Fight club OTT Release: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ ఫైట్ క్లబ్-fight club ott release lokesh kanagaraj movie ott streaming details ott news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Fight Club Ott Release: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ ఫైట్ క్లబ్

Fight club OTT Release: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ ఫైట్ క్లబ్

Hari Prasad S HT Telugu
Jan 26, 2024 07:29 PM IST

Fight club OTT Release: డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ రెండేళ్లలో విక్రమ్, లియో రూపంలో రెండు హిట్స్ అందుకున్నాడు. అయితే అతడు నిర్మాతగా తీసిన ఫైట్ క్లబ్ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది.

ఫైట్ క్లబ్ మూవీ
ఫైట్ క్లబ్ మూవీ

Fight club OTT Release: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన కొత్త ప్రొడక్షన్ కంపెనీ జీ స్క్వాడ్ లో నిర్మించిన ఫైట్ క్లబ్ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

డైరెక్టర్ గా లోకేష్ రెండేళ్లలో రెండు హిట్స్ అందుకున్నా.. నిర్మాతగా మాత్రం ఈ ఫైట్ క్లబ్ మూవీ అతనికి నిరాశనే మిగిల్చింది.

ఓటీటీలోకి ఫైట్ క్లబ్..

అబ్బాస్ ఎ. రెహ్మత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫైట్ క్లబ్ మూవీలో విజయ్ కుమార్ నటించాడు. ఉరియాది మూవీతో డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించిన విజయ్.. ఈ ఫైట్ క్లబ్ లో మెయిన్ రోల్లో కనిపించాడు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడీ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో శనివారం (జనవరి 27) నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

నిజానికి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై గతంలోనే వార్తలు వచ్చినా.. తాజాగా స్ట్రీమింగ్ వివరాలు కన్ఫమ్ అయ్యాయి. ఈ ఫైట్ క్లబ్ ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఇప్పుడీ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉండనుంది. 2022లో విక్రమ్, గతేడాది లియో సినిమాలు అందించిన లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను ప్రజెంట్ చేశాడు.

ఫైట్ క్లబ్ ఎలా ఉందంటే?

ఫైట్ క్ల‌బ్ సాదాసీదా రివేంజ్ డ్రామా మూవీ. నార్త్ చెన్నై నేటివిటీతో రియ‌లిస్టిక్‌గా సినిమాను తెర‌కెక్కించి ఫ్రెష్‌నెస్ ఫీలింగ్‌ను క‌లిగించాడు డైరెక్ట‌ర్ అబ్బాస్ ఏ ర‌హ‌మ‌త్‌. సినిమా మొత్తం నాన్‌లీనియ‌ర్ స్క్రీన్‌ప్లేలో సాగుతుంది.

కాలేజీలో ఉన్న‌ హీరోతో పాటు అత‌డి ఫ్రెండ్స్‌పై ఎటాక్ చేసేందుకు విల‌న్ గ్యాంగ్ ప్ర‌య‌త్నించే సీన్‌తో సినిమా మొద‌ల‌వుతుంది. అక్క‌డే ఆ సీన్‌ను అక్క‌డే క‌ట్ చేసి చివ‌ర‌లో దానికి ముందు, వెనుక ఏం జ‌రిగింది అన్న‌ది చూపిస్తాడు. చాలా చోట్ల సినిమాలో అలాంటి టెక్నిక్ వాడాడు డైరెక్ట‌ర్‌. ఫ‌స్ట్ హాఫ్‌లో వ‌దిలివేసిన చాలా ప్ర‌శ్న‌ల‌కు సెకండాఫ్‌లో ఆన్స‌ర్ ఇస్తూ ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేశాడు.

క్లైమాక్స్ ఫైట్ ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు అద్ధం ప‌డుతుంది. వేర్వేరు చోట్ల ఉన్న విల‌న్స్‌తో హీరో ఫైట్ చేసే సీన్‌ను ఇంప్రెసివ్‌గా డైరెక్ట‌ర్ స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశాడు. సౌండ్ డిజైనింగ్ చాలా కొత్త‌గా ఉంది. క్యారెక్ట‌ర్ ఎంపిక కూడా బాగుంది. ప్ర‌తి పాత్ర చాలా రియ‌లిస్టిక్‌గా ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. ఫైట్ క్ల‌బ్ క‌థ రొటీన్ అయినా టేకింగ్‌, మేకింగ్ వైజ్ కొత్తగా అనిపిస్తుంది. విజ‌య్ కుమార్ యాక్టింగ్ కూడా మెప్పిస్తుంది.

Whats_app_banner