RRR Movie |ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ స్నేహానికి నిద‌ర్శ‌నం…దోస్తీ వీడియో సాంగ్ రిలీజ్‌-dosti video song from ntr ramacharan rrr movie out today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Movie |ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ స్నేహానికి నిద‌ర్శ‌నం…దోస్తీ వీడియో సాంగ్ రిలీజ్‌

RRR Movie |ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ స్నేహానికి నిద‌ర్శ‌నం…దోస్తీ వీడియో సాంగ్ రిలీజ్‌

Nelki Naresh HT Telugu
Apr 21, 2022 04:58 PM IST

ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు ఆర్ఆర్ఆర్ యూనిట్ చ‌క్క‌టి బ‌హుమ‌తిని అందించింది. ఈ సినిమాలోని దోస్తీ ఫుల్ వీడియో సాంగ్‌ను గురువారం విడుద‌ల‌చేసింది.

ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్
ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్ (twitter)

ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం 27 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. సినిమా విడుద‌లై నెల రోజుల‌కు చేరువ అవుతున్నా వ‌సూళ్లు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇండియాలోనే కాకుండా ఓవ‌ర్‌సీస్‌లో కూడా తెలుగు సినిమా స‌త్తాను ఆర్ఆర్ఆర్ చాటిచెబుతోంది. 

ఈ సినిమాలోని దోస్తీ ఫుల్ వీడియో సాంగ్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసింది. సినిమాలో ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య స్నేహం మొద‌ల‌వ్వ‌డానికి దారితీసిన ప‌రిస్థితుల‌ను ఆవిష్క‌రిస్తూ కీల‌క‌మైన సంద‌ర్భంలో ఈ పాట వ‌స్తుంది. భిన్న ధృవాలైన నిప్పు,నీరుకు మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలా బలంగా మారిందో ఈ పాటలో అర్థవంతమైన సాహిత్యంతో చూపించారు. ఈ పాట‌కు దివంగ‌త గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. కీర‌వాణి సంగీతాన్ని అందించ‌గా అత‌డి త‌న‌యుడు కాలభైరవ ఈ పాట‌ను ఆల‌పించారు. ఇందులో ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్‌పై వ‌చ్చే విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. వారి మ‌ధ్య అనుబంధాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఎమోష‌న‌ల్ గా ఈ దోస్తీ పాటలో చూపించారు.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్