Crew OTT Release Date: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ముగ్గురు ముద్దుగుమ్మల రూ.100 కోట్ల సినిమా-crew ott release date tabu kareena kapoor kriti sanon starrer to stream in netflix from friday may 24th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crew Ott Release Date: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ముగ్గురు ముద్దుగుమ్మల రూ.100 కోట్ల సినిమా

Crew OTT Release Date: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ముగ్గురు ముద్దుగుమ్మల రూ.100 కోట్ల సినిమా

Hari Prasad S HT Telugu
May 23, 2024 06:22 PM IST

Crew OTT Release Date: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ వస్తోంది. బాలీవుడ్ ముగ్గురు ముద్దుగుమ్మలు నటించిన క్రూ మూవీ శుక్రవారం (మే 24) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ముగ్గురు ముద్దుగుమ్మల రూ.100 కోట్ల సినిమా
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ముగ్గురు ముద్దుగుమ్మల రూ.100 కోట్ల సినిమా

Crew OTT Release Date: ఓటీటీలో ఈ వీకెండ్ మనల్ని టైంపాస్ చేయడానికి మరో బాలీవుడ్ మూవీ రాబోతోంది. ఈ ఏడాది ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అతి కొద్ది సినిమాల్లో ఒకటి క్రూ (Crew). టబు, కరీనా కపూర్, కృతి సనన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

క్రూ(Crew) ఓటీటీ రిలీజ్ డేట్

బంగారం స్మగ్లింగ్ చేసే ముగ్గురు ఎయిర్ హోస్టెస్ ల చుట్టూ తిరిగే క్రూ (Crew) మూవీ థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. అందులోనూ బాలీవుడ్ కు చెందిన ముగ్గురు సీనియర్ హీరోయిన్లు టబు, కరీనా కపూర్, కృతి సనన్ నటించిన మూవీ ఇది. ఈ సినిమా శుక్రవారం (మే 24) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.

రాజేష్ ఎ కృష్ణన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ సంయుక్తంగా నిర్మించాయి. థియేటర్లలో సక్సెసైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న ఆశాభావంతో మేకర్స్ ఉన్నారు. ముగ్గురు ఎయిర్ హోస్టెస్ ల బంగారం స్మగ్లింగ్ కు కామెడీని జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు.

క్రూ మూవీ గురించి..

నష్టాల్లో ఉన్న ఓ ఎయిర్ లైన్స్ లో పనిచేసే ముగ్గురు ఎయిర్ హోస్టెస్ ల చుట్టూ ఈ క్రూ మూవీ తిరుగుతుంది. ఎప్పటికైనా తమ జీతాలు పెరిగి జీవితాలు బాగుపడతాయన్న ఆశతో ఉన్న వారికి తమ ఎయిర్ లైన్స్ దివాళా తీసిందన్న నిజం తెలుస్తుంది. అప్పటి నుంచి బంగారం స్మగ్లింగ్ లోకి వాళ్లు దిగుతారు. కస్టమ్స్ వారి కళ్లు గప్పి ఈ స్మగ్లింగ్ చేస్తూ బాగానే సంపాదిస్తారు.

విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. అయితే వీళ్ల ఈ స్మగ్లింగ్ ఎంత కాలం నడుస్తుంది? వీళ్లు చేసే స్మగ్లింగ్ తెలిసిపోయి జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందా అన్నది ఈ క్రూ మూవీ చూస్తే తెలుస్తుంది. మార్చి 29న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్ల మార్క్ టచ్ చేసి సంచలనం సృష్టించింది.

నెట్‌ఫ్లిక్స్ లేటెస్ట్ రిలీజెస్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి లాపతా లేడీస్, సైతాన్, ఆర్టికల్ 370లాంటి సినిమాలు కూడా రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. లాపతా లేడీస్ అయితే యానిమల్ మూవీ రికార్డును కూడా బ్రేక్ చేయడం విశేషం. మరి ఈ క్రూ మూవీ ఏం చేస్తుందో చూడాలి.

టీ20 వరల్డ్ కప్ 2024