Laapataa Ladies Movie: తక్కువ బడ్జెట్‍తో స్టార్ నటీనటులు లేకుండా తెరకెక్కిన లాపతా లేడీస్ సినిమా భారీస్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ప్రేక్షకులతో పాటు చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ చిత్రం పొగడ్తల వర్షం కురిపించారు. లాపతా లేడీస్ చిత్రానికి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించారు. మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. ఏప్రిల్ 26న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమాకు చాలా పాపులారిటీ, ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో మంజూ మాయ్ పాత్ర అందరినీ ఆలోచింపజేసింది.
లాపతా లేడీస్ మూవీలో.. కొత్తగా పెళ్లయిన దీపక్ కుమార్ (స్పర్ష్ శ్రీవాత్సవ) నుంచి తప్పిపోయి.. ఓ రైల్వే స్టేషన్‍లో దిగుతుంది పూల్ కుమారి (నితాన్షి గోయల్). దిక్కుతోచని స్థితిలో ఉన్న పూల్‍కు రైల్వే స్టేషన్‍లో స్టాల్ నడుపుకునే మంజూ మాయ్ (ఛాయా కదమ్) ఆశ్రయం ఇస్తారు. మంజూ మాయ్ తన కుటుంబాన్ని కాదని సొంతంగా జీవించే ధైర్యవంతమైన మహిళ. కుటుంబ కట్టుబాట్ల మధ్య వంట తప్ప బయటి ప్రపంచం తెలియకుండా పూల్ కుమారి పెరిగి ఉంటుంది. భర్త ఊరేదో కూడా మరిచిపోతుంది. దీంతో బయటి పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ఎలా జీవించాలో పూల్‍కు చెబుతారు మంజూ మాయ్. ఈ క్రమంలో లాపతా లేడీస్ సినిమాలో కొన్ని పవర్‌ఫుల్ డైలాగ్‍లు ఉంటాయి. అందరినీ ఆలోచింపజేస్తాయి. సంభాషణలు సింపుల్‍గా ఉన్నా.. వాటి వెనుక అర్థాలు పవర్‌ఫుల్‍గా అనిపిస్తాయి.
లాపతా లేడీస్‍లో మంజూ మాయ్ పాత్రలో ఛాయా కదమ్ అందరినీ ఆలోచింపజేసేలా డైలాగ్స్ చెప్పారు. ప్రస్తుతం హిందీలో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుండగా.. డైలాగ్‍లను ఇక్కడ తెలుగులో అనువదించాం.
లాపతా లేడీస్ చిత్రంలో మంజూ మాయ్ చెప్పే మరిన్ని డైలాగ్‍లు ఆలోచింపజేస్తాయి. పూల్, మంజూ మాయ్ మధ్య సంభాషణలు అన్నీ సింపుల్‍గా ఉంటూనే మనసును తాకుతాయి. ఆమె మాటలతో పూల్ చాలా మారుతుంది. భర్త దగ్గరికి వెళ్లినా తన సొంతకాళ్లపై నిలబడాలని నిర్ణయించుకుంటుంది.
మంజూ మాయ్ పాత్రలో సీనియర్ నటి ఛాయా కదమ్.. లాపతా లేడీస్ సినిమాలో అద్భుతంగా నటించారు. ఈ మూవీ చూసిన అందరికీ ఆమె పాత్ర ప్రత్యేకంగా గుర్తు ఉంటుంది.
కట్టుబాట్లు, అచారాల పేరుతో మహిళల ఎదుర్కొంటున్న ఆంక్షలు, వివక్ష, ఇబ్బందులను లాపతా లేడీస్ మూవీలో దర్శకురాలు కిరణ్ రావ్ చూపించారు. ఇంత సీరియస్ సబ్జెక్టును ఎంటర్‌టైనింగ్‍గా, హృదయాలను హత్తుకునే విధంగా చూపించడంతో ఈ మూవీ బాగా సక్సెస్ అయింది.
లాపతా లేడీస్ చిత్రంలో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ రంట, రవికిషన్, ఛాయా కదమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతిభ రంట చేసిన పుష్ప రాణి అలియాజ్ జయ పాత్ర కూడా ప్రధానమైనది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్ తమ నటనతో ఆకట్టుకున్నారు. రవికిషన్, ఛాయా మినహా మిగిలిన వారు కొత్త నటులే అయినా అందరూ మెప్పించారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు.