Manchu Vishnu - Manoj: మంచు బ్ర‌ద‌ర్స్‌ మ‌ధ్య బ‌య‌ట‌ప‌డ్డ విభేదాలు - విష్ణు దాడికి పాల్ప‌డిన‌ వీడియో షేర్ చేసిన మ‌నోజ్‌-manchu vishnu trying to attack on manoj video viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Vishnu - Manoj: మంచు బ్ర‌ద‌ర్స్‌ మ‌ధ్య బ‌య‌ట‌ప‌డ్డ విభేదాలు - విష్ణు దాడికి పాల్ప‌డిన‌ వీడియో షేర్ చేసిన మ‌నోజ్‌

Manchu Vishnu - Manoj: మంచు బ్ర‌ద‌ర్స్‌ మ‌ధ్య బ‌య‌ట‌ప‌డ్డ విభేదాలు - విష్ణు దాడికి పాల్ప‌డిన‌ వీడియో షేర్ చేసిన మ‌నోజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 24, 2023 12:02 PM IST

Manchu Vishnu - Manchu Manoj:మంచు విష్ణు, మంచు మ‌నోజ్ మ‌ధ్య విభేదాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. త‌న‌ బంధువుల ఇళ్ల‌పై విష్ణు దాడికి ప్ర‌య‌త్నించిన వీడియోను మంచు మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

మంచు మనోజ్, విష్ణు
మంచు మనోజ్, విష్ణు

Manchu Vishnu - Manchu Manoj: మంచు విష్ణు, మ‌నోజ్ మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్లుగా చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. చాలా ఏళ్లుగా ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త లేన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తోన్నాయి. తాజాగా మంచు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య వివాదం బ‌హిర్గ‌త‌మైంది.

త‌న బంధువుల ఇంటిపై మంచు విష్ణు దాడిచేయ‌డానికి ప్ర‌య‌త్నించిన వీడియోను మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. ఇన్నాళ్లు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య సెలైంట్‌గా ఉన్న గొడ‌వ‌లు ఇప్పుడు అంద‌రికీ తెలిసిపోయాయి. ఈ వీడియోలో విష్ణు దూకుడుగా క‌నిపిస్తుండ‌గా అత‌డిని కొంద‌రు ఆపుతూ క‌నిపించారు.

అరేయ్ ఒరేయ్ అని వాడు ఏదో అంటున్నాడు క‌దా అని విష్ణు అరుస్తూ క‌నిపించాడు. ఇళ్ల‌ల్లోకి వ‌చ్చి మా వాళ్ల‌ను బంధువుల్ని ఇలా కొడుతుంటాడు. ఇది సిట్యువేష‌న్ అంటూ మంచు మ‌నోజ్ వాయిస్ ఈ వీడియోలో వినిపిస్తోంది.

విష్ణు దాడికి య‌త్నించిన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మ‌నోజ్ ఆ త‌ర్వాత డిలేట్ చేశాడు కానీ అప్ప‌టికే ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. మంచు మ‌నోజ్‌కు స‌న్నిహితుడైన సార‌థి అనే వ్య‌క్తిపై విష్ణు దాడికి పాల్ప‌డేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు స‌మాచారం. కాగా సోద‌రుడు విష్ణుపై మ‌నోజ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల జ‌రిగిన మంచు మ‌నోజ్ వివాహ వేడుక‌లో విష్ణు ఎక్కువ‌గా క‌నిపించ‌లేదు.

IPL_Entry_Point

టాపిక్