Gundeninda Gudigantalu Today Episode: మనోజ్ ఫ్లాష్‌బ్యాక్ బయటపెట్టిన బాలు - రోహిణికి మీనా పంచ్ - ఒక్కటైన శృతి, రవి
Gundeninda Gudigantalu : గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 27 ఎపిసోడ్‌లో తాను జాబ్ చేస్తున్నట్లు రోహిణిని నమ్మించడానికి పార్క్‌లో దొరికిన కూపన్స్ తీసుకొచ్చి ఇస్తాడు మనోజ్. బాలు ముందు మనోజ్ తక్కువ కావడం ఇష్టంలేని ప్రభావతి కూడా మనోజ్‌కు జాబ్ లేకపోయినా ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తుంది.
Gundeninda Gudigantalu Today Episode: తాను జాబ్ చేస్తున్నట్లుగా భార్యను నమ్మించడానికి పార్క్‌లో దొరికిన కూపన్స్‌ను రోహిణికి చూపిస్తాడు మనోజ్. ఆఫీస్‌లో ఇచ్చారని అబద్దం ఆడుతాడు. మనోజ్ అబద్ధాన్ని ప్రభావతి కనిపెడుతుంది. రోహిణిని పక్కకు పంపించి జాబ్ లేకుండా కూపన్స్ఎక్కడి నుంచి తెచ్చావని కొడుకును నిలదీస్తుంది.
ఓ జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లానని, తనకు నాలుగు డిగ్రీలు ఉండటంతో జాబ్ ఇవ్వలేమని చెప్పి ఈ కూపన్స్ ఇచ్చారని తల్లికి కూడా అబద్ధం చెబుతాడు మనోజ్.
బాలు సెటైర్లు...
తల్లితో మనోజ్ మాట్లాడిన మాటల్ని బాలు వింటాడు. ఈ జాబ్ కూడా పోయిందా అని మనోజ్‌ను నిలదీస్తాడు. జాబ్ పోలేదని, ఇంతకంటే బెటర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నానని కవర్ చేస్తాడు మనోజ్. ఇంతకంటే బెటర్ జాబ్ అంటే గుడి ముందు కూర్చొని అడుక్కోవడమే అంటూ మనోజ్‌పై సెటైర్లు వేస్తాడు బాలు.
నువ్వు జీవితాంతం డ్రైవర్‌గానే జాబ్ చేయాలని మనోజ్ తల్చుకుంటే నీ కంటే పెద్ద కారు కొనగలడని కొడుకును మనోజ్‌ను సపోర్ట్ చేస్తుంది ప్రభావతి. కష్టపడి మనోజ్ ఈ కూపన్స్ తెచ్చుకున్నాడని రోహిణి కూడా అంటుంది. ఆ కూపన్స్‌తో ఇంటిల్లిపాది అందరం బట్టలు కొందామని సత్యం అంటాడు.
రవికి శృతి వార్నింగ్...
మరోవైపు షాపింగ్‌కు రమ్మంటే రవి రానని అంటాడు. శృతి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తుంటాడు. అన్నయ్య ఇచ్చిన వార్నింగ్‌కు భయపడి శృతి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడు. దాంతో లవ్ చేసేటప్పుడు ఉన్న ధైర్యం సమస్య వచ్చినప్పుడు ఎందుకు లేదని, పెళ్లి చేసుకునేంత ధైర్యం లేనప్పుడు తనను ఎందుకు ప్రేమించావని రవికి మెసేజ్ పెడుతుంది శృతి.
నన్ను కట్ చేయాలని చూస్తే ఊరుకోనని, రేపటిలోగా పెళ్లి విషయంలో నీ నిర్ణయం ఏమిటో చెప్పకపోతే జీవితాంతం నువ్వు బాధపడాల్సివస్తుందని రవికి వార్నింగ్ ఇస్తుంది శృతి.
మనోజ్ గురించి గొప్పలు...
