Aavesham OTT: ఓటీటీలో మరో భాషలో అందుబాటులోకి రానున్న ఫాహద్ ఫాజిల్ సూపర్ హిట్ మూవీ-fahadh faasil aavesham set to stream on amazon prime video ott in tamil dubbing but not clarity on telugu version ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aavesham Ott: ఓటీటీలో మరో భాషలో అందుబాటులోకి రానున్న ఫాహద్ ఫాజిల్ సూపర్ హిట్ మూవీ

Aavesham OTT: ఓటీటీలో మరో భాషలో అందుబాటులోకి రానున్న ఫాహద్ ఫాజిల్ సూపర్ హిట్ మూవీ

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 17, 2024 10:50 PM IST

Aavesham OTT: థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఆవేశం సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపింది. అయితే, ఈ మలయాళం మూవీ మరో భాషలోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చేందుకు రెడీ అయింది.

Aavesham OTT: ఓటీటీలో మరో భాషలో అందుబాటులోకి రానున్న ఫాహద్ ఫాజిల్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులో వస్తుందా?
Aavesham OTT: ఓటీటీలో మరో భాషలో అందుబాటులోకి రానున్న ఫాహద్ ఫాజిల్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులో వస్తుందా?

Aavesham OTT: మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆవేశం సినిమా బ్లాక్‍బస్టర్ అయింది. ఈ యాక్షన్ కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఏప్రిల్ 11వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, మలయాళంలో మాత్రమే థియేటర్లలో విడుదలైంది. అయినా రూ.160కోట్ల వసూళ్లతో ఆవేశం అదరగొట్టింది. ఈ సినిమా ఓటీటీలోనూ మలయాళంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పుడు డబ్బింగ్‍లో మరో భాషలోనూ స్ట్రీమింగ్‍కు రానుంది.

స్ట్రీమింగ్ వివరాలు

ఆవేశం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 9వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, కేవలం మలయాళంలో అందుబాటులోకి వచ్చింది. అయితే, డబ్బింగ్ వెర్షన్లు కూడా తీసుకురావాలనే డిమాండ్లను ప్రైమ్ వీడియోకు నెటిజన్లు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆవేశం మూవీని తమిళ డబ్బింగ్‍లో అందుబాటులోకి తెచ్చేందుకు ఆ ప్లాట్‍ఫామ్ రెడీ అయింది.

ఆవేశం తమిళ వెర్షన్ జూన్ 21వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లోకి అందుబాటులోకి రానుందని సమాచారం బయటికి వచ్చింది. ఇందుకోసం ఇప్పటికే తమిళ వెర్షన్ సెన్సార్‌ను మేకర్స్ పూర్తి చేయించారు.

తెలుగు వెర్షన్‍పై నో క్లారిటీ

ఆవేశం సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‍పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ మూవీ తెలుగులో వస్తుందని కొందరు ఎదురుచూస్తున్నారు. అయితే, తమిళంపై అప్‍డేట్ వచ్చినా తెలుగు విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఆవేశం ఇక తెలుగు ఆడియోలో రావడం కష్టంగానే కనిపిస్తోంది.

ఆవేశం కలెక్షన్లు

ఆవేశం సినిమా సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. అయితే, ఈ చిత్రం ఏకంగా రూ.160కోట్ల కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ అయింది. ఫాహద్ ఫాజిల్‍కు ఇది బిగ్గెస్ట్ హిట్‍గా నిలిచింది. థియేటర్లలో మలయాళంలో మాత్రమే రిలీజైనా కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. ఆ రేంజ్‍లో ఆవేశం మూవీకి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఫాహద్ ఫాజిల్ నటనపై మరోసారి ప్రశంసల వర్షం కురిసింది.

ఆవేశం సినిమాకు జితూ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో గ్యాంగ్‍స్టర్ రంగగా ఫాహద్‍ ఫాజిల్ యాక్టింగ్ అదిరిపోయింది. యాక్షన్‍తో పాటు కామెడీతోనూ మెప్పించారు. మిథున్ జయశంకర్, హిప్‍స్టర్, రోషన్ షానవాజ్, ఆశిష్ విద్యార్థి, సాజిన్ గోపు, మన్సూర్ అలీ ఖాన్, చెంబన్ వినోద్ కీలకపాత్రలు పోషించారు.

ఆవేశం చిత్రాన్ని ఫాహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్, అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకాలపై నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్ నిర్మించారు. ఈ సినిమా ఎక్కువ శాతం బెంగళూరు బ్యాక్‍డ్రాప్‍లోనే సాగుతుంది. ఈ చిత్రానికి సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు.

కేరళకు చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో ఇంజినీంగ్ చదువుకునేందుకు వెళతారు. అయితే, కాలేజీలో సీనియర్లు వారిని ర్యాంగింగ్ చేస్తారు. దీంతో వారి పని పట్టేందుకు గ్యాంగ్‍స్టర్ అయిన రంగ (ఫాహద్ ఫాజిల్) దగ్గరికి వెళతారు. ఆ తర్వాత ఏమైంది.. ఈ విషయంలో రంగ చేశాడు.. అనేదే ఆవేశం స్టోరీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

WhatsApp channel