Guppedantha Manasu October 2nd Episode: రిషి పెళ్లి బాధ్యతలు శైలేంద్రకు అప్పగింత - వసును గురుదక్షిణ కోరిన జగతి
Guppedantha Manasu October 2nd Episode: రిషి, వసుధార పెళ్లి జరగకుండా అడ్డుకోవాలని చూస్తుంది దేవయాని. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించవు. వారి పెళ్లిని సక్రమంగా జరిపించే బాధ్యతను దేవయాని, శైలేంద్రలకు అప్పగిస్తాడు ఫణీంద్ర. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu October 2nd Episode: రిషి, వసుధారలకు విడగొట్టినందుకు బాధపడుతుంది జగతి. తన తప్పును మన్నించమని వసుధారకు క్షమాపణలు చెబుతుంది. మీరు మా మంచి కోసం..సంతోషం కోసం చేస్తే అది అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టానని జగతితో అంటుంది వసుధార. నేను మీకు క్షమాపణలు చెప్పాలని కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. మీ వల్లే నేను డీబీఎస్‌టీ కాలేజీలో చేరగలిగానని...తాను ఏదైనా సాధించినప్పుడు చప్పట్లు కొట్టారని...బాధలో ఉన్నప్పుడు భుజం తట్టారని అవన్నీ మర్చిపోయి మీ మనసును కష్టపెట్టానని వసుధార బోరున విలపిస్తుంది.
నువ్వు రిషి సంతోషంగా ఉండటమే తనకు కావాలని వసుధారతో అంటుంది జగతి. రిషి ఏ తప్పు చేయలేదని నువ్వే నిరూపించాలని చెబుతుంది. ఆ బాధ్యత నీదే అని అంటుంది. నేను బతుకుతానో లేదో తెలియడం లేదని జగతి కూడా ఎమోషనల్ అవుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైన నువ్వు రిషిని మాత్రం వదలవద్దని వసుధారతో అంటుంది. రిషి మునుపటి రుషేంద్రభూషన్‌లా ఉండాలన్నఅది నీ వల్లే సాధ్యమవుతుందని వసుధారతో చెబుతుంది జగతి. ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అని వసుధార దగ్గర మాట తీసుకుంటుంది.
ఇంట్లో అడుగుపెట్టిన రిషి...
జగతిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు. ఇంట్లో అడుగుపెట్టకుండా రిషి గుమ్మంలోనే ఆగిపోతాడు. గతంలో తాను చేసిన వాగ్ధానం గుర్తొస్తుంది. రిషి ఇంట్లో అడుగుపెడతాడా? లేదా? అని జగతి, మహేంద్ర టెన్షన్‌తో ఎదురుచూస్తుంటారు. జీవితంలో మనం చాలా అనుకుంటాం...కొన్నింటికి కట్టుబడి ఉంటాం...విధిరాత ముందు కొన్నిసార్లు వాగ్ధానాలు పక్కనపెట్టడమే మంచిదంటూ రిషికి వసుధార సర్ధిచెబుతుంది. చివరకు రిషి ఇంట్లో అడుగుపెడతాడు. అది చూసి జగతి, మహేంద్ర ఆనందపడతారు.
దేవయాని ప్లాన్...
రిషి, వసుధార పెళ్లి జరగకుండా అడ్డుకోవాలని దేవయాని ప్లాన్ చేస్తుంది. జగతి కండీషన్ బాగాలేదని, కోలుకున్న తర్వాత మీ పెళ్లి జరిగితే మంచిదని రిషితో అంటుంది. అమ్మ ఏది చెబితే అది జరిగి తీరాలని రిషి అంటాడు. జగతికి సర్ధిచెప్పి ఆమె మనసు మార్చాలని అనుకుంటుంది.
