Telugu Indian Idol Season 2 Updates: ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్.... ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమైన మొదటి సీజన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రెండో సీజన్ షురూ అయింది. తెలుగు సంగీత ప్రేక్షకులను అలరించిన ఈ షో.. సెకండ్ సీజన్ రాబోతోంది. తాజాగా సీజన్ 2 కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆహా సీఈవో అజిత్ ఠాకూర్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్, గాయనీ గాయకులు కార్తీక్, గీతామాధురి, హేమచంద్ర పాల్గొన్నారు.
ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో హిట్ అయిన షోస్ లో 'తెలుగు ఇండియన్ ఐడల్' ఒకటి. యువగాయనీ గాయకులకు తమ ప్రతిభ నిరూపించుకోవడానికి ఈ సింగింగ్ షో మంచి వేదికగా నిలిచింది. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గాను మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించి సందడి చేసిన తొలి సీజన్ లో జయంత్, వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి, ప్రణతి లాంటి తెలుగు గాయనీగాయకులు తమ పాటలతో ఆకట్టుకున్నారు.
ఇలా తెలుగు సంగీత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సింగింగ్ షో... సెకండ్ సీజన్ రాబోతుంది. అయితే తాజా సీజన్‌లో సింగర్ హేమచంద్ర సింగింగ్ షోకు హోస్ట్‌గా చేయనున్నారు. ఇక జడ్జీల విషయానికొస్తే… సింగర్ నిత్యామేనన్ ప్లేస్‌లో ట్యాలెంటెడ్ సింగర్ గీతా మాధురి రానున్నారు.
మొదటి సీజన్ విజేతగా వాగ్దేవి నిలిచిన సంగతి తెలిసిందే. ఈ షో ఫైనల్స్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. రెండో సీజన్ షో మార్చిలో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెకండ్ సీజన్ కోసం పోటీదారులను కూడా ఎంపిక చేశారు.
సంబంధిత కథనం