Lokesh Kanagaraj latest news : ప్రముఖ డైరక్టర్ లోకేశ్ కనగరాజ్‌కు వ్యతిరేకంగా మధురై కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. డైరక్టర్‌పై మానసిక పరీక్షలు నిర్వహించాలని పిటషనర్ పేర్కొన్నారు. అసలు విషయం ఏంటంటే..
ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నారు తమిళ డైరక్టర్ లోకేశ్ కనగరాజ్. ఆయన దర్శకత్వం వహించిన లియో సినిమా.. 2023 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. అయితే.. రాజ మురుగన్ అనే వ్యక్తి.. లోకేశ్ కనగరాజ్‌కు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. తన సినిమాలతో లోకేశ్ హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. లోకేశ్‌పై వెంటనే సైకలాజికల్ పరీక్షలు జరపాలని పిటిషన్లో పేర్కొన్నారు.
Petition on Lokesh Kanagaraj : "లియోతో పాటు అనేక సినిమాల్లో లోకేశ్ కనగరాజ్ హింసను ప్రేరేపిస్తున్నారు. ఇది సామాజానికి మంచి విషయం కాదు. అక్రమ కార్యకలాపాలు సాగించే వారిని ఫేమస్ చేసి చూపిస్తున్నారు. పోలీసుల మద్దతుతోనే నేరాలు జరుగుతున్నట్టు చిత్రీకరిస్తున్నారు," అని పిటిషన్లో వివరించారు రాజ మురుగన్.
లోకేశ్ కనగరాజ్ వంటి దర్శకులు తీసే సినిమాలపై సెన్సార్ బోర్డు ప్రత్యేక దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు రాజ మురుగన్. లోకేశ్‌ని సైకలాజికల్‌గా ఇవాల్యుయేట్ చేయాలని కోరారు. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Lokesh Kanagaraj Madhurai court : ఈ వ్యవహారంపై మధురై కోర్టుకు చెందిన జస్టిస్ కృష్ణ కుమార్, జస్టిస్ విజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా.. పిటిషన్ తరఫు న్యాయవాది రాకపోవడంతో.. విచారణను వాయిదా వేసింది.
కాగా.. తనపై మధురై కోర్టులో దాఖలైన పిటిషన్ గురించి లోకేశ్ కనగరాజ్ ఇంకా స్పందించలేదు. దీనిపై ఆయన ఏ విధంగా మాట్లాడతారు? అనేది ఆసక్తిగా మారింది.
Lokesh Kanagaraj Leo movie : ఎల్సీయూ (లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్)గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లోకేశ్ కనగరాజ్. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. డ్రగ్స్, మర్డర్, యాక్షన్, థ్రిల్లర్ చుట్టూ సాగే కథలపై ఆయన ఫోకస్ చేస్తారు. ప్రముఖ నటుడు విజయ్‌తో ఆయన తీసిన లియో సినిమా అక్టోబర్‌లో విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. వసూళ్ల పరంగా దూసుకెళ్లింది. ఈ సినిమా త్రిష హిరోయిన్‌గా నటించగా.. అనిరుధ్ రవించందర్ మ్యూజిక్‌ని అందించాడు.
వాస్తవానికి ఇలాంటి విషయాలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డీ వంగా తీసిన యానిమల్ సినిమాలోని కొన్ని దృశ్యాలపై విమర్శలు ఎదురయ్యాయి. హింసను గ్లోరిఫై చేస్తున్నారంటూ చాలా మంది విమర్శించారు.
సంబంధిత కథనం