫాసా జంగిల్ కు ఓ అల్టిమేట్ కింగ్. తన తెలివిని తన కొడుకు ముఫాసాకు అందిస్తుంది. ఓ తండ్రిగా ముఫాసాతో నన్ను నేను పోల్చుకుంటాను. ముఫాసా: ది లయన్ కింగ్ మూవీ ముఫాసా చిన్నతనం నుంచి అద్భుతమైన కింగ్ గా ఎదిగిన తీరుకు అద్దం పడుతుంది. డిస్నీతో ఇది నాకు ప్రత్యేకమైన అనుబంధం. ముఖ్యంగా నా కొడుకులు ఆర్యన్, అబ్రామ్ తో కలిసి రావడం చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది" అని షారుక్ అన్నాడు.

ముఫాసా: ది లయన్ కింగ్ మూవీలో తండ్రీకొడుకుల పాత్రలైన ముఫాసా, సింబాలకు షారుక్, ఆర్యన్ డబ్బింగ్ చెప్పారు. ట్రైలర్ లో వాళ్ల వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేకాదు ముఫాసా చిన్నతనంలోని పాత్రకు షారుక్ చిన్న కొడుకు అబ్రామ్ వాయిస్ అందించడం ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలుపుతోంది. బ్యారీ జెన్కిన్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఓ అనాథగా అడివిలోకి వచ్చే ముఫాసా ఆ తర్వాత అదే అడవికి రాజుగా ఎలా ఎదిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.

Whats_app_banner