Dil Raju Nephew Ashish Reddy: వార‌సుడి కోసం ఆస్కార్‌, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్‌ను రంగంలోకి దింపిన దిల్‌రాజు-dil raju nephew ashish reddy third movie launched on monday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Dil Raju Nephew Ashish Reddy Third Movie Launched On Monday

Dil Raju Nephew Ashish Reddy: వార‌సుడి కోసం ఆస్కార్‌, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్‌ను రంగంలోకి దింపిన దిల్‌రాజు

HT Telugu Desk HT Telugu
Aug 21, 2023 01:45 PM IST

Dil Raju Nephew Ashish Reddy: దిల్‌రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ మూడో సినిమా సోమ‌వారం లాంఛ‌నంగా మొద‌లైంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌కు త్రివిక్ర‌మ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. ఈ సినిమాకు ఆస్కార్‌, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్ ప‌నిచేయ‌బోతున్నారు. వారు ఎవ‌రంటే...

త్రివిక్ర‌మ్, ఆశిష్
త్రివిక్ర‌మ్, ఆశిష్

Dil Raju Nephew Ashish Reddy: రౌడీ బాయ్స్ సినిమాతో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. ఎంతో మంది వార‌సుల‌కు తొలి సినిమాతోనే హిట్టు ఇచ్చిన దిల్‌రాజు త‌న ఫ్యామిలీ హీరోకు మాత్రం రౌడీ బాయ్స్ తో స‌క్సెస్ అందివ్వ‌లేక‌పోయాడు.

ట్రెండింగ్ వార్తలు

భారీ ప్ర‌మోష‌న్స్‌, బ‌డ్జెట్‌తో రౌడీ బాయ్స్ ను తెర‌కెక్కించినా క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ప్ర‌స్తుతం సెల్పిష్ పేరుతో ఆశిష్ ఓ సినిమా చేస్తోన్నాడు.

ఈ ల‌వ్ స్టోరీ సెట్స్‌పై ఉండ‌గానే ఆశిష్ మూడో సినిమాను సెట్ చేశారు దిల్‌రాజు. సోమ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ఆశిష్ థ‌ర్డ్ మూవీ లాంఛ‌నంగా మొద‌లైంది. ఈ లాంఛింగ్ ఈవెంట్‌కు టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. హార‌ర్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీతో అరుణ్ అనే డైరెక్ట‌ర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

ఈ సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ ఎమ్ ఎమ్ కీర‌వాణి సంగీతాన్ని అందిస్తోండ‌గా, నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్ గా బాధ్య‌త‌ల్ని నిర్వ‌హించ‌బోతున్నారు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌న్షిత‌, హ‌ర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.

త్వ‌ర‌లోనే ఆశిష్ హార‌ర్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం. కాగా ఆశిష్ హీరోగా న‌టిస్తోన్న సెల్ఫిష్ సినిమాకు సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఇనాయా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కానుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.