Bigg Boss Telugu 6 Episode 72: శ్రీసత్య- కీర్తి మధ్య ఇగో గొడవ.. రాజ్‌పై ఇనాయ సీరియస్.. రూటు మార్చిన ఆదిరెడ్డి
Bigg Boss Telugu 6 Episode 72: బిగ్‌బాస్ 6వ సీజన్‌లో 11వ వారం నామినేషన్లలో భాగంగా.. కెప్టెన్ ఫైమా మినహా మిగిలినవారంతా నామినేట్ అయ్యారు. ఈ ప్రక్రియలో శ్రీసత్య-కీర్తి మధ్య ఇగో అనే పదంపై వాదన జరుగ్గా.. ఆదిరెడ్డి రూటు మార్చి మొదటిసారిగా తనను ఇంతవరకు నామినేట్ చేయని ఇద్దరిని నామినేట్ చేశాడు.
Bigg Boss Telugu 6 Episode 72: బిగ్‌బాస్ షోలో ఏ రోజు ఎపిసోడ్ ఎలాగా ఉన్నా.. సోమవారం మాత్రం మంచి రంజుగా సాగుతుంది. ఇంటిసభ్యుల నామినేషన్‌తో ప్రక్రియ రసవత్తరంగా, ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. ఇంటి నుంచి ఒకరని పంపించడానికి సాగే ఈ ప్రక్రియ ఎప్పుడూ వాడీ వేడీగా జరుగుతుంది. అయితే ఈ వారం మాత్రం సాఫీగా సాగింది. ఒకరు లేదా ఇద్దరూ మినహా పెద్దగా వాదోపవాదాలు జరగలేదు. రాజ్-ఇనాయ, శ్రీసత్య-కీర్తి మధ్య వాదనలు తప్ప పెద్దగా ఎలాంటి హీటెడ్ ఆర్గ్యూమెంట్లు జరగలేదు.
ముందుగా ఎపిసోడ్ సత్తే ఏ గొడవ లేదు అనే పాటతో మొదలవుతుంది. ఇందుకు శ్రీహాన్ తనదైన స్టెప్పులతో అలరించాడు. అనంతరం ఫైమా, రేవంత్, శ్రీసత్య కూర్చుని నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుతుంటారు. మరోపక్క ఆదిరెడ్డి.. తనతో క్లోజ్ అయిన గీతూ, బాలాదిత్యను బయటకు పంపిస్తున్నారు బిగ్‌బాస్ అంటూ బాధపడుతుంటాడు. తర్వాత తననే అని చెప్పడానికి సింబాలిక్‌గా చెబుతున్నారా? అని స్పష్టం చేశారు. ఇంతలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంటి సభ్యులు ఒక్కొక్కరు తాము నామినేట్ చేయాలుకున్న ఇద్దరి హౌస్ మేట్స్‌పై చెత్త బుట్టల్లో ఉన్న చెత్తను వేసి నామినేట్ చేయాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశిస్తాడు.
ముందుగా ఫైమా.. ఇనాయాను నామినేట్.. చేస్తూ ఎఫ్ అనే వర్డ్ వాడటం తనకు నచ్చలేదని, అలాగే టాస్క్‌లో ఓవర్ ఫిజికల్ అవుతున్నావని చెబుతూ నామినేట్ చేస్తుంది. అనంతరం రోహిత్‌ను నామినేట్ చేస్తూ.. గత వారం టాస్క్‌లో అతడు ఓవర్ అగ్రెషన్ అయ్యాడని, అలాగే అనుకూడని పదాన్ని ఉపయోగించాడని చెబుతూ ముగించింది. అందుకు రోహిత్.. తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పే ప్రయత్నంలో తనను తాను అనుకున్నానని స్పష్టం చేస్తాడు. అనంతరం అదిరెడ్డి తన నామినేషన్‌లో ఇంతవరకు నామినేట్ చేయని వారిని నామినేట్ చేస్తున్నానని చెబుతాడు. ముందుగా శ్రీహాన్‌ను నామినేట్ చేయగా.. అనంతరం రోహిత్‌కు ఓటేస్తాడు. టాస్క్‌లో శ్రీహాన్ ఆటతీరు తనకు నచ్చలేదని అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పగా.. రోహిత్‌కు మాత్రం ఓవర్ అగ్రెషన్ అనే విషయంపై నామినేట్ చేస్తాడు.
రాజ్-ఇనాయ మధ్య వాదన..
