Ee Nagaraniki Emaindi: పవన్, మహేష్ సినిమాల్ని దాటిన ఈ నగరానికి ఏమైంది - టాప్ ఫోర్‌లోకి ఎంట్రీ
Ee Nagaraniki Emaindi: టాలీవుడ్ రీ రిలీజ్ సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. నాలుగు రోజుల్లోనే మూడున్నర కోట్ల వసూళ్లను రాబట్టింది
Ee Nagaraniki Emaindi: రిలీజ్ టైమ్‌లో ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకొన్న ఈ నగరానికి ఏమైంది మూవీ రీ రిలీజ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద వసుళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే దాదాపు మూడున్నర కోట్ల వసూళ్లను రాబట్టింది. రీ రిలీజ్‌లో బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది.
2018 రిలీజ్ టైమ్‌లో మొత్తంగానే ఐదు కోట్ల వరకు వసూళ్లను రాబట్టిన ఈ మూవీ రీ రిలీజ్‌లో కేవలం నాలుగు రోజుల్లోనే మూడున్నర కోట్ల వసూళ్లను రాబట్టడం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. టాలీవుడ్ రీ రిలీజ్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీస్‌లో టాప్ ఫోర్ సినిమాగా ఈ నగరానికి ఏమైంది నిలిచింది. ఈ జాబితాలో ఏడున్నర కోట్ల తో ఖుషి ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా సింహాద్రి, ఆరెంజ్ రెండు, మూడో స్థానంలో ఉన్నాయి.
వాటి తర్వాత మూడున్నర కోట్లతో ఈ నగరానికి ఏమైంది నాలుగో స్థానంలో నిలిచింది. రీ రిలీజ్ కలెక్షన్స్ పరంగా పవన్ కళ్యాణ్ జల్సా, తొలిప్రేమతో పాటు మహేష్‌బాబు ఒక్కడు, పోకిరి సినిమాలు ఈ నగరానికి ఏమైంది తర్వాతే ఉండటం గమనార్హం.
స్నేహం, ప్రేమ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో విశ్వక్‌సేన్, సుశాంత్‌రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రలను పోషించారు.
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్‌బాబు ఈ మూవీని నిర్మించారు. పెళ్లిచూపులు తర్వాత తరుణ్‌భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. త్వరలోనే కీడాకోలా సినిమాతో తరుణ్ భాస్కర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.