కానీ జగతి అందుకు ఒప్పుకోదు. దేవయానికి భర్త ఫణీంద్ర క్లాస్ ఇస్తాడు. జగతి ఇష్టప్రకారమే వసుధార, రిషి పెళ్లి జరగాలని అంటాడు. వాళ్ల పెళ్లి పనులకు సంబంధించిన అన్ని బాధ్యతల్ని దేవయాని, శైలేంద్రలకు అప్పగిస్తాడు ఫణీంద్ర. భర్త మాటలకు ఎదురుచెప్పలేక సరే అంటుంది జగతి.
శైలేంద్ర అసహనం...
రిషి, వసుధారలకు పెళ్లి తామే జరిపించాల్సిరావడంతో శైలేంద్ర సహించలేకపోతాడు. ఈ పెళ్లి జరిగితే రిషి పర్మినెంట్‌గా ఇంట్లోనే ఉండిపోతాడని, ఏదో ఒక రోజు వసుధార, జగతి కలిసి తన నిజస్వరూపాన్ని రిషి ముందు బయటపెడతారని భయపడిపోతాడు. అదే జరిగితే కాలేజీతో పాటు ఏండీ సీట్ తనకు దక్కదని శైలేంద్ర అనుకుంటాడు. పెళ్లి జరగకుండా కొత్త ప్లాన్ వేస్తాడు. దానిని అమలు చేసే బాధ్యతను దేవయానికి అప్పగిస్తాడు.
జగతి ఆనందం...
రిషి పెళ్లి తన చేతుల మీదుగా జరుగుతుండటంతో జగతి ఆనందపడిపోతుంది. ఆ వేడుకను కళ్లారా చూడటానికి రూమ్ నుంచి బయటకు వస్తుంది. జగతి సంతోషాన్ని చెడగొట్టాలని దేవయాని ఫిక్స్ అవుతుంది. రిషిని చాలా తెలివిగా మార్చేశావనిమాటలతో జగతి మనసును గాయపరుస్తుంది. తెలివి కాదని...మొదటి నుంచి రిషికి తానంటే ప్రాణమని...అప్పుడు మనసులో దాచుకున్నాడు...
ఇప్పుడు ఆ తల్లి ప్రేమను బయటపెట్టాడని దేవయానికి సమాధానం చెబుతుంది రిషి. ఈ సృష్టిలో తల్లిబిడ్డల ఆనందం తెంచడం ఎవరి వల్ల కాదని అంటుంది. రిషి నీ మీద జాలితోనే అమ్మ అని పిలిచాడు...నిన్ను బాధపెట్టడం ఇష్టం లేకే పెళ్లికి ఒప్పుకున్నాడని జగతితో అంటుంది దేవయాని. రిషికి ఎప్పటికీ ఈ పెద్దమ్మ అంటేనే ఇష్టం...ప్రేమ...నా స్థానం తన గుండెల్లో ఉంటుందని జగతితో ఛాలెంజ్ చేస్తుంది దేవయాని. రిషి గుండెల్లో ఉన్న మీ స్థానం చెరిగిపోయే సమయం వచ్చిందని దేవయానితో అంటుంది జగతి.
తల్లి సంతోషం...
తల్లి ఎప్పుడు తన పక్కనే ఉండాలని, అమ్మను సంతోషంగా చూసుకోవాలని తండ్రితో చెబుతూ ఎమోషనల్ అవుతాడు రిషి. నువ్వు అమ్మ పిలిచి జగతికి పునర్జన్మను ఇచ్చావని కొడుకు ధైర్యం చెబుతాడు మహేంద్ర. చుట్టాలు, బంధువులు ఎవరూ లేకుండా కుటుంబసభ్యుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి జరగడం బాధ అనిపించడం లేదా వసుధారను అడుగుతుంది ధరణి. జగతి తనకు జీవితాన్ని ఇచ్చిన గురువు...మేడమ్ ఇష్టంప్రకారం రిషి తన మెడలో తాళి కడుతున్నాడని ఇంతకంటే తనకు ఏం అవసరం లేదని వసుధార సమాధానం ఇస్తుంది.