ఇనాయా.. రాజ్‌ను నామినేట్ చేసినప్పుడు కాస్త వాదన జరిగింది. వితండవాదం అనే ట్యాగ్ తనకు రాజ్ ఇవ్వడం నచ్చలేదని చెబుతూ అతడిని నామినేట్ చేసింది. ఇందుకు రాజ్ ఓ పాయింట్ నుంచి మరో పాయింట్‌కు వెళ్లావని అందుకే నామినేట్ చేస్తున్నానని రాజ్ చెబుతాడు. ఇందుకు ఇనాయా అంగీకరించలేదు. ఈ విషయంలో ఈ ఇద్దరి మధ్య కాస్త హీటెడ్ ఆర్గూమెంట్ జరిగింది. అనంతరం రాజ్ నామినేషన్ సమయంలోనూ ఇనాయాను నామినేట్ చేస్తూ.. నాగార్జున సార్‌తో మాట్లాడేటప్పుడు ఆమె మధ్యలో మాట్లాడటం తనకు నచ్చలేదని రాజ్ చెబుతాడు. నేను నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను.. అవసరమైతే నామినేషన్ వేసుకో అంటూ రెచ్చిపోయింది. అప్పుడు కూడా వీరిద్దరి మధ్య వాదన జరిగింది.
శ్రీసత్య-కీర్తి మధ్య ఇగో గొడవ..
మరోవైపు శ్రీసత్య.. కీర్తిని నామినేట్ చేస్తూ ఇగో అనే పదంపై నామినేట్ చేసింది. ఇగో అనే ట్యాగ్‌ను తనకు ఇవ్వడాన్ని శ్రీసత్య కీర్తిని తప్పుపట్టింది. ఇందుకు కీర్తి.. నేను పిలుస్తున్నా నువ్వు పట్టించుకోకుండా వెళ్లిపోయావని, కనీసం పలకలేదని స్పష్టం చేసింది. అయితే తనకు వినిపించలేదని, అంతే తప్పా కావాలని పట్టించుకోకుండా వెళ్లలేదని శ్రీసత్య వివరణ ఇచ్చింది. ఇగో అనే పదానికి అర్థం తెలుసుకుని ఈ ట్యాగ్ తనకు ఇవ్వాలని సూచించింది. దీంతో కీర్తికి మండింది. తన ముందు నుంచే వెళ్తూ పిలిస్తే వినపడకపోవడం ఏంటని కీర్తి ప్రశ్నించింది. అయితే ఈ విషయంలో నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావని శ్రీసత్య మళ్లీ నోరు జారింది. దీంతో కీర్తి ఇంకాస్త వాయిస్ పెంచి మాట్లాడింది.
ఈ గొడవ ఇంతటితో ఆగలేదు. కీర్తి తన నామినేషన్ సమయంలోనూ లేవనెత్తి శ్రీసత్యను నామినేట్ చేసింది. గేమ్ ఆడేటప్పుడు రెండు, మూడు సార్లు బాగా అలిసిపోయా.. నా వల్ల కావట్లేదు అని శ్రీసత్య అనడాన్ని కీర్తి తప్పపట్టింది. ఇందుకు శ్రీసత్య వెటకారంగా మాట్లాడుతూ కౌంటర్లు వేసింది. నేను నిన్ను నామినేట్ చేశాను కాబట్టే నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు అని చెప్పొచ్చు కదా అంటూ శ్రీసత్య కీర్తిని ఉడికించింది. ఇక కీర్తి రెండో కారణం చెబుతుండగా.. మధ్యలో శ్రీసత్య కలగజేసుకోగా.. నా పాయింట్ క్రియర్ చేస్తాను.. తర్వాత నీకు టైమ్ ఇస్తాను అని కీర్తి బదులిచ్చింది. దీంతో కీర్తి రెండు చేతులు కట్టుకుని ఒకే అండి.. చెప్పండి అంటూ వెటకారం ప్రదర్శించింది. ఇలాంటి వెటకారాలే మానుకోవాలి అని స్పష్టం చేయగా.. నేను ఏం మాట్లాడినా వెటకారం అంటారేంటి అంటూ శ్రీసత్య వాదిస్తుంది. ఇగో అనే పదానికి అర్థం ఏంటో చెప్పండి అంటూ పక్కనున్న శ్రీహాన్‌ను అడుగుతుంది. ఈ విషయంపై శ్రీసత్య, కీర్తి మధ్య మరోసారి వాదన జరుగుతుంది.
ఈ వారం నామినేట్ అయిన సభ్యులు..
ఈ వారం ఫైమా.. రోహిత్-ఇనాయాను, ఆదిరెడ్డి.. శ్రీహాన్-రోహిత్‌ను, మెరీనా..రేవంత్-కీర్తిను, ఇనాయ..ఆదిరెడ్డి-రాజ్‌ను, శ్రీహాన్..రోహిత్-కీర్తిని, రాజ్..మెరీనా-ఇనాయాను, శ్రీసత్య.. ఇనాయా-కీర్తి, రోహిత్.. రేవంత్-ఆదిరెడ్డి, కీర్తి.. శ్రీసత్య-మెరీనా, రేవంత్.. రోహిత్-మెరీనాను నామినేట్ చేస్తారు. చివరగా ఈ వారం నామినేషన్‌లో కెప్టెన్ ఫైమా మినహా అందరూ నామినేషన్‌లో ఉంటారు.