Guppedantha Manasu June 1st Episode: వసుధారకు అవమానం - రిషి కోసం కన్నీళ్లు - అత్త ప్లాన్‌ను తిప్పికొట్టిన ధరణి
Guppedantha Manasu June 1st Episode: వ్రతం పేరుతో ఇంటికి పిలిచి వసుధారను అవమానించాలని దేవయాని స్కెచ్ వేస్తుంది. అత్త వేసిన ఐడియాను ధరణి తిప్పికొడుతుంది. వసుధారకు అండగా నిలుస్తుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu June 1st Episode: మను, వసుధారలను దెబ్బకొట్టడంలో రాజీవ్, శైలేంద్ర విఫలం కావడంతో దేవయాని రంగంలోకి దిగుతుంది. శైలేంద్ర, ధరణిలతో ఓ వ్రతం చేయిస్తున్నట్లు, ఆ వ్రతానికి అందరూ రావాలని మహేంద్ర, వసుధారతో పాటు దేవయానిని ఆహ్వానిస్తుంది.
మహేంద్ర అనుమానం...
ఒక్కసారిగా ధరణిపై దేవయాని ప్రేమను చూపిస్తుండటంతో మహేంద్ర అనుమానపడతాడు. ఈ వ్రతం వెనుక ఏదో కుట్ర ఉండి ఉంటుందని అనుకుంటాడు. దేవయానిపై అనుమానం ఉన్నా ధరణి కోసం ఈ వ్రతానికి వెళ్లాలని వసుధార ఫిక్సవుతుంది.
మనును జైలు నుంచి విడిపించడంలో ధరణి మనకు ఎంతో సాయం చేసిందని మహేంద్రతో వసుధార అంటుంది. వసుధార ఎంత చెప్పిన వ్రతం వెనుక ఏదో మతలబు ఉందని మహేంద్ర అనుమానపడుతూనే ఉంటాడు. తాను, అనుపమ ఈ వ్రతానికి రామని చెబుతారు. అందరి తరఫున వసుధార ఒక్కతే వ్రతానికి వెళ్లాలని ఫిక్సవుతుంది.
దేవయాని సెటైర్స్...
వ్రతానికి వసుధార ఒక్కతే రావడం చూసి అనుపమ రాలేదా అని అడుగుతుంది దేవయాని. అనుపమ రాకపోవడం మంచిదైంది...వస్తే లేనిపోని గోల అయ్యేది అని సెటైర్స్ వేస్తుంది. శైలేంద్ర, ధరణిలతో వ్రతం పూర్తి చేయిస్తాడు పంతులు. ఆ తర్వాత ముత్తైదువలకు ధరణి తాంబూలం ఇస్తుంది. వసుధారకు తాంబూలం ఇవ్వబోతుండగా ఆ వ్రతానికి వచ్చిన ముత్తైదువలకు వద్దని వారిస్తారు.
రిషి చనిపోతే తాంబూలం ఎలా ఇస్తారు...
రిషి చనిపోయాడు కదా...వసుధారకు తాంబూలం ఎలా ఇస్తావని ధరణిని అడ్డుకుంటారు ముత్తైదువలు. రిషి చనిపోలేదని, బతికే ఉన్నాడని వారితో వసుధార వాదిస్తుంది. బతికుంటే రిషి ఎక్కడున్నారని ఆ ముత్తైదువలు వసుధారను అడుగుతారు.
రిషి చనిపోయాడని పోలీసులు నిర్ధారించిన మాట నిజం. మేము నిజంగానే రిషి చనిపోయాడని నమ్ముతున్నాం అని దేవయాని అంటుంది. కానీ వసుధార మాత్రం రిషి బతికే ఉన్నాడని నమ్ముతుందని చెబుతుంది దేవయాని.
మా నమ్మకం మాది. తన నమ్మకం తనది అంటూ వసుధారకు సపోర్ట్ చేస్తున్నట్లు నటిస్తూ మరింత ఇరికిస్తుంది దేవయాని. ఒక మనిషి ఉండటం వేరు...ఉన్నాడని అనుకోవడం వేరు...నమ్మకం వేరు..అపనమ్మకం వేరు అంటూ ముత్తైదువలు దేవయాని, వసుధార వాదనను కొట్టిపడేస్తారు.
ఇంటికే అరిష్టం జరుగుతుంది...
రిషి బతికే ఉన్నాడని తాను నిరూపిస్తానని వసుధార అనగానే ముత్తైదువలు నవ్వుతారు.వసుధారకు ధరణి సపోర్ట్ చేస్తుంది. మీరు వద్దని అన్నంత మాత్రానా నేను వసుధారకు తాంబూలం ఇవ్వకుండా ఉండనని అంటుంది.
