Guppedantha Manasu May 15th Episode: జగతి చేతుల మీదుగా రిషి, వసుధార ఎంగేజ్‌మెంట్ - శైలేంద్ర కొత్త ట్విస్ట్
Guppedantha Manasu May 15th Episode: జగతి, మహేంద్ర చేతుల మీదుగా తన నిశ్చితార్థం జరగడం ఇష్టంలేదని రిషి అంటాడు. కానీ శైలేంద్ర రిషి కన్వీన్స్ చేస్తాడు. వారి చేతుల మీదుగానే నిశ్చితార్థం జరిపిస్తాడు.
Guppedantha Manasu May 15th Episode: రిషి, వసుధారల ఎంగేజ్‌మెంట్ రోజు కూడా జగతి ముఖంలో మాత్రం ఆనందం కనిపించదు. బాధతో ఒంటరిగా గదిలో కూర్చుంటుంది. ఇంతలోనే అక్కడకు వచ్చిన మహేంద్ర ఏమైందని జగతిని అడుగుతాడు. శైలేంద్ర, దేవయానిలా కారణంగా రిషి ప్రాణాలకు ప్రమాదం ఉన్న విషయం మహేంద్రతో చెప్పాలని జగతి అనుకుంటుంది. ఇంతలోనే ఆ గదిలోకి శైలేంద్ర, దేవయాని ఎంటర్ అవుతారు.
వచ్చి రావడంతోనే అసలు నీకు ఈ ఎంగేజ్‌మెంట్ ఇష్టం ఉందా.ఇంకా రెడీ కాలేదు అంటూ జగతిపై దేవయాని సెటైర్స్ వేస్తుంది. ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా అంటుంది. జగతి మనసులో ఏదో ఉంది. దేనికోసమో బాధపడుతుందని మహేంద్ర వారితో అంటాడు.
జగతిని అపార్థం చేసుకున్న మహేంద్ర...
ఈ ఎంగేజ్‌మెంట్ ప్రపోజల్ ముందుగా నేనే తీసుకొచ్చా. అది పిన్నికి ఇష్టం లేదోమో అని మహేంద్రతో అంటాడు శైలేంద్ర. అదే అనుకుంటా..శైలేంద్ర వచ్చినప్పటి నుంచి జగతి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అన్నింటికి అతడిపై అనుమానపడుతుందని దేవయాని రుసరుసలాడుతుంది.
నీకు నాపైన పగ, ద్వేషం ఉంటే నన్ను ఏదైనా అను...కానీ నా కొడుకును అపార్థం చేసుకోవద్దని జగతిపై కోపాన్ని ప్రదర్శిస్తుంది దేవయాని. వసుధారను కూడా జగతే చెడగొడుతుందని అంటుంది. మహేంద్ర ముందు ఆమెను విలన్‌ను చేస్తారు. ఇంట్లో ఫంక్షన్ రోజు బాధగా ఉండటం బాగాలేదని మహేంద్ర కూడా జగతిని అపార్థం చేసుకుంటాడు.
రిషి ప్రశ్నలకు షాక్...
ఎంగేజ్‌మెంట్ వేదిక దగ్గర కూడా జగతి బాధతో కనిపిస్తుంది. ఇంతలోనే రిషి, వసుధార కొత్త డ్రెస్సుల్లో మెరిసిపోతూ వేదిక దగ్గరకు వస్తారు. వారిని చూసి మహేంద్ర, ఫణీంద్ర సంతోషపడతారు. ఈ ఎంగేజ్‌మెంట్‌కు వసుధార తల్లిదండ్రులు వస్తారు. వారిని చూసి వసుధార సర్‌ప్రైజ్ అవుతుంది.
ఈ ఎంగేజ్‌మెంట్‌కు వచ్చినందుకు మీకు ఇబ్బంది ఏం లేదు కదా. మీకు ఇంటి దగ్గర ఏవో సమస్యలు ఉన్నాయని వసుధార తనతో అన్నది వసుధార తల్లిదండ్రులతో రిషి అంటాడు. రిషి మాటలకు ఇద్దరు షాక్ అవుతారు. కూతురు నిశ్చితార్థానికి రావడంలో అయిష్టం ఏముంటుందని చక్రపాణి రిషికి సమాధానం చెబుతాడు.
అయితే వసుధార ఎందుకు ఎంగేజ్‌మెంట్ వద్దన్నది, సమస్యలున్నాయని ఎందుకు అబద్దం చెప్పింది అంటూ రిషి మరో ప్రశ్న అడగటంతో వారు సైలెంట్ అవుతారు. తన తల్లిదండ్రులను తీసుకొని రూమ్‌లోకి వెళుతుంది. వారు ఎంత బతిమిలాడినా అసలు విషయం చెప్పకుండా దాచేస్తుంది.
శైలేంద్ర హడావిడి...
ఓ వైపు రిషి ఎంగేజ్‌మెంట్ జరుగుతోన్న శైలేంద్ర ఎలాంటి ప్లాన్ చేస్తాడో జగతి భయపడుతుంటుంది. ఆమె భయాన్ని మరింత పెంచేందుకు కొత్త నాటకం మొదలుపెడతాడు శైలేంద్ర. హడావిడి చేస్తాడు. శైలేంద్ర పైకి చేస్తోన్న ఆనందం వెనుక ఎలాంటి కుట్ర ఉందో అని జగతి మనసులోనే వేదనకు గురవుతుంది.
ఇంతలోనే పూజారి అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులు వేదిక మీదకు రావాలని పిలుస్తాడు. మహేంద్ర, జగతి స్టేజ్‌పైకి ఎక్కడానికి రెడీ అవుతోంటారు. జగతిని వద్దన్న రిషి దేవయానిని స్టేజ్‌పైకి రావాలని పిలుస్తాడు. దాంతో మహేంద్ర, జగతి షాక్ అవుతారు. రిషిని కన్వీన్స్ చేయడానికి ప్రయత్నించిన వారిమాట వినడు. ఇంతలోనే శైలేంద్ర కల్పించుకుంటాడు.
రిషిని ఒప్పించిన శైలేంద్ర...
దేవయానిని ఆపి జగతినేస్టేజ్‌పైకి ఎక్కిస్తాడు. రిషి ఏదో చెప్పబోతుంటే...నీకు నిజంగా నా మీద గౌరవం ఉంటే ఈ ఒక్క విషయంలో నా మాట కాదనకు అంటూ అతడితో అంటాడు. కొన్ని పద్దతులు, సంప్రదాయాలు ఎలా జరగాలో అలాగే జరగాలి అంటాడు. పిన్ని, బాబాయ్ చేతుల మీదుగానే ఎంగేజ్‌మెంట్ జరగితీరాలి అని పట్టుపడతాడు.
ఈ సమయంలో నువ్వు పిన్నిని అమ్మగా యాక్సెప్ట్ చేయకపోతే బాబాయ్‌ని కూడా నాన్నగా అంగీకరించనట్లే అని రిషిని తన మాటలతో కన్వీన్స్ చేస్తాడు. తాను మంచివాడిగా అందరి ముందు మార్కులు కొట్టేస్తాడు. జగతి, మహేంద్ర చేతుల మీదుగా నిశ్చితార్థం జరిగేలా రిషిని ఒప్పిస్తాడు. ఆ తర్వాత తానే రిషి, వసుధారలకు ఎంగేజ్‌మెంట్ రింగ్స్ ఇస్తాడు శైలేంద్ర. రిషి తన చేతికి ఉంగరం తొడుగుతోన్న సమయంలో వసుధార ఎమోషనల్ అవుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్ ముగిసింది.