Gundeninda Gudigantalu Today Episode: రవికి శృతి డెడ్‌లైన్ - బిల్డప్ ఇవ్వబోయి బుక్కైన మనోజ్ - రోహిణి వేరు కాపురం
Gundeninda Gudigantalu : గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 26 నాటి ఎపిసోడ్‌లో అత్తింట్లో కోటీశ్వరురాలిగా తాను ఆడుతోన్న నాటకం బయటపడకుండా ఉండటానికి తల్లిని ఊరి నుంచి పంపించాలని రోహిణి అనుకుంటుంది. రోహిణి తల్లి అనుకోకుండా బాలు క్యాబ్ ఎక్కుతుంది. ఆమెను తన ఇంటికి తీసుకొస్తాడు బాలు.
Gundeninda Gudigantalu Today Episode: తన తల్లి సుగుణ ఇక్కడే ఉంటే తాను ఆడుతోన్న నాటకం మొత్తం బయటపడుతుందని రోహిణి కంగారు పడుతుంది. ఆమెను మరో ఊరు పంపించే ప్రయత్నాలు మొదలుపెడుతుంది. సుగుణను బస్ ఎక్కించడానికి తనకు వీలుపడకపోవడంతో విద్యను ఆమె దగ్గరకు పంపిస్తుంది. బస్‌స్టాండ్ వరకు క్యాబ్ బుక్ చేస్తుంది విద్య. అనుకోకుండా బాలు క్యాబ్ అక్కడికి వస్తుంది.
క్యాబ్ ఎక్కిన చింటును చూసి బాలు షాకవుతాడు. మరోవైపు బాలును చూసి రోహిణి తల్లి సుగుణ కూడా కంగారు పడుతుంది. తాను రోహిణి తల్లి అనే విషయం బయటపడకుండా తడబడుతూ బాలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మీనా మిమ్మల్ని చూడాలని కోరుకుంటుందని, చింటుతో కలిసి మా ఇంటికి మీరు రావాల్సిందేనని బాలు పట్టుపడతాడు.
రోహిణి తల్లి కంగారు...
సుగుణ రానని చెప్పిన వినకుండా బాలు ఆమెను తన ఇంటికి తీసుకొస్తాడు. ఆమె లోపలికి రావడానికి ఒప్పుకోదు. రోహిణి తమను అక్కడ చూస్తే ఆమె కాపురానికి ప్రమాదమని తెగ టెన్షన్ పడుతుంది ఇంట్లోకి రాకుండా బయటే మీనాతో మాట్లాడి వెళ్లిపోవాలని అనుకుంటుంది.
రోహిణికి షాక్...
అప్పుడే పార్లర్ నుంచి విద్యతో కలిసి రోహిణి ఇంటికొస్తుంది. తమ ఇంటి ముందు తల్లితో పాటు చింటు ఉండటం చూసి షాకవుతుంది. మీనా, బాలులతో తల్లి మాట్లాడుతుండటంతో రోహిణి భయంతో వణికిపోతుంది. తన నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందోని గాబరాపడుతుంది. మీ కూతురి ఇండియాకు రాలేదా అని రోహిణి తల్లిని అడుగుతాడు బాలు.
ఇంకా సింగపూర్‌లోనే ఉందని సుగుణ సమాధానమిస్తుంది. అప్పుడు దుబాయ్ అన్నారు..ఇప్పుడు సింగపూర్ అని అంటున్నారని మీనా అనుమానంగా అడుగుతుంది. దుబాయ్‌లోనే ఉందని, వయసు మీదపడి మర్చిపోయానంటూ రోహిణి తల్లి సర్ధిచెబుతుంది.
ఊపిరి పీల్చుకున్న రోహిణి...
కారు చాటున దాక్కున వారి మాటలను వింటుంటుంది రోహిణి. కూతురు అక్కడి రావడం చూసిన సుగుణ... బస్‌కు టైమ్ అవుతుందని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హడావిడి చేస్తుంది. ఆమె కంగారు చూసి బాలు బయలుదేరుతాడు. దాంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయిందని రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది.
విద్య సలహా...