మనోజ్‌కు ఆఫీస్‌లో కూపన్స్ ఇచ్చారని, షాపింగ్‌కు వెళుతున్నామని తన కొడుకు గురించి స్నేహితురాలు కామక్షికి ఫోన్ చేసి తెగ బిల్డప్‌లు ఇస్తుంది ప్రభావతి. మీనాక్షిని కూడా షాపింగ్‌కు రమ్మని అంటుంది. శృతిని చూడటానికి ఆమె ఇంటికొస్తాడు సంజు. శోభన, సురేంద్రలకు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇస్తాడు.
అవి చూసి శృతి తల్లిదండ్రులు హ్యాపీగా ఫీలవుతారు. అప్పుడే శృతి అక్కడికి వస్తుంది. మోడ్రన్ డ్రెస్‌లో శృతి అందానికి ఫిదా అయినా సంజు ఆమెను తెగ పొడుతాడు. శృతి, తాను సరదాగా షాపింగ్‌కు వెళతామని, ఈవినింగ్ మళ్లీ శృతిని ఇంటి దగ్గర దింపుతానని సంజు అంటాడు.
మనోజ్ ఫ్లాష్‌బ్యాక్...
శృతి కారు బ్యాక్ సీట్‌లో కూర్చుంటానని పట్టుపడుతుంది. సంజు మాత్రం ఒప్పుకోడు. నిన్ను వెనక కూర్చొబెట్టుకొని డ్రైవ్ చేయడానికి నేనేమైనా డ్రైవర్‌నా అంటూ ఆమెను ముందు కూర్చోమంటాడు.
ప్రభావతి ఫ్యామిలీ మొత్తం షాపింగ్‌కు బయలుదేరుతారు. బాలు కారు షేర్ ఆటోలా ఉందని ప్రభావతి సెటైర్లు వేస్తుంది. ఇంతకుముందు మనోజ్ కారు చాలా పెద్దగా ఉండేదని అంటుంది. ఇప్పుడు ఆ కారు ఏమైందో చెప్పాలని బాలు పట్టుపట్టడంతో ప్రభావతి, మనోజ్ కంగారుపడతారు. మనోజ్‌కు కలర్ కలిసిరాకపోవడంతో అమ్మేశాడని ప్రభావతి అబద్ధం ఆడుతుంది.
ఒకే షాపింగ్ మాల్‌లో రవి, శృతి...
రవి కూడా షాపింగ్‌కు వస్తాడు. అదే షాప్‌కు సంజు, శృతి కూడా వస్తారు. రవిని చూసి శృతి హ్యాపీగా ఫీలవుతుంది. ఈ రోజు నేను నా గర్ల్‌ఫ్రెండ్ ఒక్కటవ్వబోతున్నావని, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పమని సంజుతో అంటాడు రవి. శృతిని టచ్ చేయబోతాడు సంజు. అతడి లాగిపెట్టి ఒక్కటి కొడతాడు రవి.
నీపై దోమ వాలిందని అబద్ధం ఆడతాడు. శృతితో కలిసి షాపింగ్ చేస్తున్న సంజును తెలివిగా అక్కడి నుంచి పంపిస్తాడు రవి. ప్రేమను గెలిపించడం కోసం నువ్వు ఏం చేయమంటే అది చేస్తానని శృతికి మాటిస్తాడు రవి.
ప్రభావతి వివక్ష...
చీరల సెలెక్షన్‌లో మీనాపై ప్రభావతి వివక్ష చూపించడం బాలు సహించలేకపోతాడు. ఇద్దరు కోడళ్లకు ఒకే రకమైన చీరలు సెలెక్ట్ చేస్తే బాగుంటుందని అంటాడు. షాపింగ్ మాల్‌లో ప్రభావతితో బాలు ఆర్గ్యూ చేయడం రోహిణి సహించలేకపోతాడు. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియని అడివి మనుషులు అంటూ బాలు, మీనాలను రోహిణి అవమానిస్తుంది.
నా భర్త కష్టంతోనే షాపింగ్ చేస్తున్నట్లు, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకం మేము కాదని రోహిణికి సమాధానమిస్తుంది మీనా. షాపింగ్‌లో శృతిని చూస్తాడు బాలు. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.