Chiranjeevi: చైతన్యను చిరంజీవి అని పిలుస్తున్నారు.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-chaitanya rao called as chiranjeevi for sharathulu varthisthai role says director kumaraswamy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chaitanya Rao Called As Chiranjeevi For Sharathulu Varthisthai Role Says Director Kumaraswamy

Chiranjeevi: చైతన్యను చిరంజీవి అని పిలుస్తున్నారు.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 17, 2024 06:05 AM IST

Chaitanya Rao Sharathulu Varthisthai Success Meet: చైతన్య రావు తాజాగా నటించిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ షరతులు వర్తిస్తాయి. మార్చి 15న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో షరతులు వర్తిస్తాయి సక్సెస్ మీట్ నిర్వహించారు.

చైతన్యను చిరంజీవి అని పిలుస్తున్నారు.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చైతన్యను చిరంజీవి అని పిలుస్తున్నారు.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Chaitanya Rao Chiranjeevi: చైత‌న్య రావు, కన్నడ బ్యూటి భూమి శెట్టి జోడీగా యాక్ట్ చేసిన సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమాకు కుమార‌స్వామి (అక్ష‌ర‌ కుమార్) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మార్చి 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ మిడిల్ క్లాస్ బయోపిక్ వంటి మూవీకి ప్రశంసలు వస్తున్నాయి. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో షరతులు వర్తిస్తాయి మూవీ టీమ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చైతన్య రావుపై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

"మంచి సినిమా చేశామని మేము ఎంత చెప్పుకున్నా.. మీరు ఇచ్చే చిన్న పాజిటివ్ రెస్పాన్స్ ఎంతో హెల్ప్ చేస్తుంటుంది. అలాంటి మౌత్ టాక్ మాకు ఇప్పుడు కావాలి. మీరు ఒకవేళ సినిమా చూసి ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి సినిమాకు మీడియా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు. మా జీఎస్‌కే మీడియా అండగా నిలబడింది. నిన్న షో చూసి నా చిరంజీవి క్యారెక్టర్ బాగుందని పర్సనల్‌గా వచ్చి చెప్పారు" అని హీరో చైతన్య రావు తెలిపాడు.

"రివ్యూస్‌లోనూ నా బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చానని రాశారు. నాకు ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే నా ప్రతి సినిమాలోనూ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి ఒక మంచి సినిమా. ఈ సినిమా చూసేందుకు ఎలాంటి షరతులు లేవు. మీ దగ్గరలోని థియేటర్‌కు వెళ్లి చూడండి. రెండు గంటలు ఎంగేజ్ అవుతారు" అని చైతన్య రావు పేర్కొన్నాడు.

"మా ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి సినిమాకు రిలీజైన అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు తమ ఆదరణ చూపిస్తున్నారు. ఆర్టిస్టులకు మా సినిమాలోని క్యారెక్టర్స్ పేర్లు వచ్చేశాయి. చైతన్యను చిరంజీవి అని పిలుస్తున్నారు. మంచి సినిమాకు సక్సెస్ తప్పకుండా దక్కుతుందనే మా నమ్మకం నిజమైంది. మీడియా నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మౌత్ టాక్ పెరుగుతోంది" అని డైరెక్టర్ కుమారస్వామి (అక్షర కుమార్) తెలిపారు.

"అన్నా మేము ఇవాళ ఈ థియేటర్‌లో సినిమా చూస్తున్నామంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ సినిమా మేకింగ్ టైమ్‌లో ఎందరో తమ సహకారం అందించారు. వారందరికీ నా కృతజ్ఞతలు చెబుతున్నా" అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు. "షరతులు వర్తిస్తాయి సినిమాకు మీరు చూపిస్తున్న ఆదరణ సంతోషాన్నిస్తోంది. ఈ సినిమాలో శంకరన్న క్యారెక్టర్ చేశాను. నా సుదీర్ఘమైన నట ప్రయాణంలో మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తైతే.. ఈ శంకరన్న క్యారెక్టర్ మరో స్టేజీకి తీసుకెళ్లింది. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడే కథలో దానికున్న ఇంపార్టెన్స్ తెలిసింది. నాకు ఇంతమంచి రోల్ ఇచ్చిన దర్శకుడు అక్షర కుమార్ గారికి థ్యాంక్స్" అని నటుడు సంతోష్ యాదవ్ అన్నారు.

"నాతో పాటు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన నా మిత్రులు నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండాకు థ్యాంక్స్ చెబుతున్నా. షరతులు వర్తిస్తాయి సినిమాకు మీరు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌తో చాలా హ్యాపీగా ఉన్నాం. మీడియా నుంచి మంచి రేటింగ్స్ వచ్చాయి. ఒక మంచి సినిమా చేశామనే సంతృప్తి నిర్మాతలుగా మాకు దక్కింది. సమాజానికి ఉపయోగపడేలా ఉంటూనే ఒక భర్తగా, ఒక మంచి ఫ్రెండ్‌గా హీరోను ఆదర్శంగా చూపించాం. ఒక గుడ్ మెసేజ్‌తో ఉన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మా సినిమాకు మీ అందరూ మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం" అని నిర్మాత డా. కృష్ణకాంత్ చిత్తజల్లు తెలిపారు.

WhatsApp channel