Chiru Godfather OTT Platform: గాడ్‌ఫాద‌ర్ ఓటీటీ డీల్ ఫిక్స్ - చిరంజీవి సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే-chiranjeevi godfather digital rights acquired by netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Chiranjeevi Godfather Digital Rights Acquired By Netflix

Chiru Godfather OTT Platform: గాడ్‌ఫాద‌ర్ ఓటీటీ డీల్ ఫిక్స్ - చిరంజీవి సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే

చిరంజీవి
చిరంజీవి (twitter)

Chiru Godfather OTT Platform: చిరంజీవి హీరోగా పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన చిత్రం గాడ్‌ఫాద‌ర్‌. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్5న రిలీజ్ కానుంది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకున్న‌దంటే...

Chiru Godfather OTT Platform: గాడ్‌ఫాద‌ర్ సినిమాతో ద‌స‌రాకు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ (Salman khan) కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ ఆధారంగా ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా... గాడ్‌ఫాద‌ర్ సినిమాను రూపొందిస్తున్నారు.న‌య‌న‌తార‌(Nayanthara), స‌త్య‌దేవ్ (Satyadev) మెయిన్ రోల్స్ లో చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి కుటుంబానికి ఎదురైన స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే గ్యాంగ్ స్టర్ గా చిరంజీవి ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్నాడు.

కాగా గాడ్ ఫాదర్ డిజిట‌ల్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెటిఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో డిజిట‌ల్ రైట్స్ కోసం గ‌ట్టి పోటీ నెల‌కొన్న‌ట్లు తెలిసింది. ఈ పోటీలో భారీ ధ‌ర‌కు నెట్‌ఫ్లిక్స్ (Netflix) స్ట్రీమింగ్ హక్కులను ద‌క్కించుకున్న‌ట్లు చెబుతున్నారు. థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఆరు వారాల త‌ర్వాత ఓటీటీలో సినిమాను రిలీజ్ చేసేలా నిర్మాత‌ల‌కు, ఓటీటీ సంస్థ‌కు మ‌ధ్య ఒప్పందం జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు.

ఇందులో స‌త్య‌ప్రియ జ‌య‌దేవ్ అనే పాత్ర‌లో న‌య‌న‌తార క‌నిపించ‌బోతున్న‌ది. గాడ్ ఫాదర్ ను కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ ప‌తాకాల‌పై ఎన్వీప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవ‌ల ఈ సినిమా టీజ‌ర్‌తో పాటు ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.