Gunde Ninda Gudi Gantalu: బాలు ఉపాధి పోగొట్టిన సేట్ - మీనా తల్లిపై ప్రభావతి చిందులు - దినేష్ ట్రాప్‌లో రోహిణి
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 13 ఎపిసోడ్‌లో దీపావళి పండుగకు రవి, శృతిని కూడా ఇంటికి పిలుద్దామని ప్రభావతి అంటుంది. రవి పేరు వినగానే బాలు ఫైర్ అవుతాడు. రవి ఇంట్లో అడుగుపెడితే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు.
Gunde Ninda Gudi Gantalu: మనోజ్, రోహిణి రెడీ అయ్యి కిందికివస్తారు. ఇంకా టీ పెట్టలేదా అంటూ తల్లిని అడుగుతాడు మనోజ్. ఆవిడగారు ఇంకా నాకే టీ ఇవ్వలేదు...మావయ్య ఇంట్లోకి రానిచ్చురుగా...కాబట్టి ఆయనకు మాత్రమే సేవలు చేస్తుందటా అంటూ మీనాను కావాలనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది ప్రభావతి.
టీ కావాలంటే నేను ఇస్తా...ఇంకా ఎవరికైనా కావాలంటే రోహిణి చేసి పెడుతుందని మీనా పంచ్‌వేస్తుంది. రోహిణి ఏబీసీ జ్యూస్‌పై మౌనిక సెటైర్లువేస్తుంది. ఆ జ్యూస్ పేరు వినగానే ప్రభావతి కంగారుపడుతుంది. నేను ఇప్పుడు జ్యూస్ కావాలని అడిగానా అంటూ మాట మార్చేస్తుంది.
అమ్మమ్మకు నిజం చెప్పబోయిన బాలు...
సత్యానికి అతడి తల్లి ఫోన్ చేసి అనారోగ్యం గురించి ఎంక్వైరీ చేస్తుంది. తనకు గుండెనొప్పి అని కాకుండా జ్వరం అని తల్లితో అబద్దం చెబుతాడు సత్యం. అప్పుడే అక్కడికి బాలు ఎంట్రీ ఇస్తాడు. బాలుతో మాట్లాడుతానని తల్లి అనడంతో ఫోన్ కొడుకుకు ఇస్తాడు సత్యం. జ్వరం అన్నారని తెలియక...నీకు అంతా తెలిసిపోయిందా...
రవి వల్లే జరిగిందని బాలు నిజం బయటపెట్టబోతాడు. కంగారుగా బాలు నోరు మూసేస్తుంది మీనా. అమ్మమ్మకు ఇక్కడ జరిగినవేవి తెలియదని బాలుకు చెబుతుంది. తండ్రికి ఏం కాలేదని బాలు కూడా మాటదాటేస్తాడు.
ప్రభావతిపై సెటైర్లు...
ప్రభావతిపై సత్యం తల్లి సెటైర్లు వేస్తుంది. సత్యాన్ని సరిగ్గా చూసుకోవడం ప్రభావతికి చేతకాదని అంటుంది. మీనా ఎలా ఉందని బాలును అడుగుతుంది అమ్మమ్మ. కానీ బాలు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. మళ్లీ మీనాతో ఏమన్నా గొడవపడ్డావా అని అడుగుతుంది.
మీనాకు ఫోన్ ఇస్తాడు బాలు. మీ అత్త నిన్ను ఇంకా రాచిరంపానా పెడుతోందా మీనాను అడుగుతుంది అమ్మమ్మ. అత్తయ్య మాటలను ప్రభావతి సహించలేకపోతుంది. మీనా ఇంట్లో ఎలాంటి గొడవలు పెట్టిందో ఇప్పుడే మొత్తం చెబుతానంటూ ఆవేశపడుతుంది. ఆమె ఆవేశాన్ని సత్యం కంట్రోల్ చేస్తాడు.
రవికి సంబంధం...
రవికి మంచి సంబంధం చూశానని సత్యంతో అంటుంది అమ్మమ్మ. ఆ అమ్మాయిని చూడటానికి వస్తారా అని అడుగుతుంది. అమ్మకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక తర్వాత మాట్లాడుకుందామని టాపిక్ డైవర్ట్ చేస్తాడు సత్యం. కొడుకును చూడాలని ఆరాటపడుతుంది. కానీ ఊరికి ఇప్పుడు వెళ్లడం కుదరదని ప్రభావతి సైగలు చేస్తుంది. ప్రభావతే రాకుండా అడ్డుకుంటుందని సత్యం తల్లి గ్రహిస్తుంది. అదే మాట చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
రవి పేరు ఎత్తితే...
అమ్మమ్మ పంపించిన డబ్బులతో పాటు తాను కొన్ని ఇస్తానని వాటితో కొత్త బట్టలు కొనుక్కొమ్మని బాలు, మనోజ్‌లతో సత్యం అంటాడు. ఇప్పటికే మందుల కోసం చాలా ఖర్చయిందని, ఇప్పుడు బట్టలు కొనడం వద్దని మీనా అంటుంది. మనోజ్ మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుపడతాడు.