ఇలా అబద్దాల మీద అబద్దాలు చెప్పడం కరెక్ట్ కాదని, నీ కొడుకు జీవితం గురించి ఆలోచించి అయినా ప్రభావతి, మనోజ్‌లకు నిజం చెప్పమని విద్య అంటుంది. లేదంటే విడిగా కాపురం పెట్టమని, అప్పుడే మనోజ్ నువ్వు ఏం చెప్పన నమ్ముతాడని రోహిణికి సలహా ఇస్తుంది విద్య. అదే టైమ్‌లో రోహిణి దగ్గరకు ప్రభావతి వస్తుంది. రోహిణిని తెగ పొగుడుతుంది.
తల్లిలేని బిడ్డ అయిన రోహిణిని తానే తల్లిలా చూసుకుంటున్నానని అంటుంది. మీనాకు డబ్బు ఉండుంటే ఎప్పుడో వేరు కాపురం పెట్టేదని, రోహిణి కోటీశ్వరురాలైన కలిసి ఉండాలని కోరుకుంటుందని కోడలిపై ప్రశంసలు కురిపిస్తుంది.
మనోజ్ నాటకం...
జాజ్‌కు వెళుతున్నానని రోజులానే ఇంట్లో అబద్దం చెప్పి పార్కుకు వస్తాడు మనోజ్. స్నేహితులతో కలిసి పిచ్చాపాటీ మాట్లాడుతుంటాడు. తమతోపాటు రోజు పార్కు వచ్చే స్నేహితుడు భార్యకు దొరికిపోతాడు. జాబ్‌కు వెళుతున్నానని చెప్పి అబద్ధం ఆడిన భర్తను చితక్కొడుతుంది. రేపు మీకు ఇదే గతి పడుతుందని మనోజ్ అండ్ గ్యాంగ్‌కు వార్నింగ్ ఇస్తుంది.
భార్యభర్తల గొడవలో కొన్ని షాపింగ్ కూపన్స్ పడిపోతాయి. వాటిని తీసుకున్న మనోజ్ ఆఫీస్‌లో ఇచ్చారని ఇంట్లో కలరింగ్ ఇవ్వాలని అనుకుంటాడు. రెస్టారెంట్ క్లోజ్ చేసే టైమ్ అయినా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి శృతి ఒప్పుకోదు. ఆమెను రవి బతిమిలాడుతాడు. తనకు పెళ్లి ఫిక్సయిందని చెప్పిన ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నావని రవిపై ఫైర్ అవుతుంది శృతి.
ఇప్పుడే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అంటుంది. తన కుటుంబాన్ని బాధపెట్టి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని రవి అంటాడు. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుందామని శృతిని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు.
శృతి డెడ్‌లైన్...
నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని రవిని అడుగుతుంది శృతి. చేస్తున్నానని రవి ఆమెకు బదులిస్తాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని శృతి అంటుంది. నువ్వు డిసైడ్ అయ్యావా లేదా అని రవిని అడుతుంది. కానీ బాలు వార్నింగ్ గుర్తొచ్చి రవి సమాధానం చెప్పకుండా సైలెంట్ అవుతాడు.
రేపటి వరకు నీకు టైమ్ ఇస్తున్నాను. అప్పటిలోగా నువ్వు సమాధానం చెప్పకపోతే నేను తీసుకునే నిర్ణయానికి నువ్వు జీవితాంతం బాధపడతావని రవికి డెడ్‌లైన్ ఇచ్చి శృతి వెళ్లిపోతుంది.
దొరికిపోయిన మనోజ్...
షాపింగ్ కూపన్స్ తీసుకొని ఇంటికొచ్చి రోహిణి ముందు తెగ బిల్డప్‌లు ఇస్తాడు మనోజ్. కొడుకు మాటలు విని ప్రభావతి సహించలేకపోతుంది. జాబ్‌లేకుండా కూపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయని కొడుకును పక్కకు తీసుకెళ్లి నిలదీస్తుంది. ఓ జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లానని వారు కూపన్స్ ఇచ్చారని తల్లి దగ్గర మనోజ్ అబద్దం ఆడతాడు. మనోజ్ మాటలను బాలు వింటాడు.
ఈ ఉద్యోగం కూడా పోయిందా అని మనోజ్‌పై సెటైర్స్ వేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి...మనోజ్ ఉద్యోగం పోయిందనే మాట వినగానే షాకవుతుంది. ఇంట్లో వాళ్లందరికి మనోజ్ ఉద్యోగం పోయిందనే సంగతి తెలిసిపోతుంది. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.
టాపిక్