Telugu News  /  Entertainment  /  Everyone Should Applaud Even When A Woman Do This Says Ramgopal Varma On Ranveers Nude Photohsoot
రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్ ఫొటోషూట్
రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్ ఫొటోషూట్ (Instagram)

RGV on Ranveer: ఆడవాళ్లు న్యూడ్‌ ఫొటోషూట్‌ చేసినా పాజిటివ్‌గానే ఉండాలి: రాంగోపాల్‌ వర్మ

26 July 2022, 18:31 ISTHT Telugu Desk
26 July 2022, 18:31 IST

RGV on Ranveer: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌పై మరో ట్వీట్‌ చేశాడు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఎప్పటిలాగే అతని ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌ ఏమోగానీ.. కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా అతనిపైనే చర్చ. కొందరు పాజిటివ్‌గా, మరికొందరు నెగటివ్‌గా ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతున్నారు. కొందరు పోలీసులకూ ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదైంది. మరో చోట అతనికి బట్టలు దానం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. తాజాగా ప్రముఖ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ మరోసారి ఈ ఫొటోషూట్‌పై స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

మంగళవారం (జులై 26) అతడు చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. నిజానికి ఇప్పటికే ఓసారి రణ్‌వీర్‌ ఫొటోషూట్‌పై ఆర్జీవీ స్పందించాడు. ఇప్పుడు ట్విటర్‌ ద్వారా ఆ ఫొటోను షేర్‌ చేస్తూ.. "నేను వ్యక్తిగతంగా దీనిని అభినందిస్తున్నాను. చాలా మంది రణ్‌వీర్‌ సింగ్‌ బోల్డ్‌నెస్‌ను మెచ్చుకోవడం చూసి థ్రిల్‌ ఫీలయ్యాను. అయితే ఓ మహిళ కూడా ఇలా చేసినప్పుడు ఇంతే మంది ఆమెను మెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. లింగ సమానత్వం ఉండాలి కదా" అని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు.

నిజానికి ఇంతకుముందు కూడా వర్మ ఇదే విధంగా స్పందించాడు. లింగ సమానత్వం గురించి మాట్లాడుతూ.. స్త్రీలు తమ సెక్సీ బాడీని చూపించినప్పుడు పురుషులు చూపిస్తే తప్పేంటి.. ఈ లింగ సమానత్వం కోసమే రణ్‌వీర్‌ తన వంతు పాత్ర పోషించాడు అని ఆర్జీవీ తనదైన స్టైల్లో స్పందించాడు. ఇప్పుడు మరోసారి అదే జెండర్‌ ఈక్వాలిటీ అంటూ రణ్‌వీర్‌ను అభినందిస్తున్న వారికి సవాలు విసిరాడు.