రవి, శృతిని కూడా దీపావళికి ఇంటికి పిలుద్దామని ప్రభావతి అంటుంది. రవి పేరు వినగానే బాలు కోపం పట్టలేకపోతాడు. రవి ఇంట్లో అడుగుపెట్టాలని చూస్తే గుమ్మంలోనే అతడికి నరికేస్తానని కోపంగా అంటాడు. రవి, శృతి వస్తే తమ గౌరవం కూడా తగ్గిపోతుందని భయపడ్డ మనోజ్ కూడా వాళ్లు రావడానికి వీలులేదని అంటాడు. తప్పు చేసిన మీనాను ఇంట్లోకి రానివ్వగా లేదని, రవి వస్తే తప్పేంటని ప్రభావతి వాదిస్తుంది. కానీ బాలు వినడు.
పాతిక వేల బోనస్...
తల్లి దగ్గర తీసుకున్న పాతిక వేలను బోనస్ అంటూ రోహిణికి ఇస్తాడు. షోరూమ్ కోసం నువ్వు ఎన్నో కార్లు అమ్మి ఉంటావని, నీకు కాకుండా ఎవరికి బోనస్ ఇస్తారంటూ భర్తపై పొగుడుతుంది రోహిణి. సంక్రాంతికి కూడా బోనస్ అడగమని అంటుంది. ఈ సారి ఎవరిని డబ్బు అడగాలా అని మనోజ్ ఆలోచనలో పడతాడు.
దినేష్ బ్లాక్ మెయిల్...
దినేష్‌కు యాభై వేలు ఇస్తానని మాటిచ్చిన రోహిణి ఇరవై ఐదు వేలు సర్ధుబాటు కావడంతో కంగారుపడుతూనే అతడిని కలుస్తుంది. రోహిణి అందాన్ని చూసి దినేష్ ఫిదా అవుతాడు. ఎలా ఉన్నావు కళ్యాణి, అత్తారింట్లో అందరూ నిన్ను నమ్మేశారా కళ్యాణి అంటూ దినేష్ అడుగుతాడు. అవన్నీ నీకు అవసరం అంటూ తాను తెచ్చిన ఇరవై ఐదు వేలను అతడికి ఇచ్చేస్తుంది రోహిణి. తాను అడిగింది యాభై వేలు కదా అని దినేష్ అంటాడు. నా దగ్గర ఉంది ఇంతేనని చిరాకుగా రోహిణి సమాధానమిస్తుంది.
నీ చరిత్ర మొత్తం తెలుసు...
నీ భవిష్యత్తు నా చేతిలో, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసునని, చిరాకు పడితే నీకే నష్టం అని రోహిణికి దినేష్ వార్నింగ్ ఇస్తాడు. ఎక్కువ మాట్లాడకుండా ఇచ్చింది తీసుకోనని చెప్పి దినేష్ వార్నింగ్‌ను పట్టించుకోదు. నా మాట కాదంటే నీకే నష్టం అని దినేష్ భయపెట్టడంతో రోహిణి తగ్గుతుంది.ఇంకో ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సిందేనని చెప్పి వెళ్లిపోతాడు.
మీనా తల్లికి అవమానం...
మీనా తల్లి భయభయంగానే కూతురి ఇంటికొస్తుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని తల్లిని చూసి మీనా కంగారుపడుతుంది. నువ్వు ఇంట్లో అడుగుపెట్టడానికి వీలులేదని మీనా తల్లిని ప్రభావతి అడ్డుకుంటుంది. నువ్వు ఇంట్లోకి వస్తే మా మనశ్శాంతి మొత్తం దూరమవుతుందని అంటుంది.నీ కూతురు పుణ్యామా అని పోలీస్ స్టేషన్, హాస్పిటల్ అన్ని చూశామని ప్రభావతి నోరు పారేసుకుంటుంది.
సంస్కారం కాదు...
ఇంటి గడపలో అడుగుపెట్టిన మనిషిని అవమానించడం సంస్కారం కాదని ప్రభావతి మాటల్ని అడ్డుకుంటాడు సత్యం. అత్తయ్యతో బాలు పొడిపొడిగా మాట్లాడుతాడు. దీపావళికి బాలు, మీనాను ఇంటికి పిలవడానికి వచ్చానని మీనా తల్లి అంటుంది. మీనా పుట్టింటికి వచ్చేది లేదని బాలు అంటాడు.
మార్వాడీ సేట్‌తో గొడవపడటంతో బాలు రెంట్ కారును అతడు బలవంతంగా తీసుకెళతాడు. అందుకు మీనానే కారణమని ఆమెను నిందిస్తాడు బాలు. ఇప్పుడు సంతోషంగా దీపావళి జరుపుకుందామా అంటూ తన మాటలతో మీనాను హర్ట్ చేస్తాడు.
టాపిక్