నువ్వు తనకు తాంబూలం ఇస్తే ఈ వ్రతమే చెడిపోతుంది. ఈ ఇంటికి అరిష్టం జరుగుతుంది అని ముత్తైదువలు అంటారు. మీరు చెప్పినట్లే ఈ వ్రతం చెడిపోయినా...నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు. నా మంచి కోరి వచ్చిన వాళ్లు అవమాన పడటం నాకు ఇష్టం లేదని ధరణి చెబుతుంది.
రిషి బతికే ఉన్నాడు...
రిషి చనిపోయాడు అనడానికి సరైన ఆధారాలు లేవు. రిషి బతికే ఉన్నాడు అనడానికి వసుధారనే సాక్ష్యం. రిషి బతికే ఉన్నాడని వసుధార మాత్రమే కాదు నేను నమ్ముతున్నా. వసుధార వంద శాతం ముత్తైదువనే, తనకు తాంబూలం ఇవ్వడంలో నాకు ఏం అభ్యంతరం లేదని అందరిపై ఫైర్ అవుతుంది ధరణి.
ధరణి కారణంగా తన ప్లాన్ చెడిపోతుండటం చూసి దేవయాని సహించలేకపోతుంది. ధరణి మాటలకు అడ్డుకట్ట వేయబోతుంది. కానీ దేవయాని మాటలను లెక్కచేయకుండా వసుధారకు తాంబూలం ఇస్తుంది ధరణి. నిన్ను ఎవరైన ఒక్క మాట అన్న నేను సహించలేనని వసుధారతో అంటుంది ధరణి. ఆ దేవుడు మంచి వాళ్లకు ఎప్పుడు చేయడని వసుధారకు సపోర్ట్ చేస్తుంది.
జీవితాలు నాశనం చేయడానికే...
ధరణి ఎంత చెప్పినా ఆ ముత్తైదువలు వెనక్కి తగ్గరు. ధరణి తాంబూలం ఇచ్చింది సరే...తీసుకోవడానికి వసుధారకైనా బుద్ది ఉండొద్దా...నిజంగా మంచి కోరింది అయితే అలా ఎందుకు చేస్తుంది. సంసారాలు, జీవితాలు నాశనం చేయాలని అనుకునే వారే ఇలా చేస్తారు అంటూ వసుధారను అవమానిస్తారు. వారి మాటలతో కన్నీళ్లు పెట్టుకుంటూ వ్రతం నుంచి తిరిగి వెళ్లిపోతుంది వసుధార.
ధరణి క్లాస్...
మీ ప్లాన్ ఫెయిలైందని షాకయ్యారా అంటూ వ్రతం పూర్తయిన తర్వాత దేవయానిని అడుగుతుంది ధరణి. మేము ఏం ప్లాన్ చేయలేదని దేవయాని బుకాయించబోతుంది. మీరేంటో ఎలాంటి వారో అందరి కంటే నాకే బాగా తెలుసు. మీరు నన్ను పిలిచి వసుధారకు తాంబూలం ఇవ్వమని అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందని దేవయానితో అంటుంది ధరణి.
మావయ్య లేనప్పుడే ఈ కార్యక్రమం పెట్టినప్పుడే వసుధారను అవమానించడానికే ఇదంతా చేస్తున్నారని అర్థమైంది. అయినా ఏదో మూల ఆశతో మీరు మా బాగు కోసం ఆలోచిస్తున్నారని వత్రానికి ఒప్పుకున్నానని ధరణి అంటుంది. లేదంటే ఈ వ్రతానికి ఒప్పుకునేదానిని కాదని చెబుతుంది
శైలేంద్ర ఎగతాళి...
నాకు వార్నింగ్ ఇస్తున్నావా...ఈ దేవయాని గురించి తెలిసి కూడా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావని ధరణిని హెచ్చరిస్తుంది దేవయాని. అవన్నీ నాకు తెలియదు కానీ మీరు బాగుండాలి. మీరు బాగుంటే ఇళ్లు బాగుంటుంది. మేము బాగుంటం అని దేవయానికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ధరణి. నువ్వేదో పెద్ద స్కెచ్ వేస్తావని అనుకున్నా.
ఇలాంటి పాతకాలం ఐడియాలతో వసుధారను ఏం చేయలేమని దేవయానితో అంటాడు శైలేంద్ర. నువ్వు నీ పిచ్చి ఐడియాలో అంటూ ఎగతాళిగా మాట్లాడుతాడు. నీ ప్లాన్ వల్ల వసుధార అవమానం పడటం సంగతి పక్కనపెడితే ధరణి ముందు మనం మరింత చులకన అయ్యామని అంటాడు. అసలు నువ్వు మాటలు చెప్పడం తప్పితే కరక్ట్‌గా సక్సెస్ అయ్యే ప్లాన్ ఒక్కటి వేయవా..నువ్వు ఎలా విలన్‌వి అయ్యావో అర్థ కావడం లేదని తల్లితో అంటాడు శైలేంద్ర.