Bigg Boss 8 Telugu: గుడ్ల కోసం కొట్లాట.. ఆదిత్యను లాగేసిన పృథ్వి.. టాస్క్ వద్దని బిగ్‍బాస్‍కు చెప్పండన్న యష్మి: వీడియో
Bigg Boss 8 Telugu Day 17 Promo 2: బిగ్‍బాస్ హౌస్‍లో గుడ్ల కోసం కంటెస్టెంట్లు పోటీలు పడ్డారు. ఓ టాస్కుల భాగంగా గుడ్లను సేకరించేందుకు తీవ్రంగా తలపడ్డారు. ఒకరిని ఒకరు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గొడవలు జరిగాయి. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ హౌస్‍లో కొన్ని టాస్కులు హోరాహోరీగా సాగుతున్నాయి. ఎక్కువ మంది కంటెస్టెంట్లు తలపడే టాస్కుల్లో గొడవలు గట్టిగానే జరుగుతున్నాయి. ఈ సీజన్ 17వ రోజైన నేటి (సెప్టెంబర్ 18) ఎపిసోడ్‍లో కోడిగుడ్ల గేమ్ తీవ్రంగా జరిగింది. కంటెస్టెంట్లు ఒకరినొకరు అడ్డుకునేందుకు కిందామీదా పడ్డారు, ఈడ్చుకున్నారు. ఈ గేమ్‍కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది.
గుడ్ల కోసం పోరాటం
ప్రభావతి 2.0 అంటూ గడ్డితో కోడి ఆకారంలో ఉన్న బొమ్మ హౌస్‍లో కనిపించింది. “ఏ క్లాన్ సభ్యులు ఎక్కువ గుడ్లను తిరిగి ఇస్తారో.. వారికి నా తరఫున కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి” ఆ కోడి చెప్పింది. దీంతో కోడిగుడ్లను తీసుకొని ఆ కోడి ఆకారంలో పెట్టేందుకు కంటెస్టెంట్లు తలపడ్డారు. నిఖిల్, అభయ్ క్లాన్ సభ్యులు రెండు టీమ్‍లుగా గేమ్ ఆడారు.
గుడ్లను తీసుకొచ్చేందుకు, ఎదుటి క్లాన్ సభ్యులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఒకరి మీద ఒకరు పడి అడ్డుకున్నారు. చేతులు, కాళ్లు పట్టుకొని లాక్కున్నారు. ఈ క్రమంలో గొడవలు జరిగాయి.
పృథ్వి దూకుడు.. ఆదిత్య అభ్యంతరం
ఈ సీజన్ ఆరంభం నుంచి టాస్కుల్లో పృథ్విరాజ్ అతిదూకుడు ప్రదర్శిస్తున్నారు. బాహాబాహీకి దిగుతున్నారు. ఈ గుడ్ల టాస్కులో కంటెస్టెంట్లను అడ్డుకోవడం కూడా భాగం కావటంతో మరింత అగ్రెసివ్‍గా ఆడారు పృథ్విరాజ్. ఈ క్రమంలో ఓ దశలో ఆదిత్య ఓం, సోనియా, నబీల్ గుడ్ల కోసం పోరాడుతుంటే.. పృథ్వి వచ్చి ఆదిత్యను పట్టుకొని పక్కకు లాగే పడేశారు.
దీంతో ఆదిత్య అసంతృప్తి వ్యక్తం చేశారు. మెడను అలా పట్టుకోవద్దని ఆయాస పడుతూ చెప్పారు. తనను ఇద్దరు పట్టుకున్నారంటూ పృథ్వి సమర్థించుకున్నారు. అలా అయితే ఆటకు రావొద్దని పక్కన కూర్చోవాలని ఆదిత్యపై గట్టిగా అరిచారు. పృథ్వికి సోనియా, విష్ణు కూడా సోపర్ట్ చేశారు.
నేనూ అమ్మాయినే కదా..
బిగ్‍బాస్ 8 సీజన్‍లో వాదనలకు ఫేమస్ అయిన యష్మి గౌడ మరోసారి గొడవకు దిగారు. ఆటపై ఎవరో అభ్యంతరం తెలిపితే గట్టిగా అరిచారు. దెబ్బలు తగులుతాయని కొందరు అంటున్నారని, తాను అమ్మాయినైనా ఆడుతున్నా కదా అని అరిచారు. “అక్కడ తగులుతుంది.. ఇక్కడ తగులుతుంది అంటే.. టాస్కే పెట్టువద్దని చెప్పండి బిగ్‍బాస్‍కు. నేను ఆడుతున్నాను కదా.. నేను అమ్మాయినే కదా” అని యష్మి అన్నారు. మొత్తంగా ఈ గుడ్ల గేమ్‍లో కంటెస్టెంట్ల మధ్య గట్టిగా వాగ్వాదాలు అయ్యాయి.
బెలూన్ గేమ్‍పై హౌస్‍లో ఇంకా వాదనను యష్మి కొనసాగించినట్టు నేటి తొలి ప్రోమో వచ్చింది. సోనియా నిర్ణయం తప్పేనని, ఆమె చేసింది కరెక్ట్ కాదంటూ చెప్పారు. అభయ్ ఆటను నిఖిల్ మళ్లీ తప్పుబట్టారు. అభయ్ బాక్స్ బయటికి వెళ్లి ఆడారని అన్నారు. అది తన స్ట్రాటజీ అని అభయ్ కూడా చెప్పారు. ప్రేరణ తనకు దోశ సరిగా వేయలేదంటూ విష్ణుప్రియ ఏడ్చేశారు. తనకు ఫుడ్ విసిరేసారని విష్ణు బాధపడ్డారు. కంటెస్టెంట్లు ఆమెను ఓదార్చారు. యాటిట్యూడ్ చూపించొద్దని ప్రేరణపై కోప్పడ్డారు మణికంఠ. ఏమైనా చేసుకోపో అంటూ ప్రేరణ అన్నారు. ఈ తతంగంలో ఏం జరిగిందో నేటి ఎపిసోడ్‍లో తెలుస్తుంది.