Prabhas Prashanth Neel Movie: ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీపై దిల్‌రాజు క్లారిటీ - షూటింగ్ మొద‌ల‌య్యేది ఎప్పుడంటే-dil raju reveals interesting updates about prabhas prashanth neel movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Prashanth Neel Movie: ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీపై దిల్‌రాజు క్లారిటీ - షూటింగ్ మొద‌ల‌య్యేది ఎప్పుడంటే

Prabhas Prashanth Neel Movie: ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీపై దిల్‌రాజు క్లారిటీ - షూటింగ్ మొద‌ల‌య్యేది ఎప్పుడంటే

Nelki Naresh Kumar HT Telugu
Apr 30, 2023 06:41 PM IST

Prabhas Prashanth Neel Movie: ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో చేయ‌బోతున్న సినిమాపై దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా మొద‌ల‌య్యేది ఎప్పుడ‌న్న‌ది రివీల్ చేశాడు.

ప్ర‌భాస్‌
ప్ర‌భాస్‌

Prabhas Prashanth Neel Movie: స‌లార్ త‌ర్వాత హీరో ప్ర‌భాస్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో మ‌రో మూవీ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించ‌నున్నాడు. మైథ‌లాజిక‌ల్ క‌థాంశంతో ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ భారీ బ‌డ్జెట్ మూవీపై నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి లాస్ట్ వీక్ ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్‌ల‌తో డిస్క‌ష‌న్స్ జ‌రిగిన‌ట్లు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దిల్‌రాజు పేర్కొన్నాడు. ఈ సినిమా డేట్స్‌ విష‌యంలో ప్ర‌శాంత్ నీల్ వైపు నుంచి క్లారిటీ వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నాడు. ఏం చేయాలి, ఎలా చేయాలో అత‌డితో చ‌ర్చించిన‌ట్లు దిల్ రాజు చెప్పారు.

అయితే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం మూడు, నాలుగు క‌మిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు పూర్త‌యి ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ పూర్తిగా ఫ్రీ అయిన త‌ర్వాతే ఈ ఇద్ద‌రి కాంబోలో మూవీని సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు దిల్‌రాజు చెప్పాడు. ఈ మూవీపై మ‌రోసారి దిల్‌రాజు క్లారిటీ ఇవ్వ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు ఖుషి అవుతోన్నారు.

కాగా ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ క‌ల‌యిక‌లో వ‌స్తోన్న స‌లార్ మూవీ సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కానుంది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌థాంశంతో దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

ఇందులో మ‌ల‌యాళ అగ్ర న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తోండ‌గా...శృతిహాస‌న్ కీల‌క పాత్ర పోషిస్తోంది. స‌లార్‌తో పాటు ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ కే, మారుతి సినిమాల‌తో ప్ర‌భాస్ బిజీగా ఉన్నాడు. అలాగే ప్ర‌భాస్ హీరోగా న‌టించిన పౌరాణిక సినిమా ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ కానుంది.

IPL_Entry_Point