Sita Ramam Hindi Day 1 Collections: హిందీలో సీతా రామం కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసా? ఉత్తరాదిన రెస్పాన్స్ ఎలా ఉందంటే?
Sita Ramam Hindi Collections: సీతా రామం హిందీ వెర్షన్ శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకుల మన్ననలు చూరగొంది. తొలి రోజు ఈ చిత్రానికి రూ.70 లక్షల వసూళ్లు లభించాయి. ఇంకా ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది.
Sita Ramam Hindi Day 1 Collections: దుల్కర్ సల్మాన్ హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేసిన చిత్రం సీతా రామం. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత నెల 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వసూళ్లు పరంగానూ మెరుగైన కలెక్షన్లు సాధించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం క్లాసిక్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్‌ను సెప్టెంబరు 2న విడుదల చేసింది.
ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచి మేరకు విడుదలైన ఈ సినిమా తొలి రోజు మెరుగైన కలెక్షన్లను సాధించింది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం మొదటి రోజు సీతా రామం హిందీ వెర్షన్‌కు రూ.70 లక్షలు వచ్చినట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే బాలీవుడ్ సినిమాలు తీయడం.. పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన క్రేజ్ అమాంతం పెంచేసుకోవడం, ఇందులో నటించి మృణాల్ ఠాకూర్ ఇప్పటికే అక్కడ గుర్తింపు పొందిన హీరోయిన్ కావడంతో సీతా రామం చిత్రాని మంచి ఆదరణ లభిస్తోంది.
హిందీ బెల్టులో తొలి రోజు రూ.70 లక్షలు అందుకున్న సీతా రామం చిత్రం.. డీసెంట్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సంఖ్య ఇకపై మరింత పెరిగే అవకాశముంది. అక్కడ కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో సినిమా వసూళ్లపై సానుకూల ప్రభావం పడనుంది. ఇప్పటికే కార్తికేయ 2కు ఇలాంటి బజే నార్త్ బెల్టులో కలిగింది. దీంతో మేకర్స్ సీతా రామం చిత్రానికి ఇదే విధంగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. పెన్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని హందీలో విడుదల చేసింది.
దుల్కర్ సరసన మృణాల్ ఠాకూర్ సీతా మహాలక్ష్మీ పాత్రలో నటించింది. రష్మిక మందన్నా కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా.. వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకాలపై అశ్విని దత్ నిర్మించారు. సుమంత్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. దక్షిణాదిన సీతా రామం ఆగస్టు 5న విడుదల కాగా.. ఉత్తరాదిన మాత్రం సెప్టెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సంబంధిత కథనం