Telugu Movies Releasing This Week: ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలు ఇవే
Telugu Movies Releasing This Week: ఈ వారం థియేటర్లలో ధనుష్ సార్‌తో పాటు మరోమూడు తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...
Telugu Movies Releasing This Week:
ధనుష్ (Dhanush) సార్ - ఫిబ్రవరి 17
ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసే బాల గంగాధర్ తిలక్ అనే లెక్చరర్ కథతో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ ద్విభాషా సినిమా తమిళంలో వాతి పేరుతో ఫిబ్రవరి 17నే రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.
వినరో భాగ్యము విష్ణు కథ - ఫిబ్రవరి 18
వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో ఫిబ్రవరి 18న తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఫోన్ నంబర్ నైబరింగ్ అనే కాన్సెప్ట్‌తో లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.
మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తోన్నారు. తొలుత ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాలని అనుకున్నారు. థియేటర్ ఇష్యూస్ కారణంగా ఒక రోజు ఆలస్యంగా వినరో భాగ్యము విష్ణుకథ ఫిబ్రవరి 18న విడుదల అవుతోంది.
శ్రీదేవి శోభన్ బాబు
చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి నిర్మించిన శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఫిబ్రవరి 18న విడుదలకానుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వినోదాత్మక ప్రేమకథగా రూపొందుతోన్న ఈ సినిమాలో సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు.
వీటితో పాటుగా యశ్వంత్, రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ సినిమా కూడా ఫిబ్రవరి 18న రిలీజ్ కానుంది. మార్వెల్ స్టూడియోస్ యాంట్ మ్యాన్ క్వాంటుమేనియా హాలీవుడ్‌తో పాటు తెలుగులో ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
టాపిక్