Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వచ్చేస్తోంది.. వీడియో ఇదీ-crime thriller web series criminal justice season 4 coming here is disney plus hotstar announcement video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వచ్చేస్తోంది.. వీడియో ఇదీ

Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వచ్చేస్తోంది.. వీడియో ఇదీ

Hari Prasad S HT Telugu
May 17, 2024 03:25 PM IST

Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ నాలుగో సీజన్ రాబోతోంది. దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్ వీడియోను హాట్‌స్టార్ శుక్రవారం (మే 17) రిలీజ్ చేసింది.

సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వచ్చేస్తోంది.. వీడియో ఇదీ
సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వచ్చేస్తోంది.. వీడియో ఇదీ

Criminal Justice Season 4: క్రిమినల్ జస్టిస్ ఫ్రాంఛైజీ నుంచి కొత్త సీజన్ వస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను శుక్రవారం (మే 17) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రిలీజ్ చేసింది.

yearly horoscope entry point

క్రిమినల్ జస్టిస్ సీజన్ 4

హాట్‌స్టార్ లో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న క్రిమినల్ జస్టిస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మరో సీజన్ తో రాబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే అనౌన్స్ చేసింది. "కోర్టు నడుస్తోంది. అలాగే కొత్త సీజన్ కూడా సిద్ధమవుతోంది. హాట్‌స్టార్ స్పెషల్స్ క్రిమినల్ జస్టిస్ కొత్త సీజన్ తో మాధవ్ మిశ్రా వచ్చేస్తున్నాడు." అనే క్యాప్షన్ తో ఓ వీడియో పోస్ట్ చేసింది.

ఈ వీడియో కూడా ఫన్నీగా ఉంది. కోర్టులో ఓ కేసు నడుస్తున్న సమయంలో కెమెరా మెల్లగా లోపలికి వస్తుంది. ఆ సమయంలో ఈ సిరీస్ లో అడ్వొకేట్ మాధవ్ మిశ్రా పాత్ర పోషించిన పంకజ్ త్రిపాఠీ ఓ కేసు వాదిస్తూ ఉంటాడు. సడెన్ గా కెమెరా రావడం చూసి.. ఏం చేస్తున్నారు.. కోర్టు నడుస్తోంది.. వెళ్లండి.. ఒక్క నిమిషం ఆగండి.. నేను త్వరలోనే వస్తున్నాను.. అక్కడ తీరిగ్గా చూడండి.. ఇప్పుడు వెళ్లండి అని అంటాడు.

ఆ తర్వాత క్రిమినల్ జస్టిస్ కొత్త సీజన్ వచ్చేస్తోందని హాట్‌స్టార్ అనౌన్స్ చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా వెబ్ సిరీస్ లో మాధవ్ మిశ్రా అనే డిఫెన్స్ లాయర్ పాత్రలో పంకజ్ త్రిపాఠీ అద్భుతంగా నటించాడు. ఇప్పటికే వచ్చిన మూడు సీజన్లు ప్రేక్షకులను బాగా అలరించాయి.

క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్

క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019లోనే వచ్చింది. అందులో ప్రముఖ నటుడు విక్రాంత్ మస్సీ నటించాడు. తర్వాత క్రిమినల్ జస్టిస్ బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ పేరుతో వచ్చిన రెండో సీజన్లో లీడ్ రోల్లో నటి కీర్తి కుల్హరి నటించింది. ఇక మూడో సీజన్ కూడా 2022లోనే అధూరా సచ్ పేరుతో వచ్చింది. ఈ మూడింట్లోనూ ఆధారాలు లేకుండానే జైలు శిక్ష అనుభవిస్తున్న బాధితుల తరఫున పోరాడే అడ్వొకేట్ మాధవ్ మిశ్రాగా పంకజ్ త్రిపాఠీ నటించాడు.

మూడు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తొలి రెండు సీజన్లు అయితే బాగా ఆకట్టుకుంటాయి. ఇండియన్ జైళ్లలో ఉండే పరిస్థితులను కూడా ఈ సిరీస్ కళ్లకు కట్టింది. ఇక బాధితుల తరఫున మాధవ్ మిశ్రా చేసే పోరాటం, వాళ్లను నిరపరాధులుగా తేల్చడానికి సేకరించే ఆధారాలు చాలా ఇంట్రెస్టింగా సాగుతాయి. ఎలాంటి పాత్రలో అయినా జీవించేసే పంకజ్ త్రిపాఠీ ఈ క్రిమినల్ జస్టిస్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

మరి అతడు ఈ నాలుగో సీజన్లో ఎలాంటి కొత్త కేసుతో వస్తాడో.. ఏం చేస్తాడో అన్న ఆసక్తి క్రిమినల్ జస్టిస్ ఫ్రాంఛైజీ అభిమానుల్లో నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి.

Whats_app_banner