Dunki OTT Release Date: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న షారుఖ్‌ఖాన్ డంకీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే-dunki ott release date shah rukh khan movie streaming on jio ott from february 16th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dunki Ott Release Date: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న షారుఖ్‌ఖాన్ డంకీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే

Dunki OTT Release Date: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న షారుఖ్‌ఖాన్ డంకీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Feb 07, 2024 12:02 PM IST

Dunki OTT Release Date: షారుఖ్ ఖాన్ డంకీ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఫిబ్ర‌వ‌రి 16 నుంచి జియో సినిమా ఓటీటీలో డంకీ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.

డంకీ ఓటీటీ రిలీజ్ డేట్‌
డంకీ ఓటీటీ రిలీజ్ డేట్‌

Dunki OTT Release Date: షారుఖ్‌ఖాన్‌, డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ హిరాణీ కాంబినేష‌న్‌లో రూపొందిన డంకీ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాల్ని అందుకోలేక డీలా ప‌డింది. థియేట‌ర్ల‌లో మోస్తారు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ బాలీవుడ్ మూవీ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. డంకీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ జియో సినిమా ద‌క్కించుకున్న‌ది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 16 నుంచి జియో సినిమా ఓటీటీలో డంకీ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలిసింది. డంకీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను జియో సినిమా త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

150 కోట్ల‌కు స్ట్రీమింగ్ రైట్స్‌...

గ‌త ఏడాది షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టించిన ప‌ఠాన్‌, జ‌వాన్ సినిమాలు నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించాయి. రెండు సినిమాలు వెయ్యి కోట్లకుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డంతో డంకీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జ‌రిగింది. డంకీ ఓటీటీ హ‌క్కుల‌ను జియో సినిమా 155 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. బాలీవుడ్‌లో అత్య‌ధిక ధ‌ర‌కు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా డంకీ రికార్డ్ క్రియేట్ చేసింది. షారుఖ్ కెరీర్‌లో కూడా హ‌య్యెస్ట్ రేట్‌కు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన పోయిన మూవీగా డంకీ నిలిచింది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను టీ సిరీస్ 36 కోట్ల‌కు కొనుగోలు చేసింది.

డంకీ క‌లెక్ష‌న్స్‌...

ప్ర‌భాస్ స‌లార్‌కు పోటీగా గ‌త ఏడాది డిసెంబ‌ర్ 21న డంకీ ప్రేక్ష‌క‌లు ముందుకొచ్చింది. షారుఖ్‌ఖాన్‌, రాజ్‌కుమార్ హిరాణీ కాంబోపై ఉన్న క్రేజ్ కార‌ణంగా రిలీజ్‌కు ముందు డంకీ మూవీపై భారీగా ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. కానీ రొటీన్ స్టోరీలైన్ కార‌ణంగా ఈ సినిమా యావ‌రేజ్‌గా నిలిచింది. తొలిరోజు కేవ‌లం 29 కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. 120 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన థియేట్రిక‌ల్ ర‌న్‌లో 470 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. గ‌త ఏడాది బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

తాప్సీ హీరోయిన్‌...

డంకీ సినిమాలో తాప్సీ హీరోయిన్‌గా న‌టించింది విక్కీ కౌశ‌ల్ గెస్ట్ రోల్ చేశాడు. విక్ర‌మ్ కొచ్చ‌ర్‌, అనిల్ గ్రోవ‌ర్‌, బొమ‌న్ ఇరానీ కీల‌క పాత్ర‌లు పోషించారు. అక్ర‌మంగా విదేశాల‌కు వ‌ల‌స వెళుతోన్న వారి జీవితాల నేప‌థ్యంలో డంకీ సినిమాను తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ హిరాణీ. ఇందులో హ‌ర్ ద‌యాల్ సింగ్ అలియాస్ హ‌ర్డీ సింగ్ గా ఎమోష‌న‌ల్ రోల్‌లో షారుఖ్‌ఖాన్ క‌నిపించాడు.

డంకీ క‌థ ఇదే...

హ‌ర్డీ సింగ్‌, మ‌న్నుతో పాటు ముగ్గురు స్నేహితులు త‌మ స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌డానికి డంకీ రూట్‌లో ఇండియా నుంచి ఇంగ్లండ్‌కు వ‌ల‌స వెళ‌తారు. ఈ జ‌ర్నీలో వారికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? మ‌న్ను హ‌ర్డీ సింగ్ ఇంగ్లండ్ నుంచి ఇండియాకు ఎందుకు తిరిగి వ‌చ్చాడు. లండ‌న్‌లో ఉన్న ప్రియురాలిని క‌ల‌వాల‌ని అనుకున్న సుఖీ జీవితం ఏమైంది? హ‌ర్డీ సింగ్‌, మ‌న్ను మ‌ళ్లీ క‌లుసుకున్నారా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌కు నాలుగేళ్లు దూరంగా రాజ్‌కుమార్ హిరాణీ డంకీతో రీఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న మేడిన్ ఇండియా మూవీకి రాజ్‌కుమార్ హిరాణీ క థ‌ను అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోండ‌టం గ‌మ‌నార్హం.

Whats_app_banner